BigTV English

Srisailam Bullet Case: బ్యాగ్ కానిస్టేబుల్‌దే అయినా.. శ్రీశైలం బుల్లెట్ల కేసులో అనుమానాలు

Srisailam Bullet Case: బ్యాగ్ కానిస్టేబుల్‌దే అయినా.. శ్రీశైలం బుల్లెట్ల కేసులో అనుమానాలు

Srisailam Bullet Case: శ్రీశైలంలో మధ్యాహ్నం కలకలం రేపిన బుల్లెట్ల స్టోరీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుల్లెట్లు యల్లా స్వామి హెడ్ కానిస్టేబుల్ కి చెందినవిగా గుర్తించారు. వాసవి సత్రంలో భోజనానికి వెళ్లి మరిచిపోయాడు బుల్లెట్ల బ్యాగ్. తిరిగి బ్యాక్ కోసం వెళ్లేలోపే స్థానిక పోలీసులు రావడంతో.. భయంతో హెడ్ కానిస్టేబుల్ యల్లా స్వామి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో స్పెషల్ డ్యూటీ కోసం రెండు నెలల క్రితం వచ్చిన..యల్లా స్వామిపై.. శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని.. డిఎస్పీ రామాంజి నాయక్ తెలిపారు.


అనుమానస్పద ఆయుధాలు దొరికిన స్థలాన్ని సీసీ కమాండ్ కంట్రోల్ రూమ్‌కి వెళ్లి ఫుటేజ్ పరిశీలించారు. అక్కడ దొరికిన ఆయుధాలు పోలీస్ శాఖకు సంబంధించినవేనని తేల్చారు. 1983 బ్యాచ్ కి చెందిన ఎల్లప్పకు శ్రీశైలంలో విధులు నిర్వహిస్తున్నారు. భోజనంకు వెళ్లే సమయంలో అక్కడికి పెట్టి వెళ్లారని డీఎస్పీ చెప్పుకొచ్చారు. ఆ సంచిలో SLR, పిస్టల్ సంబంధించిన బుల్లెట్లు ఎర్రని వస్త్రం, శివకాశి వంకాయ బాంబులు ఆ బ్యాగులో ఎందుకు ఉన్నాయని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

బ్యాగులో మూడు రకాల వెపన్స్, పోలీస్ శాఖకు సంబంధం లేని వెపన్స్‌గా కనిపిస్తున్నాయి. 303, ఎస్ ఎల్ ఆర్, బ్రిటిష్ కాలంలో ఉన్న ఆయుధాలు ప్రస్తుతం పోలీస్ శాఖలో.. లేటెస్ట్ టెక్నాలజీ తో ఉన్న వెపన్స్ వాడుతున్నారు. పాతకాలంనాటి వెపన్స్ ఎక్కడినుండి వచ్చాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


పోలీసులు అధికారులు.. బ్యాగ్ తమ కానిస్టేబుల్‌దని చెప్పినప్పటికి .. ఆ సంచిలో ఎస్ ఎల్ ఆర్, 303, పిస్టల్ సంబంధించిన బుల్లెట్లు ఎర్రని వస్త్రం, శివకాశి వంకాయ బాంబులు ఎందుకు ఉన్నాయని అనుమానాలు పెరుగుతున్నాయి. బ్యాగ్‌కు సంబంధించి సీసీ కెమెరా ఎవిడెన్స్ ఎందుకు చూపించట్లేదని.. పోలీసు శాఖ లేటెస్ట్ టెక్నాలజీతో ఆయుధాతలను వాడుతుండగా.. బ్రిటిష్ కాలంనాటి వెపెన్స్‌ ఎలా వచ్చాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు శ్రీశైలంలో ఏం జరుగుతుంది ప్రజలకు ఏ విధమైన నమ్మకాన్ని కలిగిస్తున్నారు, క్షేత్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారని.. బీజేపీ నాయకులు పోలీసులపై మండిపడుతున్నారు.

Also Read: ఛీ ఛీ.. జగన్ పేరు పెడతామా? దువ్వాడ, దివ్వెల అంత మాట అన్నారేంటి!

పోలీసులు వాస్తవాలు దాస్తున్నారన్న సందేహాలున్నాయి. భోజనానికి వెళ్లి మర్చిపోయాడనుకుంటే సత్రంలో మర్చిపోవాలి కానీ పక్కన రోడ్డు డివైడర్ చెట్లపొదల్లో ఆ సంచి ఎందుకు ఉందన్న ప్రశ్నలకు సమాధానం రాలేదు. డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ భోజనానికి వెళ్లాలంటే రిలీవర్‌కి ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు.

Related News

Fishermen Vs Police: హై టెన్షన్.. అనకాపల్లి హైవే క్లోజ్! మత్స్యకారులు Vs పోలీసులు

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

Big Stories

×