E-Paper
Advertisement

తోటకూర వెల్లుల్లి కారం ఇలా చేస్తే..లొట్టలేసుకుంటూ తింటారు!

తోటకూర వెల్లుల్లి కారం ఇలా చేస్తే..లొట్టలేసుకుంటూ తింటారు!
Advertisement

Thotakura vellulli karam: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే.. ఆకుకూరల్లో తోట కూర ముందుంటుంది. అయితే.. ఎప్పుడూ చేసే సాంబార్ లేదా పప్పు కాకుండా.. కొంచెం కారం కారంగా, వెల్లుల్లి సువాసనతో అద్భుతంగా ఉండే ‘తోటకూర వెల్లుల్లి కారం’ ట్రై చేశారా? వేడి వేడి అన్నంలోకి ఈ కూర వేసుకుని తింటే ఆ రుచే వేరు. అంతే కాకుండా దీన్ని తయారు చేయడం చాలా ఈజీ, తక్కువ ఖర్చుతోనూ ఇది అయిపోతుంది. మరి ఇంట్లోనే ఈ విలేజ్ స్టైల్ కూరను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామా!

మన ఆరోగ్యానికి ఆకుకూరలు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తోట కూరలో ఐరన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. రోజూ కూరగాయలు తిని బోర్ కొట్టినప్పుడు, అమ్మమ్మల కాలం నాటి పద్ధతిలో కమ్మటి వెల్లుల్లి కారం దట్టించి తోటకూర కూర వండుకుంటే ఆ తింటే మజానే వేరు. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ తిని విసిగిపోయిన మన ఇళ్లలో ఇలాంటి ట్రెడిషనల్, హెల్దీ రెసిపీలు చేసుకుంటే ఆరోగ్యంకూడా ఉండొచ్చు. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ తోటకూర వెల్లుల్లి కారం ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్..

కావలసిన పదార్థాలు :

Advertisement

తోటకూర కట్టలు -2 పెద్దవి

వెల్లుల్లి రెబ్బలు -10-12

Advertisement

ఎండుమిర్చి లేదా కారం- 2 టేబుల్ స్పూన్లు

జీలకర్ర, ఆవాలు, మినపప్పు (పోపు దినుసులు)- తగినంత

పసుపు, ఉప్పు- తగినంత

నూనె -2 టేబుల్ స్పూన్లు

తరిగిన ఉల్లిపాయ- 1 కప్పు

తయారీ విధానం:

1: ముందుగా తాజా తోటకూరను తెచ్చుకుని ఆకులను, లేత కాడలను వేరు చేసుకోవాలి. వాటిని ఉప్పు వేసిన నీటిలో శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి. ఇలా చేయడం వల్ల ఆకుకూరపై ఉండే మట్టి పూర్తిగా పోతుంది. ఆ తర్వాత తోటకూరను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.

2:ఈ కూరకి మెయిన్ హైలైట్ వెల్లుల్లి కారం! ఒక రోకలి బండ లేదా మిక్సీ జార్ తీసుకుని అందులో.. పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, తగినంత కారం (లేదా ఎండుమిర్చి), కొద్దిగా ఉప్పు, అర స్పూన్ జీలకర్ర వేయాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ వెల్లుల్లి కారం వాసనే కూర మొత్తానికి మంచి రుచిని ఇస్తుంది.

3: ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసి చిటపటలాడించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసి పచ్చి వాసన పోయే వరకు ఒక్క నిమిషం పాటు వేయించాలి.

4: ఇప్పుడు తరిగి పెట్టుకున్న తోటకూరను కడాయిలో వేయాలి. తోట కూర వేసిన వెంటనే ఎక్కువ కనిపిస్తుంది కానీ మగ్గిన తర్వాత చాలా తక్కువైపోతుంది. అందులో చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. ఆకుకూరలో నుంచి నీరు బయటకు వస్తుంది. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నీరంతా ఇంకిపోయే వరకు మూతపెట్టి ఉడికించుకోవాలి.

Also Read: హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ మసాలా వడ..ఈవెనింగ్ స్నాక్స్‌కి పర్ఫెక్ట్!

5: తోట కూర పూర్తిగా మగ్గి, నూనె కొద్దిగా పైకి తేలుతున్న సమయంలో.. మరోసారి బాగా కలుపుకోవాలి. చివరిగా.. దించే ముందు కొద్దిగా దంచిన వెల్లుల్లి పొడి లేదా మరొక వెల్లుల్లి రెబ్బల పేస్ట్ పైన చల్లుకుంటే.. ఆ ఫ్లేవర్ అదిరిపోతుంది. అంతే..గుమగుమలాడే రుచికరమైన తోట కూర వెల్లుల్లి కారం కూర రెడీ!

ఈ కూర వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే.. అమృతంలా ఉంటుంది. అలాగే చపాతి లేదా జొన్న రొట్టెలోకి కూడా బాగుంటుంది. పిల్లలకు కూడా లంచ్‌ బాక్స్‌లో పెడితే ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ తోటకూర వెల్లుల్లి కారాన్ని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి!

Related News

పర్ఫెక్ట్ కొలతలతో..తియ్యని చక్కెర పొంగలి క్షణాల్లోనే రెడీ చేయండిలా!

నోట్లో వేస్తే కరిగిపోయే ఆలూ మలై టిక్కీ..తయారీ విధానం ఇదే!

మీ ఇంటి పెరట్లో ఈ మొక్కలు ఉన్నాయా? అయితే, పాములు, దోమలతో నో టెన్షన్!

స్కూల్‌ వెళ్లడానికి మీ పిల్లాడు భయపడుతున్నాడా? పిల్లలు బుల్లీయింగ్‌‌కు గురవుతున్నట్లు తెలిపే సంకేతాలు ఇవే

చాణక్య నీతి.. మీ జీవితం ఇతరుల చేతిలో కీలుబొమ్మగా మారిందా? ఈ తప్పుడు అలవాట్లే కారణం

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పార్సల్ బాక్స్‌లు పడేయకండి.. ఈ 3 విషయాలు తప్పకుండా చెక్ చేయాలి

కుటుంబ విలువలు, సంప్రదాయాల గురించి పిల్లలకు ఇలా నేర్పండి..

Big Stories

Advertisement
×