Railway Story: భారతీయ రైల్వే ప్రస్థానానికి 172 ఏళ్లు పూర్తయ్యాయి. నిత్యం కోట్లాది మంది ప్రయాణీకులను గమ్య స్థానాలకు చేర్చుతున్న రైల్వే సంస్థ చారిత్రక ప్రస్థానాన్ని జరుపుకుంటోంది. 1853 ఏప్రిల్ 16న దేశంలో తొలి ప్యాసింజర్ రైలు పొగలుగక్కుతూ పరుగులు తీసింది. ఈ రైలు ముంబై బోరిబందర్ నుంచి థానే వరకు ప్రయాణాన్ని కొనసాగించింది. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. భారతీయ రైల్వే నాటి నుంచి నేటి వరకు సాధించిన ప్రగతిని గుర్తు చేశారు.
మూడు ఇంజిన్లతో తొలి రైలు ప్రయాణం థానే
భారతీయ రైల్వే చరిత్రలో 1853 ఏప్రిల్ 16 మర్చిపోలేని రోజు. ఇదే రోజు ముంబైలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. నాటి బోరిబందర్ నేటి ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ నుంచి థానే తొలి రైలు ప్రయాణం కొనసాగింది. ఈ రైలుకు ఏకంగా మూడు ఇంజిన్లను ఏర్పాటు చేశారు. వాటిలో ఒకదాని పేరు ‘సింధ్’, మరోదాని పేరు ‘సుల్తాన్’, ఇంకోదాని పేరు ‘సాహెబ్’. మధ్యాహ్నం 3.35 గంటలకు ఈ రైలు 14 కోచ్ లతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మొత్తం 400 మంది ప్రత్యేక ఆహ్వానితులను తీసుకొని.. 21 తుపాకీలతో గౌరవ వందనం అనంతరం బయల్దేరింది. ఈ రైలు 34 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట 15 నిమిషాల్లో పూర్తి చేసింది.
🚂 On this day, 16 April 1853, India’s first passenger train chugged from Bombay to Thane — a 34 km journey that sparked a revolution! 🇮🇳
Three steam engines. Four hundred passengers. One historic ride. #IndianRailways pic.twitter.com/baNQ8jZnAs
— Trains of India (@trainwalebhaiya) April 16, 2025
తొలి రైలు ప్రారంభం రోజు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
దేశంలో తొలి రైలు పరుగులు తీసున్న వేళ నాటి బ్రిటిష్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు దేశం అంతటా సెలవు ప్రకటించింది. ప్రజలకు ఈ చారిత్రక ఘట్టాన్ని పరిచయం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: ఇండియన్ రైల్వేలోకి పవర్ ఫుల్ లోకోమోటివ్, దీని సామర్ధ్యం ఎంతో తెలుసా?
రైల్వే అభివృద్ధిని వివరించిన వైష్ణవ్
ఇక భారతీయ రైల్వేకు 172 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్.. నాటి నుంచి నేటి వరకు జరిగిన అభివృద్ధిని వివరించే ప్రయత్నం చేశారు. 1853లో ప్రారంభమైన తొలి రైలు చిత్రంతో పాటు దేశంలో రీసెంట్ గా నిర్మించిన అద్భుత రైల్వే వంతెనల ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ 172 ఏండ్ల కాలంలో భారతీయ రైల్వే దినదినాభివృద్ధి చెందుతూ.. ప్రస్తుతం ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. నాటి పొగబండి నుంచి నేటి అత్యాధునిక సెమీ హైస్పీడ్ వందేభారత్ రైళ్ల వరకు ఎదిగింది. లక్ష కిలో మీటర్ల రైల్వే లైన్లతో నిత్యం 2.5 నుంచి 3 కోట్ల మందిని ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చుతూ.. ప్రజా రవాణాలో కీలక పాత్ర పోషిస్తోంది.
172 वर्ष पहले भारत में रेल (Rail) की शुरुआत 16 अप्रैल 1853 को हुई। मुम्बई में वह दिन ऐतिहासिक था। उस दिन वहाँ सार्वजनिक अवकाश घोषित कर दिया गया था। उस दिन दोपहर तीन बजकर पैंतीस मिनट पर 21 तोपों की सलामी के साथ बोरीबंदर से ठाणे के लिए पहली बार 14 डिब्बों की एक ट्रेन रवाना हुई थी।… pic.twitter.com/IFEJupTz3W
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 16, 2025
Read Also: భారతీయ రైల్వే మరో అద్భుతం, అత్యంత పొడవైన రైల్వే టన్నెల్ పూర్తి!