Cleaning Tips: ఇత్తడి పాత్రలను ఉపయోగించడం చాలా వరకు తగ్గింది. అయినప్పటికీ దాదాపు ఇత్తడి పాత్రలు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. ఇత్తడి పాత్రలు కాలక్రమేణా రంగు మారడం సర్వ సాధారణం. కానీ వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా ఉంటే మాత్రం.. నల్లగా మారిపోతుంటారు. ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల హోం చిట్కాలు పాటించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మరి రంగు మారిన ఇత్తడి వస్తువులను తిరిగి కొత్తవాటిలా మార్చేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇత్తడి పాత్రలను ఉపయోగించడం చాలా వరకు తగ్గింది. అయినప్పటికీ దాదాపు ఇత్తడి పాత్రలు ప్రతి ఇంట్లో కనిపిస్తాయి. ఇత్తడి పాత్రలు కాలక్రమేణా రంగు మారడం సర్వ సాధారణం. కానీ వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా ఉంటే మాత్రం.. నల్లగా మారిపోతుంటారు. ఇలాంటి సమయంలోనే కొన్ని రకాల హోం చిట్కాలు పాటించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. మరి రంగు మారిన ఇత్తడి వస్తువులను తిరిగి కొత్తవాటిలా మార్చేందుకు ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇత్తడి పాత్రలపై ఉన్న నలుపుదనాన్ని తొలగించి, వాటిని తెల్లగా మెరిసేలా చేయడం చాలా ముఖ్యం. ఇత్తడి పాత్రలను పాలిష్ చేయడంలో కొన్ని పద్ధతులు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఇత్తడి పాత్రలను శుభ్రం చేసే మార్గాలు:
చింతపండు , ఉప్పు: కాస్త చింతపండును నీటిలో నానబెట్టి దాని గుజ్జును తీయండి. ఈ గుజ్జులో కాస్త ఉప్పు కలిపి ఇత్తడి పాత్రపై రాయండి. కొంత సమయం తరువాత, మృదువైన క్లాత్‌తో రుద్దండి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. అనంతరం పొడిగా ఉన్న క్లాత్‌తో తుడిచి ప్రక్కన పెట్టండి.
పెరుగు, పసుపు:పెరుగులో కాస్త పసుపు కలిపిఇత్తడి పాత్రలపై రాయండి. కొంత సమయం తరువాత, మృదువైన బ్రష్‌తో రుద్దండి. తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. అనంతరం పొడిగా ఉన్న క్లాత్ తో తుడవండి. ఇలా చేయడం వల్ల ఎంత మురికిగా ఉన్న పాత్రలయిన తెల్లగా మారతాయి. అంతే కాకుండా ఈ టిప్స్ వాడటం వల్ల సమయం కూడా ఆదా అవుతుంది. తక్కువ సమయంలోనే ఇత్తడి పాత్రలను కొత్త వాటిలా మార్చేందుకు పెరుగు, పసుపు చాలా బాగా ఉపయోగపడతాయి.
టమాటో రసం: ముందుగా టమాటోను కట్ చేసి రసాన్ని తీయండి. ఈ రసాన్ని ఇత్తడి పాత్రపై అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. తర్వాత మెత్తని బ్రష్‌తో రుద్ది శుభ్రమైన నీటితో వాష్ చేయండి.
బేకింగ్ సోడా: బేకింగ్ సోడాను కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఒక ఇత్తడి పాత్రపై అప్లై చేసి కాసేపు అలాగే ఉంచండి. తర్వాత మెత్తని బ్రష్‌తో రుద్ది శుభ్రమైన నీటితో కడగాలి.
వెనిగర్ , ఉప్పు: వెనిగర్‌లో ఉప్పు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ను ఇత్తడి పాత్రపై అప్లై చేసి కాసేపు అలాగే ఉంచండి. తర్వాత మెత్తని బ్రష్‌తో రుద్ది శుభ్రమైన నీటితో కడగాలి.
జాగ్రత్తలు:
ఇత్తడి పాత్రలను శుభ్రపరిచేటప్పుడు, వాటిని గట్టిగా రుద్దకూడదు. ఇలా చేస్తే..కొన్ని రకాల వస్తువులు పాడైపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
శుభ్రపరిచిన తర్వాత, పాత్రలపై మరకలు ఉండకుండా పొడి గుడ్డతో పూర్తిగా తుడవండి.
పాత్రలపై నల్లదనం ఎక్కువగా ఉంటే.. రెండు మూడు సార్లు పై పదార్థాలను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
Also Read: సోంపు తింటే.. మతిపోయే లాభాలు !
ఇతర చిట్కాలు:
ఇత్తడి పాత్రలను ఎల్లప్పుడూ శుభ్రమైన నీటితో కడగాలి. అంతే కాకుండా ఉపయోగించిన తర్వాత వాటిని ఆరబెట్టండి.
తడిగా ఉన్న ప్రదేశంలో ఇత్తడి పాత్రలను ఉంచకూడదు.
పాత్రలు తుప్పు పట్టకుండా ఎప్పటికప్పుడు వాటిపై నూనె రాయండి.