Tomato Face Pack: చలికాలంలో చర్మం పొడిబారడం సర్వసాధారణం. చర్మాన్ని సరిగ్గా చూసుకోకపోతే నిర్జీవంగా మారడం ప్రారంభమవుతుంది. టమాటోలతో తయారు చేసిన ఫేస్ ప్యాక్‌లు చర్మానికి పోషణ , తేమను కాపాడడంలో సహాయపడతాయి. టమాటోలో కొన్ని పదార్థాలను మిక్స్ చేయడం ద్వారా వివిధ రకాల ఫేస్ ప్యాక్‌లను తయారు చేసుకోవచ్చు.
టమాటోలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు , ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా మార్చడంలో, ట్యానింగ్‌ని తగ్గించడంలో, మొటిమలను తొలగించడంలో , చర్మాన్ని బిగుతుగా మార్చడంలో కూడా సహాయపడతాయి.
టమోటాలతో 5 ఫేస్ ప్యాక్‌లను తయారు చేయండి:
1. టమోటో , పెరుగు ఫేస్ ప్యాక్ :
కావలసినవి: 1 టమోటా, 2 చెంచాల పెరుగు
తయారుచేసే విధానం: టమోటాను మెత్తగా చేసి పెరుగులో కలపాలి.
ప్రయోజనాలు: ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. టానింగ్‌ను తొలగిస్తుంది. అంతే కాకుండా చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది.
2. టమాటో, లెమన్ ఫేస్ ప్యాక్ :
కావలసినవి: 1 టమోటో, 1 టీస్పూన్ నిమ్మరసం
తయారుచేసే విధానం: టమాటోను మెత్తగా చేసి అందులో నిమ్మరసం కలపాలి.
ప్రయోజనాలు: ఈ ఫేస్ ప్యాక్ టానింగ్‌ను తొలగిస్తుంది. పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
3. టమాటో, తేనె ఫేస్ ప్యాక్ :
కావలసినవి: 1 టమోటో, 1 టీస్పూన్ తేనె
తయారుచేసే విధానం: టొమాటోను మెత్తగా చేసి అందులో తేనె కలపాలి.
ప్రయోజనాలు: ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది మరియు చర్మం మెరుస్తుంది.
4. టమాటో, శనగపిండి ఫేస్ ప్యాక్ :
కావలసినవి: 1 టమాటో, 2 చెంచాల శనగపిండి
తయారుచేసే విధానం: టొమాటోను మెత్తగా చేసి శెనగపిండిలో కలపాలి.
ప్రయోజనాలు: ఈ ఫేస్ ప్యాక్ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది, మొటిమలను తగ్గిస్తుంది మరియు చర్మాన్ని శుభ్రపరుస్తుంది.
5. టమాటో , ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్ :
కావలసినవి: 1 టమోటో, 2 టీస్పూన్లు ముల్తానీ మిట్టి
విధానం: టమాటోను మెత్తగా చేసి ముల్తానీ మిట్టితో కలపాలి.
ప్రయోజనాలు: ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ ఆయిల్ ఫ్రీగా ఉంచుతుంది .మొటిమలను తగ్గిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని బిగుతుగా చేస్తుంది.
టమాటో ఫేస్ ప్యాక్ వేసుకునే విధానం :
శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి.
సిద్ధం చేసుకున్న ఫేస్ ప్యాక్‌ని ముఖం మరియు మెడపై సమానంగా అప్లై చేయండి.
15-20 నిమిషాలు వదిలివేయండి.
చల్లటి నీటితో కడగాలి.
ఈ ఫేస్ ప్యాక్‌ని వారానికి 2-3 సార్లు అప్లై చేయండి.
Also Read: పెరుగుతో.. గ్లోయింగ్ స్కిన్ గ్యారంటీ
మీకు టమాటో అంటే అలెర్జీ ఉంటే దీనిని ఉపయోగించవద్దు.
నిమ్మరసం చర్మాన్ని సున్నితంగా మార్చగలదు, కాబట్టి దీన్ని నేరుగా చర్మంపై అప్లై చేసుకోవద్దు.
ఎండకు వెళ్లే ముందు టమాటో ఫేస్ ప్యాక్ వేసుకోకండి.
ఏదైనా కొత్త ఫేస్ ప్యాక్ ఉపయోగించే ముందు, ప్యాచ్ టెస్ట్ చేయండి.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.