E-Paper
Advertisement

ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!

ప్రపంచంలోనే బుల్లి నది.. పొడవు కేవలం 20 మీటర్లే.. కనుచూపు మేరలోనే కనుమరుగు!
Advertisement

Shortest Rivers: ప్రకృతి ఒడిలో వేల కిలోమీటర్ల మేర ప్రవహించే జీవనదులను ఎన్నో చూసుంటాం. కానీ కనుచూపు మేర దూరంలోనే తమ ప్రయాణాన్ని ముగించే వింత నదుల గురించి ఎప్పుడైనా విన్నారా? మైదానాలు, పర్వతాల గుండా సాగే సుదీర్ఘ ప్రయాణాలకు భిన్నంగా కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే కడలి ఒడికి చేరే ఈ చిన్న నదులు.. ప్రపంచంలోనే అత్యంత ఆశ్చర్యకరమైన ప్రకృతి అద్భుతాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను, పరిశోధకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

చిన్న నదిగా ఎలా పరిగణిస్తారు?

సాధారణంగా నది అంటే ఒక ఊట వద్ద ప్రారంభమై సుదీర్ఘ దూరం ప్రవహించి చివరికి సముద్రంలోనో లేదా మరో పెద్ద నదిలోనో కలుస్తుంది. అయితే అత్యంత చిన్న నదుల విషయంలో ఈ ప్రయాణం చాలా సంక్షిప్తంగా ఉంటుంది. ఎంతలా అంటే కొన్ని నదుల పొడవు ఒక ఫుట్‌బాల్ మైదానం కంటే కూడా తక్కువగా ఉండటం గమనార్హం. భూగర్భ జలాలు, ఊటలు లేదా సరస్సుల నుంచి మొదలయ్యే నీరు.. వెంటనే దగ్గరలోని సముద్రంలోకి కానీ, పెద్ద నదిలోకి కానీ చేరడం వల్ల ఇవి ఏర్పడతాయి.

ప్రపంచంలోనే బుల్లి నది ఇదే..

Advertisement

ఇండోనేషియాలోని ఆగ్నేయ సులవేసి ప్రాంతంలో ప్రవహించే ‘తంబోరాసి నది’ ప్రపంచంలోనే అత్యంత చిన్న నదిగా గుర్తింపు పొందింది. ఈ నది పొడవు కేవలం 20 మీటర్లు మాత్రమే. సుమారు 15 మీటర్ల వెడల్పు ఉండే ఈ చిన్న నది.. సహజసిద్ధమైన ఊట నుంచి నీటితో బయలుదేరి వెంటనే ‘ఫ్లోరెస్ సముద్రం’లో కలిసిపోతుంది. తెల్లటి ఇసుక తిన్నెలు, స్వచ్ఛమైన నీటితో ఉండే ఈ ప్రాంతం.. పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది.

యూరప్‌లోనే ఈ అద్భుతాలు ఎక్కువ

యూరప్ ఖండంలో ఇటువంటి వింత నదులు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నోర్వేలోని ‘కోవాసెల్వా నది’ పొడవు కేవలం 22 మీటర్లు మాత్రమే. ఇది కోవాస్‌వాట్నెట్ సరస్సు నుంచి ప్రారంభమై నార్వేజియన్ సముద్రంలో కలుస్తుంది. అలాగే జార్జియాలోని ‘రెప్రువా నది’.. 27 మీటర్ల పొడవుతో ప్రపంచంలోనే అతిచిన్న నదుల జాబితాలో నిలిచింది. క్రొయేషియాలోని ‘ఒంబ్లా నది’ దాదాపు 30 మీటర్ల పొడవు కలిగి ఉంది. భూగర్భంలోంచి వచ్చే నీటి ప్రవాహం నదిగా మారి ఎంత త్వరగా సముద్రంలో కలిసిపోతుందో చెప్పడానికి వీటిని ఉదాహరణగా చెప్పవచ్చు.

స్లోవేనియా, అమెరికాలో సైతం..

Advertisement

అటు స్లోవేనియాలో ప్రవహించే ‘జెజెర్నికా నది’ పొడవు సుమారు 55 మీటర్లు. ఇది డివ్జే జెజెరో సరస్సును, ఇద్రిజ్కా నదితో అనుసంధానిస్తుంది. అటు అమెరికాలోని మోంటానా ప్రాంతంలో ప్రవహించే ‘రో నది’ పొడవు కేవలం 61 మీటర్లు మాత్రమే. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిచిన్న నదిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో కూడా ఇది చోటు దక్కించుకుంది. వీటితో పాటు కరేబియన్ తీరంలో ఉండే ‘రియో లాస్ పాటోస్’ నది కూడా 61 మీటర్ల పొడవుతో క్రిస్టల్ క్లియర్ నీటితో ప్రవహిస్తూ టూరిస్టులను మైమరిపిస్తోంది.

Also Read: ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. హిందూ పద్ధతిలో పెళ్లి.. 6 నెలల తర్వాత బయటపడ్డ భర్త అసలు రంగు!

చిన్నవైనా… సేవలు పెద్దవే!

పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ ఈ నదుల ప్రాముఖ్యత తక్కువేమీ కాదు. ఇవి స్థానిక జలచరాలకు, జీవవైవిధ్యానికి అవసరమైన పర్యావరణ వ్యవస్థను అందిస్తున్నాయి. అంతేకాకుండా భూగర్భ జలాల ప్రవాహ సరళిని అధ్యయనం చేయడానికి పరిశోధకులకు ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నదుల అందాలు, వాటి వెనుక ఉన్న భూగోళశాస్త్ర వింతలను చూడటానికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు రావడం వల్ల ఇవి స్థానికంగా గొప్ప పర్యాటక కేంద్రాలుగానూ వికసిస్తున్నాయి.

Also Read: గులాబీ ముల్లు.. కొణతం దిలీప్‌..! ఆయన చేతిలో బడానేత కీలుబొమ్మ.. దుందుడుకు మనస్తత్వానికి, పక్కదారి పట్టించే సలహాలు..!

Tags

Related News

‘హనుమాన్ అంశ్’ మూవీ ఎఫెక్ట్.. కైంచి ధామ్‌లో ఏకంగా 20 కి.మీ. ట్రాఫిక్ జామ్!

అమ్మబాబోయ్.. ఆర్టీసీ బస్సులో ఇన్ని సౌకర్యాలా? సీటుకో టీవీ, ఎయిర్ హోస్టెస్, నచ్చిన ఆహారం!

లైఫ్ టైమ్ ఫ్రీ ఫ్లైట్ పాస్.. పైలట్‌ స్మిత్ మచ్చార్‌కు ఇజ్రాయెల్ సూపర్ గిఫ్ట్!

వెదురు సాగుతో సిరుల వర్షం.. ఒక్కసారి నాటితే ఏళ్ల పాటు ఆదాయం!

లోకో పైలెట్ vs అసిస్టెంట్ లోకో పైలెట్.. ఇద్దరిలో అసలు రైలును నడిపేది ఎవరు?

సకినాలు, సర్వ పిండి నుంచి బిర్యానీ వరకు.. బేగంపేటలో తెలంగాణ రుచుల విందు!

సోలార్ ప్యానెళ్లతో భవిష్యత్తులో ముప్పు తప్పదా? 25 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందంటే?

Big Stories

Advertisement
×