Tips For Skin Whitening.: ముఖం మెరుస్తూ, అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. ముఖ్యంగా అమ్మాయిలు అందరికంటే తాము ఒకింత అందంగా కనిపించాలని తహతహలాడుతుంటారు. అందుకోసం రకరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడటంతో పాటు పార్లర్‌లకు కూడా వెళుతుంటారు. ఇదిలా ఉంటే మరి కొందరేమో హోం రెమెడీస్ ట్రై చేస్తారు.
కొందరికి బ్యూటీ పార్లర్‌కు వెళ్లడానికి సమయం లేదా బడ్జెట్ ఉండదు. అటువంటి సమయంలో అమ్మమ్మ హోం రెమెడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. వాస్తవానికి రసాయనాలు లేకుండా ఇంట్లోని కిచెన్‌లో ఉన్న పదార్థాలతో తయారు చేసిన హోం రెమెడీస్ చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో సహాయపడతాయి.
మీరు కూడా పార్లర్‌కు వెళ్లకుండానే గ్లోయింగ్ స్కిన్ పొందాలనుకుంటే హోం రెమెడీస్ తప్పకుండా ట్రై చేయండి. మరి చర్మ సౌందర్యానికి మేలు చేసే హోం రెమెడీస్ ఎలా తయారు చేసుకోవాలి. వాటి యొక్క ప్రయోజనాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తేనె, పాలతో ఫేస్ ప్యాక్ :
కావలసినవి:
తేనె- 1 స్పూన్
పచ్చి పాలు- 1 స్పూన్
తయారీ విధానం: ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయడానికి, ఒక చెంచా తేనెలో ఒక చెంచా పచ్చి పాలను కలపండి. దీన్ని ముఖంపై 10 నుంచి 15 నిమిషాల పాటు అప్లై చేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఈ ప్యాక్‌ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల మీ చర్మం మృదువుగా , కాంతివంతంగా మారుతుంది. అంతే కాకుండా తేనె, పాలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్ మీ చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. దీంతో మీ ముఖంలో కొత్త మెరుపు కనిపిస్తుంది.
శనగపిండి,పసుపుతో ఫేస్ ప్యాక్ :
కావలసినవి:
శనగపిండి- 1 టేబుల్ స్పూన్
పసుపు- 1 టీ స్పూన్
రోజ్ వాటర్ – కొద్దిగా
తయారీ విధానం: ఒక గిన్నెలో 1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా రోజ్ వాటర్ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖం, మెడపై అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఫేస్ ప్యాక్ ఆరిన తర్వాత ముఖాన్ని సున్నితంగా కడుక్కోవాలి.
అలోవెరా జెల్, రోజ్ వాటర్‌తో ఫేస్ ప్యాక్ :
కావలసినవి:
అలోవెరా జెల్- 1 టేబుల్ స్పూన్
రోజ్ వాటర్ – 5- 6 చుక్కలు
తయారీ విధానం:
పైన చెప్పిన మోతాదుల్లో అలోవెరా జెల్‌లో కొద్దిగా రోజ్ వాటర్ కలపండి. ఇలా మందపాటి పేస్ట్ సిద్ధం చేసి ముఖానికి ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల మీ చర్మం తాజాగా, మెరుస్తూ ఉంటుంది.
టమాటో రసం:
విటమిన్ సి టమాటోలలో లభిస్తుంది. ఇది చర్మంపై ఉన్న మచ్చలను తొలగిస్తుంది. దీని కోసం ఒక టమటో యొక్క రసం తీసి ముఖానికి అప్లై చేసి 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ రెసిపీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా ముఖానికి సహజమైన మెరుపును తెస్తుంది.
Also Read: హెన్నా ఇలా వాడారంటే.. క్షణాల్లోనే తెల్లజుట్టు నల్లగా మారడం గ్యారంటీ
నిమ్మ, చక్కెర:
నిమ్మ, చక్కెర మిశ్రమం మీ చర్మం నుండి మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. దీని కోసం, ఒక చెంచా చక్కెరలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి, ముఖాన్ని సున్నితంగా స్క్రబ్ చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా చేయడం వల్ల మీ ముఖంపై సహజమైన మెరుపు వస్తుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.