Health Tips: ఆరోగ్యమే మహాభాగ్యం అని చెబుతుంటారు పెద్దలు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకే మన ఆరోగ్యంపై మనం తప్పకుండా ప్రత్యేకంగా శ్రద్ద తీసుకోవాలి. ఆరోగ్యంతో పాటు ఫిట్‌గా ఉండేందుకు చాలా మంది రకరకాల వ్యాయామాలు చేస్తూ ఉంటారు. ఇంకొందరు వారి వారి ఆహారపు అలవాట్లను కూడా మార్చుకుంటారు.
ఇదిలా ఉంటే రోజువారీ బిజీ షెడ్యూల్‌లో తమకు తాము సమయాన్ని కేటాయించుకోలేని వారు కూడా ఉన్నారు. కానీ ఇది చాలా తప్పు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు ఉదయం మీ కోసం మీరు కొన్ని నిమిషాలు తప్పకుండా కేటాయించాలి. ఫిట్‌గా ఉండటానికి మీ ఉదయం రొటీన్ నుండి మీ కోసం ఎంత సమయం కేటాయించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫిట్‌గా ఉండటానికి ఉదయం ఎంత సమయం కేటాయించాలి ?
ఉదయం పూట మీ కోసం ఈ కొద్ది నిమిషాలు కేటాయిస్తే .. చాలు ఇది చాలా ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తుంది. అంతే కాకుండా ఫిట్ గా ఉండే అవకాశం కూడా ఉంటుంది.
ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవటానికి ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అయితే, ఫిట్‌గా ఉండటానికి సమయం దొరికే వారు చాలా తక్కువ. రోజులోని బిజీ షెడ్యూల్‌లో మీ కోసం సమయాన్ని వెచ్చించడం చాలా కష్టమని తెలుసు. ఇలాంటి వారు కేవలం ప్రతి రోజు ఉదయం మీ కోసం 15 నిమిషాలు కేటాయించండి. ప్రారంభంలో 15 నిమిషాలు తప్పకుండా కేటాయించండి తర్వాత మీరు దానిని 30 నిమిషాలకు పెంచుకోవచ్చు.
ఈ సమయంలో ఏమి చేయాలి ?
ఉదయం పూట మీ కోసం మీరు సమయం కేటాయించారనుకోండి. ఈ సమయంలో ఏం చేయాలనే కదా మీ డౌట్. మొదట మీరు కొన్ని ఫిట్‌నెస్ సంబంధిత విషయాలపై శ్రద్ధ వహించండి.
వాకింగ్‌కు వెళ్లండి: ఉదయం 15 లేదా 30 నిమిషాల పాటు తప్పకుండా వాకింగ్ చేయండి. చిన్నపాటి మార్నింగ్ వాక్ చేయడం వల్ల తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు. దీంతో పాటు, ఉదయం మీరు రోజంతా శక్తిని పొందవచ్చు.
Also Read: కొబ్బరి నూనెతో.. అమ్మాయిలే అసూయపడే అందం మీ సొంతం
ధ్యానం చేయండి : ఉదయం లేచి ధ్యానం చేయండి. ఏకాగ్రతను పెంచడానికి, ఉదయం 10 నిమిషాల ధ్యానం అవసరం. ఉదయం వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. దీని కారణంగా ధ్యానం సులభంగా చేయవచ్చు. ఇది మనస్సును కూడా ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మిమ్మల్ని మీరు మానసికంగా దృఢంగా ఉంచుకోవచ్చు.
ఎండలో కొంత సమయం గడపండి: ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ డి చాలా ముఖ్యం. దీని కోసం ఉదయాన్నే కొంతసేపు ఎండలో కూర్చోవడం చాలా మేలు చేస్తుంది. ప్రతి రోజు తప్పకుండా ఎండలో కూర్చోండి. ఇది మీ ఎముకలను బలోపేతం చేయడమే కాకుండా మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.