E-Paper
Advertisement

Horoscope Today December 18th: ఆ రాశి వారికి స్థిరాస్థి వ్యవహారంలో అవరోధాలు తొలగిపోతాయి, కానీ..

Horoscope Today December 18th: ఆ రాశి వారికి స్థిరాస్థి వ్యవహారంలో అవరోధాలు తొలగిపోతాయి, కానీ..

Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. డిసెంబర్ 18న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి : ఈ రాశి వారు ఈరోజు నూతన పనులను ప్రారంభిస్తారు. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో కీలక వ్యవహారాలు చర్చించి మీ విలువను మరింత పెంచుకుంటారు.

వృషభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు కొన్ని వ్యవహారాలలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించవు.

మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు కలసి వస్తాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు దూర ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. స్థిరాస్తి వ్యవహారాలలో అవరోధాలు తొలగుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో వాయిదా పడతాయి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు.

కన్యా రాశి : ఈ రాశి వారు ఈరోజు  దూరపు బంధువుల నుండి ఆసక్తికర విషయాలు సేకరిస్తారు. చేపట్టిన పనులు మందగిస్తాయి. నూతన రుణ యత్నాలు చిన్నపాటి ప్రయత్నం మీద పూర్తి అవుతాయి. బందు మిత్రులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో నిర్ణయాలు స్థిరంగా ఉండవు. వృత్తి ఉద్యోగాలలో ఒడిదుడుకులు తప్పవు.

ALSO READ:  గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్‌

తులా రాశి : ఈ రాశి వారు ఈరోజు సమాజంలో పెద్దల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికి విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ విషయమై ఉన్నతాధికారులతో ఉన్న సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు.

ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు సంతాన సంబంధిత ఇబ్బందులు పరిష్కారమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు స్వల్ప సమస్యలు తప్పవు.

మకర రాశి : ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దూరపు బంధువుల నుండి అందిన సమాచారం కొంత నిరుత్సాహం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు.

కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. మిత్రుల సలహాతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు.

మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కొన్ని వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. రుణ దాతలు నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.

ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు –  ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×