BigTV English

Jagadeka Veerudu Athiloka Sundari : ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అదే తేదీన రిరిలీజ్.. ఈ సారి 3Dలో!

Jagadeka Veerudu Athiloka Sundari : ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ అదే తేదీన రిరిలీజ్.. ఈ సారి 3Dలో!

Jagadeka Veerudu Athiloka Sundari : ఎదురులేని మనిషి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాడు అశ్విని దత్. అయితే ఆ తర్వాత యుగపురుషుడు, గురు శిష్యుడు, అడవి రాముడు వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలు కమర్షియల్ గా మంచి హిట్ సాధించాయి. అయితే ఒక టైం లో ఆల్మోస్ట్ వరుసగా డిజాస్టర్ సినిమాలు పడ్డాయి. అశ్విని దత్ ఆ టైంలో జగదేకవీరుడు అతిలోకసుందరి అనే సినిమాను నిర్మించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.


కథ ఎలా మొదలైంది.?

మొదటి ఈ సినిమా థాట్ ను రచయిత శ్రీనివాస్ చక్రవర్తికి రాఘవేంద్రరావు చెప్పుకొచ్చారు. భూమిపైకి వచ్చిన ఇంద్రుడి కూతురు తన ఉంగరాన్ని పోగొట్టుకుంటే ఎలా ఉంటుంది.? అనే కథనం శ్రీనివాస్ చక్రవర్తి తో చెప్పడంతో ఈ కథపై యండమూరి వీరేంద్రనాథ్,జంధ్యాల, సత్యానంద్ వంటి రైటర్లు వరుసగా చర్చించి ఒక అద్భుతమైన కథను డిజైన్ చేశారు. దీనికి ఒక మంచి డ్రామాను యాడ్ చేశారు. అయితే ఈ కథ చర్చల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా దాదాపు 25 రోజులు పాటు ఈ టీం తో గడిపారు. మొత్తానికి కథ పూర్తిగా సిద్దమైన తర్వాత ఇది ఒక సోషియా ఫాంటసీ డ్రామాగా తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.


ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి శ్రీదేవి జంటగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. చాలా సెంటర్లో 100 రోజుల వరకు ఆడింది అయితే ఒక సెంటర్లో 200 రోజులు కూడా ఆడింది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు బీభత్సంగా వర్షం కురిసింది. జనాలు బయట అడుగుపెట్టలేని పరిస్థితి. ఆ టైంలో అశ్విని దత్ గారు చాలా టెన్షన్ పడిపోయారంట. కానీ ఆ సినిమా మెల్లమెల్లగా హిట్ టాక్ రావడంతో థియేటర్ వద్ద జన సముద్రం మొదలైంది. అప్పటివరకు ఆల్టెం ఇండస్ట్రీలో ఉన్న హిట్ సినిమాలు అన్నిటి రికార్డును ఈ సినిమా తుడిచివేసింది. ఆ రోజుల్లోనే దాదాపు 15 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్

ఈ సినిమాకి అన్ని అంశాలు కూడా అద్భుతంగా కలిసి వచ్చాయని చెప్పొచ్చు అన్నిటిని మించి ఇళయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకి ప్లస్ అని చెప్పొచ్చు. ఈ సినిమాలోని అన్ని పాటలు కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకి సీక్వెల్ కూడా వస్తే బాగుంటుందని చాలామంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కోసం విజయ వాహని స్టూడియోస్ లో బారి సెట్ నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ప్రేమ్ నగర్ సినిమా తర్వాత అతిపెద్ద సెట్ ఈ సినిమాకి వేశారు. ఇదే సినిమాను హిందీలో ఆద్మీ అప్సర అనే పేరుతో హిందీలో కూడా డబ్ చేశారు. అక్కడ కూడా ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమాని మరోసారి ఆడియన్స్ కు చూపించడానికి మే 9న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఇప్పుడు సరికొత్తగా త్రీడీ వెర్షన్ లో రిలీజ్ చేయబోతున్నారు. 3d వెర్షన్ అంటే ఎలా ఉండబోతుంది అని మెగా అభిమానులకి ఇప్పటికే క్యూరియాసిటీ మొదలైంది.

Also Read : Nc24 : పర్ఫెక్ట్ పాన్ ఇండియా మెటీరియల్, నాగచైతన్య కెరియర్ లో నెవర్ బిఫోర్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×