BigTV English

Cough In Kids: చిన్న పిల్లల దగ్గు త్వరగా తగ్గాలా ? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి..

Cough In Kids: చిన్న పిల్లల దగ్గు త్వరగా తగ్గాలా ? అయితే  ఈ చిట్కాలు ట్రై చేయండి..

Cough In Kids: వర్షాకాలంలోని ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా పిల్లలు వర్షాకాలంలో ఎక్కువగా అనారోగ్యం బారిన పడుతుంటారు. జలుబు, దగ్గుతో చిన్నారులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు. పసిపిల్లలకు ఆగకుండా దగ్గు వస్తుంటే వెంటనే పిల్లల స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకువెళ్లాలి. డాక్టర్‌ను కలవడానికి ఎక్కువగా సమయం పడుతుందని అనుకుంటే మాత్రం ఇంట్లోనే దగ్గును తగ్గించడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే పిల్లలకు ఊరట లభిస్తుంది. ఈ చిట్కాలను కూడా వైద్యులను సంప్రదించి వాడటం మంచిది.


దగ్గు చాలా రకాలుగా ఉంటుంది. పొడి దగ్గు, కఫం దగ్గు, ఇలా రకరకాలుగా దగ్గు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పిల్లలు ఏదీ మింగలేక పోతుంటారు. అంతలా దగ్గుతో ఇబ్బంది పడతారు. చిన్నారులు దగ్గినప్పుడు కఫం బయటకు వస్తుంది. అందుకే వారి శరీరం ముఖ్యంగా హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. అంతే కాకుండా ఈ సమయంలో తల్లి పాలు ఇవ్వడం మంచిది. చిన్నారుల ముక్కులో ఓటీటీ సెలైన్ డ్రాపులు వేయాలి.

ఒక ముక్కు రంద్రంలో రెండు లేదా మూడు సెలైన్ డ్రపులు వేయాలి. అంతే కాకుండా కఫాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. దీని కోసం కొన్ని సక్షన్ ట్యాబులు కూడా ఉంటాయి. ఈ సక్షన్ ట్యాబుల సాయంతో పసి పిల్లల ముక్కులో మ్యూకస్ లేకుండా చూసుకోవడం మంచిది. తరుచూ సక్షన్ చేయడం వల్ల కూడా పిల్లలకు విసుగు వస్తుంది.


హ్యూమిడిఫైయర్ ను ఉపయోగించడం వల్ల పిల్లలకు వేడి గాలి వస్తుంది. ఈ వేడి గాలిని పీల్చడం వల్ల కఫం ఏదైనా బయటకు వస్తుంది. బాత్ రూంలో హాట్ వాటర్ షవర్ ను ఆన్ చేసి 10 నిమిషాల పాటు అలాగే ఉంచి డోర్ క్లోజ్ చేయాలి. అప్పుడు బాత్ రూంలోపల ఉండే వేడి గాలి. మొత్తం నిండిపోయి ఉంటుంది. అప్పుడు పిల్లలను బాత్ రూంలోకి తీసుకువెళ్లి చాతిపై నిమరడం వల్ల కఫం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది.

పిల్లలకు 12 నెలల వయస్సు ఉంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు పడుకునే ముందు ఒకటిన్నర టీ స్పూన్ తేనెను గనక తాగిస్తే కనుక మంచి ఏటీసీగా ఇది పని చేస్తుంది. సిగరెట్ తాగేవారిని పిల్లలకు దూరంగా ఉండటం మంచిది. రూం ఎయిర్ ఫ్యూరిపయర్లను ఉపయోగించడం మంచిది. అంతే కాకుండా పిల్లలు వాడే పరుపులు, బట్టలు శుభ్రంగా ఉంచండి లేకపోతే ఇన్ ఫెక్షన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.

Also Read:  ఈ టీతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. మీరెప్పుడైనా ట్రై చేశారా ?

పిల్లలకు దగ్గు రావడానికి చాలా కారణాలు ఉంటాయి. చలికాలంలో వాతావరణ మార్పుల వల్ల దగ్గు ఎక్కువగా వస్తుంది. కొత్త రకాల వైరస్ వల్ల కూడా దగ్గు వస్తుంది. నుమోనియా కూడా దగ్గు రావడానికి కారణం అవుతుంది. దగ్గు వస్తే మాత్రం అప్రమత్తంగా ఉండి వైద్యులను వెంటనే సంప్రదించడం మంచిది.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×