BigTV English

Face Toner: ఫేస్ టోనర్ ఇలా తయారు చేసుకుని వాడితే.. రెట్టింపు అందం

Face Toner: ఫేస్ టోనర్ ఇలా తయారు చేసుకుని వాడితే.. రెట్టింపు అందం

Face Toner: అందంగా కనిపించడానికి వివిధ రకాల ప్రొడక్ట్స్ ప్రతి రోజు వాడుతుంటాము. కానీ ఫేస్ టోనర్ వాడే వారి సంఖ్య చాలా తక్కువనే చెప్పాలి.క్లె న్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అనేవి గ్లోయింగ్ స్కిన్ కోసం చాలా బాగా ఉపయోగపడతాయి. క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్ చాలా మందికి తెలిసినవే.. కానీ టోనింగ్ అనేది మహిళలకు అర్థం కాని విషయం. చర్మానికి ఏ సహజ టోనర్లు పనిచేస్తాయో తెలియకపోవడం వల్ల వీటిని వాడే వారు తక్కువగా ఉంటారు.


టోనర్ యొక్క ప్రయోజనాలు:
టోనర్లు చాలా తేలికగా ఉంటాయి. కానీ ఇవి చర్మానికి ఉపయోగపడే అనేక సహజ పదార్థాలతో నిండి ఉంటాయి. అన్ని చర్మ రకాల కోసం ఇంట్లోనే మనం ఫేస్ టోనర్స్ తయారు చేసుకోవచ్చు. ఇవి సహజమైనవి కాబట్టి చర్మాన్ని ఆరోగ్యంగా, తాజాగా, ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడతాయి.

టోనర్ ఎలా ఉపయోగించాలి ?


చర్మం కొద్దిగా తడిగా ఉన్నప్పుడే.. ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే టోనర్ వాడండి. ఇలా చేయడం వల్ల చర్మంలోకి టోనర్ ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పొడి చర్మం ఉన్న వారు టోనర్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

డ్రై స్కిన్ కోసం టోనర్:

ఈ టోనర్ తయారు చేయడానికి.. అర టీస్పూన్ విటమిన్ ఇ ఆయిల్, కొంత లావెండర్ ఆయిల్ కలపండి. తర్వాత ఇందులో రోజ్ వాటర్ కలిపి మిక్స్ చేయండి. దీనిని ముఖానికి వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అలోవెరా టోనర్:
కలబందలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో తయారు చేసిన టోనర్ మీ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడటమే కాకుండా మీ చర్మాన్ని ప్రశాంతంగా మారుస్తుంది.

తయారీ విధానం:

దీనిని తయారు చేయడానికి.. 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ లో కాస్త రోజ్ వాటర్‌ను వేసి బాగా మిక్స్ చేయండి. తరువాత దీనిని స్ప్రే బాటిల్‌లో పోసి రోజుకు రెండుసార్లు వాడండి.

దోసకాయతో టోనర్:
ఇది సూపర్ హైడ్రేటింగ్ , ముఖానికి తక్షణ మెరుపును ఇచ్చే టోనర్. దీనిని ఉపయోగించడం వల్ల సున్నితమైన చర్మానికి సంబంధించిన అన్ని సమస్యలను తొలగిపోతాయి.

తయారీ విధానం:
దీనిని తయారు సిద్ధం చేయడానికి.. ఒక దోసకాయను తురుముకోవాలి. తర్వాత దాని నుండి రసాన్ని తీయండి. అనంతరం దానికి 3-4 చెంచాల తాజా అలోవెరా జెల్ వేసి గాలి చొరబడని సీసాలో నింపండి. దీనిని ఫ్రిజ్‌లో ఉంచి రోజుకు రెండుసార్లు వాడండి.

జిడ్డుగల చర్మం కోసం టోనర్:
జిడ్డు చర్మం ఉన్న వారికి అధిక సెబమ్ కారణంగా, మొటిమలు, మచ్చల వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడే, నూనెలను సమతుల్యం చేసే పదార్థాలను ఉపయోగించి సహజ టోనర్‌ను తయారు చేయడం ముఖ్యం.

Also Read: ఊడిన చోట జుట్టు ఒత్తుగా పెరగాలంటే.. ?

లావెండర్ టోనర్:
లావెండర్ ఆయిల్ యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖంపై అదనపు నూనె ఉత్పత్తిని నిరోధిస్తుంది.

లావెండర్ టోనర్ ఎలా తయారు చేయాలి ?

దీనిని తయారు చేయడం చాలా సులభం. ఇందు కోసం.. పావు కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకొని, అందులో అర కప్పు చల్లని హెర్బల్ టీ వేసి, ఆపై 8-10 చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. తరువాత.. బాగా కలిపి, ఒక సీసాలో నిల్వ చేయండి.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×