Summer Fruits For Glowing Skin| వేసవిలో ప్రతి ఒక్కరు వేడికి అల్లాడి పోతారు. చాలామంది నీరసించి, జ్వరాల బారిన కూడా పడతారు. ఆ తరువాత ఆరోగ్యం కోలుకున్నా.. చర్మం పేలవంగా మారుతుంది. అంతేకాకుండా మండే ఎండలకు చర్మం నల్లబడిపోతుంది. ఈ సమస్యకు చాలా మంది మార్కెట్లో లభించే కెమికల్స్ ఉన్న ఫేస్ క్రీమ్స్ ఉపయోగిస్తారు. కానీ దీని వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉండవని నిపుణలు సూచిస్తున్నారు.
ఎండాకాలంలో శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా అందవు. ఫలితంగా శరీరం నీరసించి పోవడం, ముఖంలో కాంతి తగ్గిపోవడం జరుగుతుంది. ఈ సమస్యకు పరిష్కారంగా నిపుణులు సీజనల్ ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్నారు. వీటిలో ఆరోగ్యానికి లాభం కలిగించే మంచి పోషక విలువున్నట్లు తెలిపారు. చర్మం కాంతివంతంగా ఉండాలంటే పై నుంచి ఫేషియల్స్ చేస్తే సరిపోదు.అందులో శరీరానికి మంచి పోషకాలు అందించాలి. ముఖ్యంగా చర్మానికి కావాల్సిన కొల్లోజెన్ ని పెంచాలి. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా నివారించాలి, దీని వల్ల చర్మం ఎక్కువ రోజులు బిగుతు యవ్వనంగా కనిపిస్తుంది.
పపయా.. అంటే బొప్పాయి పండు. ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులోని పపైన్ అనే ఎంజైమ్ ముఖంలో మొటిమలు రాకుండా నివారిస్తుంది. పైగా ముఖంలో నిగారింపు వచ్చేలా చేస్తుంది.
వాటర్ మెలాన్.. అంటే పుచ్చకాయ.. ఎండాకాలంలో అందరూ పుచ్చకాయ అంటే ఇష్టంగా తింటారు. ఈ ఫ్రూట్ లో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. విటమిన్ సి కూడా అధిక స్థాయిలో ఉంటుంది. పైగా ఈ పండు తింటే చర్మానికి కావాల్సిన కొల్లోజెన్ లభిస్తుంది.
మామిడిపండు.. పండ్లలో రాజుగా మామిడిని వర్ణిస్తారు. మామిడి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని హైడ్రేట్ చేయడంతో పాటు ముడతలను తగ్గిస్తుంది. అయితే మామిడి పండ్లు మరీ ఎక్కువగా తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు.
పైన యాపిల్.. ఈ పండు చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో పాటు, మ్యాంగనీస్ శాతం కూడా అధికంగా ఉంటుంది. ఇవి రెండూ చర్మంలో కాంతిని పెంచి, టోనింగ్ చేస్తాయి. ఫలితంగా ఎండల వల్ల చర్మం పై వచ్చే నల్ల మచ్చలు, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది.
కివి.. ఈ బుల్లి పండులో విటమిన్ సి అధిక మొత్తంలో ఉంటుంది. పైగా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్.. ఒత్తిడి వల్ల డ్యామేజ్ అయిన చర్మాన్ని రిపేరు చేసి.. కొల్లోజెన్ ని ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి.
Also Read: మీ జుట్టు రాలిపోయిందా?.. చింతించకండి.. బలమైన జుట్టు తిరిగిరావాలంటే ఇలా చేయండి
స్ట్రాబెర్రీస్.. తింటుంటూ కొంచెం పుల్లగా టేస్టీగా ఉంటే స్ట్రాబెర్రీస్ ని చాలా రకాలుగా స్వీట్స్ లో, ఐస్ క్రీమ్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఇందులో ఉన్న విటమిన్ సి.. ఎండ వల్ల స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. చర్మంపై ఉన్న ముడతలను తగ్గిస్తుంది.
ఆరెంజెస్.. కమలా పండ్లలో పుష్కలంగా ఫ్లవనాయిడ్స్ , విటమిన్ సి ఉంటాయి. వీటితో స్కిన్ టోన్ పెరిగి కాంతి వంతంగా తయారవుతుంది. ముఖంపై ఉండే డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ కూడా క్రమంగా తగ్గిపోతుంది.
పై చెప్పిన పండ్లన్నీ ప్రతిరోజు తినడంతో మంచి ఆరోగ్య లభాలుంటాయి.