BigTV English

Manifesto Releasing Soon: గుడ్ న్యూస్.. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, బాలికలకు రూ. 50 వేలు..?

Manifesto Releasing Soon: గుడ్ న్యూస్.. ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, బాలికలకు రూ. 50 వేలు..?

7 Big Promises Manifesto Going to Release Soon: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో భారత కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఈ మేనిఫెస్టోలో పలు కీలక హామీలు ఉండనున్నాయని, అందులో ముఖ్యంగా 7 వాగ్ధానాలు ఉండబోతున్నాయని, అవి.. దేశంలోని పేద కుటుంబాలకు ఏడాదికి ఆరు ఉచిత సిలిండర్లు, ఇంటి వద్దకే రేషన్ బియ్యం సరఫరా, అర్హులైన ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్, ఉన్నత విద్య కోసం బాలికలకు రూ. 50 వేలు వంటి హామీలు చేర్చినట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రాల వారీగా ఓపీఎస్ పథకం అమలు, 30 లక్షల పోస్టుల భర్తీ, ఎంఎస్పీ హామీ, విద్యార్థుల రుణమాఫీ, కుల గణన, రిజర్వేషన్ పెంపు.. ఇలా పలు కీలక హామీలు కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.


ఈ ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలో భారత కూటమి విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ హామీలను కూటమిలోని అన్ని పార్టీలు అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే, టీఎంసీ మాత్రం కొన్ని హామీల విషయంలో నిరాకరిస్తున్నదని, ఈ క్రమంలోనే ఆ మేనిఫెస్టో విడుదలకు ఆలస్యం అవుతుందని సమాచారం. కూటమిలోని హామీలు చాలావరకు పేదల అభివృద్ధికి తోడ్పాటునిచ్చేవిలా ఉంటాయని నేతలు చర్చిస్తున్నారు.

Also Read: ఓడిపోతున్నామని తెలిసినా.. ఎందుకు కష్టపడాలి? : పీఎం మోదీ


మరోవైపు కాంగ్రెస్, సమాజ్ వాదీ, ఆర్జేడీ పార్టీలు కూడా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఓటర్ల పట్ల ప్రత్యేక శ్రద్ధను కనబరిచింది. రైతు న్యాయం, యువత న్యాయం, మహిళా న్యాయం, కార్మిక న్యాయం వంటి హామీలు ఉన్నాయి. అదేవిధంగా పలు హామీలు సమాజ్ వాదీ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని పలు అంశాలను పోలి ఉన్నాయి. ఇటు ఆర్జేడీ కూడా పరివర్తన్ పాత్ర పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇందులో పలు కీలకమైన వాగ్ధానాలు చేసిన విషయం తెలిసిందే.

Tags

Related News

Delhi Terrorists Arrested: ఢిల్లీలో ఐదుగురు ఉగ్రవాదులు అరెస్ట్

Traffic Challans: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఈ తేదీన ట్రాఫిక్ చలాన్ల మాఫీ? ఇలా చెయ్యండి

Prostitution Case: వ్యభిచారం కేసులో విటులు కూడా నేరం చేసినట్టే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Kerala Court Judgment: తల్లికి భరణం చెల్లించని వ్యక్తికి జైలు శిక్ష

Malaria vaccine: మలేరియాకు మందు.. భారత తొలి వ్యాక్సిన్‌కు హైదరాబాద్ నుంచే శ్రీకారం

Milk Prices: శుభవార్త.. తగ్గనున్న పాల ధరలు.. లీటర్‌కు ఎంత తగ్గిస్తారంటే

Big Stories

×