E-Paper
Advertisement

Bhaje Vaayu Vegam Teaser: కార్తికేయ ‘భజే వాయు వేగం’ టీజర్ రిలీజ్.. నాన్న కోసం ఎంత దూరమైనా వెళ్తా..!

Bhaje Vaayu Vegam Teaser: కార్తికేయ ‘భజే వాయు వేగం’ టీజర్ రిలీజ్.. నాన్న కోసం ఎంత దూరమైనా వెళ్తా..!
Advertisement

Bhaje Vaayu Vegam Teaser Out Now: టాలీవుడ్ హీరో కార్తికేయ ప్రస్తుతం మంచి హిట్ కోసం చూస్తున్నాడు. వరుస సినిమాలతో ప్రేక్షకుల్ని అలరిస్తున్నాడు. ఇందులో భాగంగానే గతేడాది ‘బెదురులంక 2012’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమాపై మొదట్నుంచి మంచి అంచనాలు ఉన్నా.. రిలీజ్ అనంతరం అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేకపోయింది.

దీంతో కార్తికేయ తన తదుపరి సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలోనే ఓ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ‘భజే వాయు వేగం’ అనే మూవీ చేస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా.. తాజాగా మూవీ టీజర్‌ను మెగాస్టార్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తూ అంచనాలను పెంచేశారు. ఈ టీజర్ బట్టి చూస్తే.. ఒక డ్రగ్స్ కేసులో బుక్ అయిన హీరో లైఫ్ స్టోరీనే మూవీ కథ అన్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో డైలాగ్స్ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.

Also Read: బ్యాట్‌తో కార్తికేయ పరుగులు.. కొత్త సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్ రివీల్

Advertisement

‘ప్రతి ఒక్కడి జీవితంలో ఒకడు ఉంటాడు.. వాడి కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం.. అలా నా జీవితంలో మా నాన్న’’ అంటూ హీరో చెప్పిన డైలాగ్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీనిబట్టి చూస్తే.. ఈ మూవీ ఫాదర్ సెంటిమెంట్‌తో రాబోతున్నట్లు అర్థం అవుతుంది. అలాగే టీజర‌లో డబ్బు, ఎమోషన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఇలా చూపించి ఆకట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి రధన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×