BigTV English

Bigg Boss 8 Telugu: శృతిమించిన ప్రేరణ ప్రేమ.. హగ్గులు, ముద్దులకు హద్దే లేదు

Bigg Boss 8 Telugu: శృతిమించిన ప్రేరణ ప్రేమ.. హగ్గులు, ముద్దులకు హద్దే లేదు

Bigg Boss 8 Telugu Latest Episode Highlights: ప్రస్తుతం బిగ్ బాస్ 8లో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇప్పటికే దాదాపు అందరి ఫ్యామిలీస్ తమ వారి కోసం హౌస్‌లో అడుగుపెట్టారు. బయట ప్రేక్షకులుగా షోను చూసి వారిలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటాయో సలహాలు, సూచనలు ఇచ్చారు. చివరికి ప్రేరణ, టేస్టీ తేజ ఫ్యామిలీస్ మాత్రమే హౌస్‌లోకి రాలేదు. అయినా ప్రేరణ భర్త హౌస్‌లోకి రావడం లేదని చెప్పి ఒక కటౌట్‌ను పంపించారు బిగ్ బాస్. అదే తన భర్త అని ఊహించుకొని సంతోషపడిపోయింది ప్రేరణ. ఇంతలోపు తన భర్త హౌస్‌లోకి అడుగుపెట్టారు. 2 నెలలకు పైగా ఆయనకు దూరంగా ఉండడంతో ఒక్కసారిగా ఆయనను చూడగానే ప్రేరణ సంతోషానికి హద్దులు లేవు.


స్పెషల్ సెటప్

అసలు తన భర్త హౌస్‌లోకి రాడేమో అనుకొని కన్నీళ్లు పెట్టుకుంది ప్రేరణ. కానీ చూసేసరికి తనకు, తన భర్తకు గార్డెన్ ఏరియాలో స్పెషల్‌గా సెటప్ వేశారు బిగ్ బాస్. స్విమ్మింగ్ పూల్ అంతా బెలూన్స్‌తో నింపేశారు. ఈ సెటప్ చూసి మిగతా హౌస్‌మేట్స్ అంతా తెగ కుళ్లుకున్నారు. ఇక గేట్స్ ఓపెన్ అయ్యి తన భర్త లోపలికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి తనను హత్తుకుంది ప్రేరణ. అప్పటి నుండి ఒకటే హగ్గులు, ముద్దులు. ఇక ఇద్దరూ ప్రేరణ గేమ్ గురించి మాట్లాడుకున్నారు. బాగా ఆడుతున్నావని, కానీ తనకు నచ్చని విషయం చెప్పేటప్పుడు కాస్త మెల్లగా చెప్పమని సలహా ఇచ్చాడు. నామినేషన్స్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండమని ప్రేరణ భర్త అన్నాడు.


Also Read: బిగ్ బాస్ నుంచి ఈ వారం ఎలిమినేట్ అయ్యేది..?

కెమిస్ట్రీ హైలెట్

ప్రేరణ భర్త తనతోనే కాదు.. అందరితో సరదాగా ఉన్నాడు. ప్రేరణ ఆట ఎలా ఆడుతుంది అని నబీల్ అడగగానే బాగానే ఆడుతుంది, నా జీవితంతో ఏడేళ్లు ఆడుకుంది కదా అని నవ్వుతూ సమాధానమిచ్చాడు. అలా చాలాసేపు ప్రేరణ, తన భర్తతో కలిసి గాలిలో తేలిపోయింది. ఇదంతా చూస్తున్న యష్మీ, విష్ణుప్రియా.. హౌస్‌లో ఉన్న సింగిల్ గర్ల్స్ ఏమైపోవాలి అని ఫీలయ్యారు. ఇక వెళ్లే ముందు ప్రేరణ, తన భర్త కలిసి ఒక టాస్క్ ఆడారు. అందులో ఇద్దరూ కలిసి హౌస్‌కు 3 గంటలు కిచెన్ టైమ్‌ను గెలిచారు. వారు వెళ్లిపోయిన తర్వాత రోహిణి, టేస్టీ తేజ కోసం దాదాపు ఇలాంటి సెటపే అరేంజ్ చేశారు బిగ్ బాస్. వారికోసం పాట కూడా ప్లే చేశారు. అక్కడ నిఖిల్ – యష్మీ, పృథ్వి – విష్ణుప్రియా కెమిస్ట్రీనే హైలెట్ అయ్యింది.

సక్సెస్ అయ్యాడు

అందరి ఫ్యామిలీస్ హౌస్‌లోకి వస్తున్నా తనకు మాత్రం ఆ అదృష్టం లేదని టేస్టీ తేజ తెగ ఫీలయ్యాడు. దాదాపు వారం రోజుల నుండి ఏడుస్తూనే ఉన్నాడు. ఆ బాధ చూడలేక బిగ్ బాస్ కూడా తేజ తల్లిని హౌస్‌లోకి పంపించారు. దీంతో తేజ సంతోషానికి హద్దులు లేవు. తన తల్లి బిగ్ బాస్ హౌస్‌లోకి రావడం తన కల అని, ఇంతకంటే పెద్ద కల తనకు ఏమీ లేదని అన్నాడు. ఒకవేళ ఇదే సక్సెస్ అనుకుంటే తాను ఈరోజు సక్సెస్‌ఫుల్ అయ్యానని చాలా ఎమోషనల్ అయ్యాడు. తేజ తల్లి సైతం అందరితో బాగా మాట్లాడారు. తేజ ఇలాగే కష్టపడి ఆడితే కచ్చితంగా టాప్ 5లో ఉంటాడని నమ్మకం వ్యక్తం చేశారు. మొత్తానికి అలా ఫ్యామిలీ వీక్ పర్ఫెక్ట్‌గా ముగిసింది.

Related News

Bigg Boss 9 : ఇవి టాస్క్ లా? కుస్తీ పోటీలా? అంత దారుణంగా కొట్టుకుంటున్నారు

Bigg Boss 9: చెప్పినా వినలేదు.. ప్రియా శెట్టి పేరెంట్స్ ఆవేదన.. ఏమైందంటే?

Bigg Boss 9 Promo: ఈ కష్టం పగవాడికి కూడా రాకూడదు.. సందిగ్ధంలో కంటెస్టెంట్స్!

Bigg Boss 9: బిగ్ బాస్ ఎంట్రీ.. కంటెస్టెంట్స్ ని ఆటాడుకున్న బాస్, ఇదేవరూ ఊహించలేదు భయ్యా!

Bigg Boss 9 Promo: ఇట్స్ ఎమోషన్స్ టైం.. దుఃఖంలో కూడా త్యాగం చేసిన ఇమ్ము!

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Big Stories

×