Jeans Washing : జీన్స్ చాలా సాధారణ దుస్తులుగా మారాయి. యువత ఎక్కువగా జీన్స్ ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ రోజుల్లో వృద్ధులు కూడా జీన్స్ ధరించడానికి వెనుకాడటం లేదు. జీన్స్ యొక్క ముఖ్యమైన ప్రత్యేకత ఏంటంటే.. వాటిని ఉతకకుండా ఎక్కువ రోజులు ధరించవచ్చు. అయినప్పటికీ జీన్స్ అంత మురికిగా కనిపించదు. జీన్స్ సరిగ్గా ఉతికితే, వాటి షైన్, రంగు చాలా కాలం వరకు పోకుండా ఉంటుంది. అంతే కాకుండా జీన్స్ ఎన్ని రోజులైనా కొత్త దానిలా మెరుస్తుంది.
జీన్స్ చాలా కాలం పాటు కొత్త వాటిలా ఉండాలంటే.. సరిగ్గా వాష్ చేయడం చాలా ముఖ్యం. ఇది జీన్స్ ను ఎక్కువ రోజులు పాడవకుండా చేస్తుంది. జీన్స్‌ను వాష్ చేయడానికి కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మరి ఎలాంటి చిట్కాలు జీన్స్ వాష్ చేయడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
జీన్స్ వాష్ చేయడానికి బెస్ట్ టిప్స్ :
ఎక్కువగా వాస్ చేయకూడదు: జీన్స్ వేసుకున్న ప్రతి సారి ఉతకాల్సిన అవసరం లేదు. కొన్ని రోజులు వాడిన తర్వాత మీరు జీన్స్ ఉతకాలి. తరుచుగా వాష్ చేయడం వల్ల జీన్స్ రంగు మారిపోతుంది. అంతే కాకుండా తక్కువ రోజుల్లోనే పాత వాటిలా కనిపిస్తాయి.
చల్లటి నీటిని వాడండి: వేడి నీరు జీన్స్ రంగును పొగొడతాయి. అందుకే జీన్స్ వాస్ చేయడానికి ఎల్లప్పుడూ చల్లని నీటిని మాత్రమే వాడండి.
మాన్యువల్ మోడ్: వీలైతే జీన్స్‌ను చేతితో వాష్ చేయండి. మెషిన్‌లో గనక మీరు జీన్స్ వాష్ చేయాలని అనుకుంటే మాత్రం సున్నితమైన మోడ్‌ను ఉపయోగించండి.
జీన్స్ రివర్స్ చేసి వాష్ చేయండి: జీన్స్‌ను రివర్స్ చేసి ఉతకడం వల్ల వాటి రంగు చాలా కాలం పాటు చెక్కుచెదరకుండా ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొత్త వాటిలా ఉంటాయి కూడా.
బ్లీచ్ ఉపయోగించవద్దు: బ్లీచ్ జీన్స్ రంగును దెబ్బతీస్తుంది. అందుకే ఉతికేటప్పుడు అస్సలు బ్లీచ్ ఉపయోగించకుండా ఉండండి.
వెనిగర్ వాడకం: జీన్స్ ఉతికే నీటిలో కొద్దిగా వెనిగర్ కలుపుకుంటే రంగు మారకుండా ఉంటుంది. అంతే కాకుండా మురికి త్వరగా తొలగిపోతుంది.
డ్రైయర్‌ను తక్కువగా ఉపయోగించండి: మీ జీన్స్‌ను వీలైనంత వరకు ఎండలో ఆరబెట్టండి. డ్రైయర్‌ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల జీన్స్ ముడుచుకుపోతుంది.
జీన్స్ వాష్ చేయడానికి ముందు ఏమి చేయాలి ?
మరకలను తొలగించండి: జీన్స్ వాష్ చేయాలని అనుకున్నప్పుడు అప్పటికే ఏవైనా మరకలు వాటిపై ఉంటే గనక ముందుగా వాటిని తొలగించండి.
తర్వాత జీన్స్‌కు జిప్ వేసి, బటన్ పెట్టండి.
Also Read: కాకరకాయ చేదును తగ్గించే.. బెస్ట్ టిప్స్ ఇవే !
జీన్స్ ఉతికిన తర్వాత ఏం చేయాలి ?
సూర్యరశ్మిలో ఆరబెట్టండి: జీన్స్‌ను సూర్యరశ్మిలో ఆరబెట్టడం ద్వారా వాటిపై ఉన్న బ్యాక్టీరియాను చనిపోతుంది. అంతే కాకుండా ఇది జీన్స్ యొక్క తాజాదనాన్ని కాపాడుతుంది.
జీన్స్ ఎప్పుడు వాష్ చేయాలి ?
చాలా మురికిగా ఉన్నప్పుడు: జీన్స్ చాలా మురికిగా ఉంటే మాత్రమే వాటిని వాష్ చేయాలి. లేదంటే ఏవైనా మొండి మరకలు ఏర్పడినా కూడా జీన్స్ వెంటనే వాష్ చేయాలి. లేదంటే వాటిపై ఉన్న మరకలు ఇంకి పోయే తొలగించడానికి ఎక్కువ సమయం పడుతుంది.