BigTV English

Health Tips: మీ ఇంట్లో వాడే వంట నూనె మంచిదా ? కల్తీదా ? తెలుసుకోండిలా..

Health Tips: మీ ఇంట్లో వాడే వంట నూనె మంచిదా ? కల్తీదా ? తెలుసుకోండిలా..

Tips to Identify Fake Cooking Oil: మనం వంట చేయాలంటే తప్పకుండా ఉండాల్సిన పదార్ధాల్లో నూనె ముఖ్యమైంది. నూనె క్వాలిటీగా ఉంటేనే ఆహారం కూడా రుచికరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం కల్తీ రాజ్యమేలుతోంది. కల్తీ ఆయిల్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. మీరు ఇంట్లో వాడుతున్న వంట నూనె, కొబ్బరి నూనెలు స్వచ్ఛమైందా లేదా కల్తీదా అనే విషయాలను ఇంట్లోనే సింపుల్‌గా తెలుసుకోవచ్చని ఫుడ్ సేఫీ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా చెబుతోంది.


సీల్ గమనించండి:

మార్కెట్‌లో నూనె కొనుగోలు చేసేటప్పుడు బాటిల్ మూత సరిగా సీల్ వేసి ఉందా అనే విషయాన్ని ముందుగా గమనించాలి. సీల్ వదులుగా ఉంటే దానిలో కల్తీ నూనె కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు బ్రాండెడ్ కంపెనీ నూనెలను కొనుగోలు చేయండి.


రంగును పరిశీలించండి:

వంట నూనె కల్తీ చేయకపోతే.. నిర్దిష్టమైన రంగు, స్పష్టతను కలిగి ఉంటుంది. ఆలివ్ నూనె ఆకుపచ్చ బంగారు రంగులో ఉంటుంది. పొద్దు తిరుగుడు నూనె లేత పసుపు రంగులో ఉంటుంది. ఇలా కాకుండా ఏ ఆయిల్ రంగు అయినా ఉండాల్సిన రంగులో కాకుండా వేరే రంగులో ఉంటే కల్తీ చేశారని అర్థం.

వాసన బాగుంటుంది:

వంట నూనె కల్తీ చేయనిది అయితే మంచి వాసన వస్తుంది. ఉదాహరణకు ఆలివ్ నూనె తాజా పండ్ల వాసన వస్తుంది. ఒక వేళ నూనె దుర్వాసన వస్తుందంటే కచ్చితంగా కల్తీ చేశారని గుర్తించాలి.

ఫ్రిజ్‌లో పెట్టండి:

మీరు వాడుతున్న ఆయిల్ స్వచ్చమైనదా లేదా అని గుర్తించాలి అంటే కొద్దిగా నూనెను ఒక డబ్బాలో పోసి ఫ్రిజ్‌లో పెట్టండి. ఒక వేళ కల్తీ నూనె అయితే ద్రవంగానే ఉంటుంది. కల్తీ కాకపోతే నూనె గడ్డకడుతుంది.

పేపర్ టెస్ట్:

మీరు వాడుతున్న ఆయిల్‌ను తెల్ల కాగితంపై వేయండి. తర్వాత దానిని కాసేపు ఆరనివ్వండి. నూనె స్వచ్చమైంది అయితే ఆయిల్ వేసిన చోట జిడ్డుతో కూడిన రింగ్ ఏర్పడదు.

Also Read: వెల్లుల్లి తొక్కలను పడేస్తున్నారా.. వీటి ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

కొబ్బరి నూనె:
కొబ్బరి నూనె స్వచ్ఛతను తనిఖీ చేయడానికి ఒక కంటైనర్‌లో కొద్దిగా నూనెను తీసుకొని 5-10 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఫ్రిజ్‌లో పెట్టండి. స్వచ్ఛమైన కొబ్బరి నూనె అయితే 60-90 నిమిషాలలో గడ్డకడుతుంది.

Related News

Lucky life partner: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే మీరు లక్కీ! ఎందుకంటే..

Custard Apple: సీతాఫలం తినడం వల్ల ఎన్ని లాభాలో తెలిస్తే.. షాక్ అవుతారు

Fruits: ఎక్కువ ఫైబర్ ఉండే ఫ్రూట్స్ ఏవో తెలుసా ?

Health Tips: డైలీ ఈ 3 కలిపి తింటే.. వ్యాధులు రమ్మన్నా రావు తెలుసా ?

Banana leaf food: డాక్టర్లు కూడా షాక్‌ అయ్యే నిజం! ఈ ఆకుపై భోజనం చేస్తే జరిగేది ఇదే!

Heart Attack: గుండెపోటు లక్షణాలను ‘గ్యాస్’ సమస్యగా పొరబడుతున్నారా ? జాగ్రత్త !

Period leave Men: కర్ణాటకలో మహిళలకు పీరియడ్ లీవ్.. మరి పురుషులకు?

Tollywood: జూబ్లీహిల్స్ లో సందడి చేసిన సింగర్ సునీత.. వాటికే అందం తెస్తూ!

Big Stories

×