Tips For White Hair: ప్రతి ఒక్కరూ నల్లగా, మందంగా, పొడవాటి జుట్టు ఉండాలని కోరుకుంటారు. కానీ కొన్నిసార్లు జుట్టు చిన్న వయస్సలోనే తెల్లగా మారుతుంది. ఈ రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు ఎండలో ఉండటం, ఒత్తిడి , పెరుగుతున్న కాలుష్యం దీనికి ప్రధాన కారణాలు కావచ్చు. జుట్టు చిన్న వయస్సులో రంగు మారడం అనేది చెడు జీవనశైలిని సూచిస్తుంది. క్షీణిస్తున్న జీవనశైలి కారణంగా.. ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. ఇందులో జుట్టు తెల్లబడటం కూడా ఒకటి. ఇదిలా ఉంటే చాలా మంది తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి రకరకాల హెయిర్ కలర్స్ వాడుతుంటారు. కానీ ఇది సరైన పరిష్కారం కాదు. ఇలాంటి పరిస్థితిలో.. కొన్నిహోం రెమెడీస్ కూడా తెల్ల జుట్టుకు దివ్యౌషధంగా పనిచేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
తెల్ల జుట్టును తగ్గించడానికి మీరు మీ ఆహారంలో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా తెల్ల జుట్టు సమస్య వస్తాయి.
తెల్ల జుట్టు:
ముందుగా.. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకొని శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. తరువాత వాటిని రుబ్బుకుని, పెరుగుతో కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ ని మీ తలకు పట్టించండి. దీన్ని అప్లై చేసిన తర్వాత దాదాపు 30 నిమిషాలు అలాగే ఉంచి ఆపై జుట్టును శుభ్రమైన నీటితో కడగాలి.
కరివేపాకు:
కరివేపాకు మెలనిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. అంతే కాకుండా ఇది జుట్టును నల్లగా మార్చడంలో ఉపయోగపడుతుంది. ఇది జుట్టు త్వరగా జుట్టు రంగు మారడాన్ని కూడా నివారిస్తుంది. జుట్టు పెరుగుదలకు, చుండ్రును తగ్గించడంలో, జుట్టును మృదువుగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి.. ఇది జుట్టును బలపరుస్తుంది. ఈ ఆకు ద్వారా తల చర్మం పోషణ పొందుతుంది. కరివేపాకులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి, ప్రోటీన్లు లభిస్తాయి. దీనివల్ల జుట్టు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కరివేపాకు పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి ఆహారంలో చేర్చుకోవడం వల్ల కూడా జుట్టు బలపడుతుంది.
చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా ఎందుకు మారుతుంది ?
ఒత్తిడి, ఆందోళన:
నేటి బిజీ జీవితంలో.. ఒత్తిడి , ఆందోళన సర్వసాధారణం అయిపోయాయి. జుట్టు తొందరగా తెల్లబడటానికి ఈ రెండూ ముఖ్యమైన కారణాలు.
ఆహారం, డ్రింక్స్:
ఫాస్ట్ ఫుడ్, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా జుట్టు దెబ్బతింటుంది.
Also Read: నిమ్మకాయ, రోజ్ వాటర్‌తో గ్లోయింగ్ స్కిన్.. రిజల్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు
నిద్ర లేకపోవడం:
తగినంత నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడి పెరుగుతుంది. ఇది జుట్టు తెల్లబడటానికి దారితీస్తుంది.
కాలుష్యం:
కాలుష్యం జుట్టును దెబ్బతీస్తుంది. అంతే కాకుండా ఇది చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు రావడానికి కారణమవుతుంది.
జన్యుపరమైన కారణాలు:
కొంతమందిలో జుట్టు త్వరగా తెల్లబడటం జన్యుపరమైన కారణాల వల్ల కూడా కావచ్చు. కొన్ని రకాల మందులు తీసుకోవడం కూడా తెల్ల జుట్టు రావడానికి కారణమవుతుంది.