Bitter Gourd: కాకరకాయను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.అయితే కొంత మంది మాత్రం దీని చేదు కారణంగా తినడానికి అంతంగా ఇష్టపడరు. మీరు కొన్ని పద్ధతుల ద్వారా కాకర కాయ చేదును తగ్గించవచ్చు.
కాకరకాయ అనేది పోషకాలు సమృద్ధిగా ఉండే కూరగాయ. చాలా మంది దీనిని తమ డైట్ రొటీన్‌లో తినడానికి ఇష్టపడతారు. కానీ కొంత మంది మాత్రం దాని యొక్క చేదు కారణంగా తినడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఒక వేళ కాకరకాయ చేదును తొలగిస్తే .. మాత్రం దీనితో తయారు చేసిన వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. కాకరకాయ చేదును తొలగించడం అంత కష్టమైన పని కాదు. చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి కాకయ కాయ చేదును తగ్గించవచ్చు. మరి ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ చేదు కారణంగా పిల్లలు తినడానికి ఇష్టపడరు. అటువంటి సమయంలో ఈ కూరగాయను పిల్లలకు తినిపించేటప్పుడు చేదును సులభంగా తొలగించవచ్చు. దీని కోసం సులభమైన చిట్కాలు మీరు పాటించాల్సి ఉంటుంది. వాటి సహాయంతో మీరు కాకర కాయ చేదును తొలగించవచ్చు.
కాకరకాయ చేదును తొలగించే చిట్కాలు:
ఉప్పు వాడండి: కాకరకాయ కోసిన తర్వాత ఉప్పు చల్లి కాసేపు అలాగే ఉంచాలి. కాకరకాయ చేదును ఉప్పు గ్రహిస్తుంది. కాకరకాయను ఉప్పునీటిలో కాసేపు ఉంచండి. ఇది చేదును తగ్గిస్తుంది.
పెరుగు ఉపయోగించండి: కాకరకాయ ముక్కలను పెరుగులో కాసేపు నానబెట్టండి. కాకరకాయ చేదును తగ్గించడంలో కూడా పెరుగు సహాయపడుతుంది. ఇలా చేసిన తర్వాత కర్రీస్ చేస్తే చాలా రుచుగా ఉంటాయి కూడా.
పసుపు వాడండి: కాకరకాయను కట్ చేసిన తర్వాత, వాటిపై పసుపు, ఉప్పును చల్లండి. ఇలా చేయడం ద్వారా పసుపు చేదును తగ్గించడంలో సహాయపడుతుంది.
పంచదార లేదా బెల్లం ఉపయోగించండి: కాకరకాయ కూర చేసేటప్పుడు, దానికి కొంచెం పంచదార లేదా బెల్లం కలపండి. ఇది చేదును తగ్గిస్తుంది. అంతే కాకుండా వంటకానికి తీపిని ఇస్తుంది.
విత్తనాలను తొలగించండి: కాకర కాయ గింజలు అత్యంత చేదుగా ఉంటాయి. అందుకే కాకర కాయ కర్రీ చేయడానికి ముందు విత్తనాలను తొలగించండి.
ఉడకబెట్టిన తర్వాత వండండి: కాకర కాయను ఉడకబెట్టి, ఆపై వాడండి. ఉడకబెట్టడం ద్వారా కూడా చేదు చాలా వరకు తగ్గుతుంది.
ఇతర కూరగాయలతో కలపండి: బంగాళాదుంపలు, క్యారెట్లు మొదలైన ఇతర కూరగాయలతో కాకర కాయను కలిపి కర్రీ తయారు చేయండి. ఇలా చేస్తే చేదు తగ్గుతుంది.
మసాలా దినుసులు వాడండి: కాకరకాయ కూరలో కొత్తిమీర, జీలకర్ర, పచ్చిమిర్చి మొదలైన మసాలా దినుసులు వేయండి. ఈ మసాలాలు చేదును తగ్గిస్తాయి. అంతే కాకుండా కర్రీస్ కు మరింత రుచిని అందిస్తాయి.
Also Read: చిలగడదుంప తింటే.. ఇన్ని లాభాలా ?
ఇతర సూచనలు:
తాజా చేదు కాకర కాయలను మాత్రమే కర్రీస్‌కు ఉపయోగించండి.
కాకరకాయను కడిగిన తర్వాత బాగా ఆరబెట్టాలి.
కాకరకాయ రసం వల్ల చేతులకు మరకలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, కాకర కాయను కట్ చేసేటప్పుడు గ్లౌజులు ధరించండి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.