BigTV English

Skin Care at 40s: 40 ఏళ్లలో యంగ్ లుకింగ్.. ఏ విధంగా..?

Skin Care at 40s: 40 ఏళ్లలో యంగ్ లుకింగ్.. ఏ విధంగా..?

Skin Care at 40s: వయస్సు పెరుగుతుండటం సాధారణ ప్రక్రియ. పెరుగుతున్న వయస్సుతో పాటు చర్మంపై వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. ఏజ్ పెరిగే కొద్ది చర్మం డల్‌గా మారుతుంది. ముఖంపై ముడతలు రావడం ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరికి సహజ సిద్దంగా ఇదంతా జరుగుతుంది. కానీ కొంత మంది మాత్రం చిన్న వయస్సులోనే వయసు పైబడిన వారిలా కనిపిస్తారు. అందుకు కారణం వారి జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్లని చెప్పొచ్చు.


ఇదిలా ఉంటే చాలా మంది వారున్న వయస్సు కంటే తక్కువ ఏజ్ లా కనిపిస్తారు. అందుకు కారణం వారు తినే ఆహారం, జీవనశైలితో పాటు చర్మ సంరక్షణ పద్ధతి. 40 ఏళ్లలోకి అడుగు పెట్టిన వారు కొన్ని జాగ్రతలు పాటిస్తే యవ్వనంగా కనిపించొచ్చు.  కొన్ని అలవాట్లను మార్చుకోవడం వల్ల ఏజ్ పెరుగుతున్నా కూడా యంగ్ గా ఉండొచ్చు. ఇందుకోసం మంచి డైట్‌ పాటించడం ఎంతైనా అవసరం.

బయటకు వెళ్లేటప్పుడు సన్​ స్క్రీన్​ తప్పక వాడాలి. సూర్యుని నుంచి వెలువడే హానికరమైన అతినీల లోహిత (యూవీ) కిరణాలు మన చర్మంపై పడ్డప్పటికీ, సన్​స్కిన్​ చర్మానికి రక్షణగా నిలుస్తుంది. ముఖానికి సబ్బుకు బదులుగా మంచి ఫేస్ వాష్ లను కూడా ఉపయోగించండి. మంచి ఆహారం తీసుకోవడంతో అద్భుత ఫలితాలు ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు మొదలైనవి పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను మీ డైట్ లో చేర్చుకోవడం మంచిది. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. చర్మం మెరుస్తూ ఉండటానికి ఇవి సహాయపడతాయి.


Also Read: బరువు తగ్గడానికి నిద్ర కూడా అవసరమే..

రోజంతా పనిచేసిన తర్వాత, రాత్రి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో శరీరం రిఫ్రెష్ అవుతుంది. మీరు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుంటే 40 ఏళ్లు వచ్చిన తర్వాత కూడా మీ చర్మం యవ్వనంగా కనిపించడంతో పాటు తాజాగా ఉంటుంది.

Tags

Related News

Milk – Non Vegetarian: పాలు మాంసాహారమా? అమెరికాలో అంతే.. ఎందుకంటే?

Okra Water Benefits: జిడ్డుగా ఉందని వదిలేయకండి.. నానబెట్టి తాగితే రోగాలన్నీ పరార్

Long Hair Tips: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !

Handloom Handicrafts Expo: ఘనంగా దస్త్కారి హాథ్ హ్యాండ్లూమ్ & హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో.. ఎక్కడంటే?

High Blood Pressure: హైబీపీ ముందుగానే.. గుర్తించేదెలా ?

U&I Retail Store: రిటైల్ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన నభా నటేష్!

Big Stories

×