Rishabh Pant : ఐపీఎల్ 2025 (IPL 2025) సీజన్ లో నిన్న లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే లీగ్ దశలో జరిగిన చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ లో LSG కెప్టెన్ రిషబ్ పంత్ కి BCCI భారీ జరిమానా విధించింది. ఆర్సీబీతో నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నో జట్టు స్లో ఓవర్ రేటుతో బౌలింగ్ చేసింది. దీంతో ఈ సీజన్ లో మూడో సారి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంత్ కి రూ.30లక్షలు ఫైన్ విధిస్తున్నట్టు పేర్కొంది. మిగతా ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత లేదా రూ.12 లక్షలు విధించనున్నట్టు తెలిపింది. మరోవైపు ఈ మ్యాచ్ లో రిషబ్ పంత్ బ్యాటింగ్ లో చెలరేగాడు. 61 బంతుల్లో 118 పరుగులు చేసినప్పటికీ మ్యాచ్ మాత్రం లక్నో జట్టు గెలవలేకపోయింది.
Also Read : IND vs ENG Test Series : ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్ ఇదే.. ఉచితంగా ఎలా చూడాలి
ఇక మరోవైపు కచ్చితంగా గెలిస్తే.. టాప్ ప్లేస్ లోకి వెళ్లే మ్యాచ్ ఆర్సీబీ విజయం సాధించి.. టాప్ లోకి దూసుకెళ్లింది. ఇక రేపు జరగబోయే క్వాలిఫయిర్ 1 మ్యాచ్ లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కి చేరుకుంటుంది. ఓటమి చెందిన జట్టు ముంబై-గుజరాత్ మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు క్వాలిఫయిర్ 2తో తలపడుతాయి. క్వాలిఫయిర్ 2లో విజయం సాధించిన జట్టు ఫైనల్ లో తలపడుతుంది. నిన్న జరిగిన మ్యాచ్లో లక్నో ఇన్నింగ్స్ లో కెప్టెన్ రిషబ్ పంత్ ఆట హైలెట్ అనే చెప్పాలి. ఈ సీజన్ అంతా పేలవ ఫామ్ తో ఇబ్బంది పడిన పంత్.. టోర్నీ చివరి మ్యాచ్ లో మాత్రం అదరగొట్టాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన లక్నో జట్టు.. మూడో ఓవర్ లో8నే ఓపెనర్ బ్రీజ్కే(14) వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ మార్ష్ తో కలిసి పంత్ ఇన్నింగ్స్ కి బలమైన పునాది వేశాడు.
Also Read : India beat Pakistan : ఓడినా సిగ్గు లేదుగా.. పాకిస్థాన్ కు ఎందుకు ఇంత బలుపు
తొలి 10 ఓవర్లకు స్కోర్ 100/1 ఉంది. మార్ష్ ధాటిగా ఆడలేకపోయినా.. స్ట్రైక్ ని మాత్రం రొటేట్ చేస్తూ.. పంత్ కి సహకరించాడు. ప్రారంభంలో మాత్రం పంత్ పరుగులు చేయలేకపోయాడు. కాస్త కుదురుకున్నాక తనదైన శైలిలో రెచ్చిపోయి షాట్లు ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 7వ ఓవర్ లో భువనేశ్వర్ బౌలింగ్ లో వరుసగా 6, 4 బాదిన అతను.. సుయాశ్ గూగ్లీని సైట్ స్క్రీన్ మీదుగా కొట్టేశాడు. సుయాశ్ ఓవర్ లోనే మరో రెండు ఫోర్లు కొట్టి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా రిషబ్ పంత్ మెరు ఇన్నింగ్స్ తో చివరి నాలుగు ఓవర్లలో లక్నో సూపర్ జెయింట్స్ 43 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో పంత్ ఐపీఎల్ లో తన రెండో శతకాన్ని పూర్తి చేసాడు. ఈ మ్యాచ్ లో మరో ఆసక్తికర సంఘటన చోటు చేసుకోవడం విశేషం. ఆర్సీబీ జట్టు ఛేదనలో 17వ ఓవర్ లో దిగ్వేశ్ రాఠి.. జితిశ్ ను మన్కడింగ్ చేయడానికి ప్రయత్నించాడు. బంతిని వేసే క్రమంలో ఆగిపోయి.. బెయిల్స్ ని పడగొట్టాడు. అప్పటికే జితేష్ క్రీజు కి దూరంగా ఉన్నాడు. కానీ దిగ్వేష్ యాక్షన్ పూర్తి కావడంతో నిబంధనల ప్రకారం.. జితేశ్ ను మూడో అంపైర్ నాటౌట్ ప్రకటించాడు. కెప్టెన్ పంత్ ఈ లోపే అప్పిల్ ని వెనక్కి తీసుకొని క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు.