Rohit Sharma @ No 5: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) ఇప్పుడు మంచి ఊపులో ఉన్నాడు. ఇటీవలే రెండోసారి తండ్రి అయిన రోహిత్ శర్మ ( Rohit Sharma ).. సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా దిగకుండా… మిడిల్ ఆర్డర్లో రావాలని డిసైడ్ అయ్యాడట రోహిత్ శర్మ. ఈ మేరకు కసరత్తులు చేస్తున్నాడట టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ).
Also Read: Rohit Sharma Son Name: ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్…రోహిత్ శర్మ కొడుకు పేరు ఇదే !
మొదటి టెస్ట్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) దూరమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో టీమిండియా ఓపెనింగ్ గా యశస్వి జైస్వాల్ అలాగే kl రాహుల్ బరిలోకి దిగారు. ఈ ఇద్దరు బ్యాటర్లు మొదటి ఇన్నింగ్స్ లో ఫ్లాప్ అయిన… రెండో ఇన్నింగ్స్ లో అద్భుతంగా రానించారు. దీంతో టీమ్ ఇండియా మంచి పొజిషన్కు వచ్చింది. అయితే రెండవ టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో… ఆ జోడి నీ డిస్టర్బ్ చేయకూడదని రోహిత్ శర్మ ( Rohit Sharma ) డిసైడ్ అయ్యారట.
అందుకే 5వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చేందుకు డిసైడ్ అయ్యారట రోహిత్ శర్మ. ఇక రోహిత్ శర్మ ( Rohit Sharma ) రెండవ టెస్టు ఆడితే… జట్టులో ఉన్న దేవదత్ పడికల్ పైన వేటు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డిసెంబర్ 6వ తేదీ నుంచి టీమిండియా – ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్ట్ అడిలైడ్ వేదికగా జరుగనుంది.
ఇది ఇలా ఉండగా… ఇండియాలో ఇండియాను ఓడించడం కష్టం. టెస్టుల్లో టీమిండియానే ఆధిపత్యం చెలాయిస్తుందని రికార్డులు చెబుతున్నాయి. కానీ ఇటీవలే న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో మాత్రం భారత జట్టు ఓడిపోయింది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కివీస్ చేతిలో క్లీన్ స్వీప్ అయింది. దీంతో భారత జట్టుపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఆస్ట్రేలియా టూర్లను కష్టాలు తప్పవని కామెంట్స్ వినిపించాయి. కానీ అంచనాలకు భిన్నంగా భారత జట్టు అద్భుతాలు చేసింది. తమది వరల్డ్ క్లాసు టీమ్ అని నిరూపించుకుంది. టాస్ గెలవడాన్ని అడ్వాంటేజ్ గా మలచుకుంది.
తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే పరిమితమైన గత టెస్ట్ గణాంకాలను నమ్మింది. పెర్త్ లో ఆడిన నాలుగు టెస్టులను తోలుత బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా త్వరగా ఆల్ అవుట్ అయినా సెంటిమెంట్ కొనసాగుతుందని భారత జట్టు నమ్మింది. అందుకు తగినట్టుగానే బూమ్రా సేన చెలరేగి ఆడింది. భారత జట్టు విజయంలో కెప్టెన్ బూమ్రా, సిరాజ్, హర్షిద్ రానా, నితీష్ కుమార్ రెడ్డి కీలకంగా నిలిచారు.
ఆసీస్ లోని పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్నారు. బ్యాటింగ్ లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ సవాళ్లను ఎదుర్కొన్నారు. ఆస్ట్రేలియాను చిత్తు చేయడంలో తమ వంతు పాత్రను పోషించారు. దీంతో భారతజట్టు పైన ప్రశంసల వర్షం కురుస్తోంది. రోహిత్ శర్మ లేకున్నా..బుమ్రా సారథ్యంలో టీమిండియా విజయం సాధించింది.
Also Read: WTC Final Race – Australia: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్…WTC రేసు నుంచి ఔట్ ?