Inspirational Love story| ఈ రోజుల్లో ప్రేమ అంటే సోషల్ మీడియాలో జంటల ఫొటోలు, గిఫ్టులు, రొమాంటిక్ మెసేజెస్ కనిపిస్తాయి. అయితే చిన్న చిన్న విషయాలకే ప్రేమికులు, భార్యాభర్తలు గొడవలు పడి విడిపోతుంటారు. అలాంటిది ఈ రోజుల్లో ప్రేమ ఎంత పవిత్రమైన భావనో తెలిపే ఒక నిజజీవిత కథ ఉంది. ఆ కథ పురాణాలు, చరిత్రలోనిది కాదు. కేవలం కొన్ని దశాబ్దాల క్రితం జరిగింది. ప్రేమలో నమ్మకం, ఓర్పు, బాధ్యత, పరస్పర గౌరవం కూడా ఎంతో ముఖ్యం. అన్నింటి కంటే ప్రేమ అతున్నత రూపం త్యాగం.
బిహార్‌లోని గయా జిల్లాలో గెహ్లౌర్ గ్రామానికి చెందినవారు దశరథ్ మాంఝీ. ఆయన గ్రామానికి సమీపంలో ఉన్న కొండ కారణంగా ప్రజలు ఆ కొండ మీదుగా రాళ్లు రప్పలపై కాలినడకన చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ముఖ్యంగా నీటికొరత, స్కూల్, వైద్య అత్యవసర సమయంలో ఈ దూరం పెద్ద సమస్యగా మారేది. ఒక రోజు మాంఝీ భార్య ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడడంతో ఆమెకు త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లడానికి కొండ అడ్డుగా మారింది. సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆమె మరణించారు.
ఈ విషాదం వల్ల మాంఝీ కుం
గిపోయారు. కానీ ఆయన ఆ సమయంలో ఆ కొండపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించారు. ప్రజలకు సులభంగా ఆసుపత్రికి చేరుకునే మార్గం ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. చేతిలో సాధారణ పనిముట్లతోనే ఆయన కొండను చీల్చి ఒక రోడ్డు నిర్మించే పని ప్రారంభించారు. ఈ పని దాదాపు అసాధ్యం లాంటిది.ఒకే ఒక్కడు కేవలం తన చేతులు, కనీస వనరులతో పగలు, రాత్రి అనక దాదాపు 22 సంవత్సరాల పాటు కష్టపడి కొండను చిన్న చిన్న ముక్కుల చేసి రాళ్లను తొలగించి రహదారిని నిర్మించారు.
దశరథ్ మాంఝీ కథ.. ప్రేమ అంటే కేవలం సంతోషకరమైన క్షణాలు కాదని చెబుతుంది. కష్టాలు వచ్చినప్పుడు కూడా ప్రయత్నించడం ప్రేమలోని నిజమైన బాధ్యతను చూపిస్తుంది. నేటి డిజిటల్ కాలంలో చిన్న విషయాలు కూడా కొన్నిసార్లు జంటల మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. మెసేజ్‌కు ఆలస్యంగా సమాధానం ఇవ్వడం లేదా ప్రత్యేక రోజును మర్చిపోవడం సమస్యగా మారుతోంది. అయితే ప్రతి చిన్న సమస్యకు సంబంధాన్ని ముగించడం పరిష్కారం కాదు. భాగస్వాములు ముందుగా మాట్లాడుకుని సమస్యకు కారణాన్ని అర్థం చేసుకోవాలి.
Also Read: పెళ్లికి ముందు మీకు కాబోయే భర్త సంపాదన గురించి అడిగితే తప్పా? ఓపెన్‌గా చర్చించాల్సిన విషయాలివే
దశరథ్ మాంఝీ తన భార్యపై ప్రేమను, ఆమెను కోల్పోయిన బాధను ఇతరులకు ఉపయోగపడేలా శ్రమించారు. ఆయన ఓర్పు, పట్టుదలకు ప్రతీకగా నిలిచారు. అనుకున్న పని పూర్తిచేసే వరకు ఆయన వెనక్కి తగ్గలేదు. రిలేషన్‌షిప్ నిపుణుల ప్రకారం.. సంబంధాన్ని కొనసాగించే బాధ్యత ఇద్దరు భాగస్వాములపై సమానంగా ఉంటుంది. ఒకరి ప్రయత్నంతో మాత్రమే బంధం ఎక్కువకాలం కొనసాగదు. ప్రతి సంబంధంలో అపార్థాలు, అభిప్రాయ భేదాలు, కష్టాలు రావచ్చు. వాటిని ఓర్పుతో పరిష్కరించుకోవడం చాలా అవసరం.
Also Read: ఫ్లాట్ దక్కక ముందే కొనుగోలుదారుడు చనిపోతే ఎలా? హోమ్ లోన్, అతడి ఫ్లాట్ ఎవరికి దక్కుతాయి?
ప్రేమ అంటే మంచి సమయాల్లో మాత్రమే కలిసి ఉండటం కాదు. సమస్యలు ఎదురైనప్పుడు కూడా ఒకరికొకరు అండగా నిలవడం ముఖ్యం. అయితే హానికరమైన లేదా అసురక్షితమైన సంబంధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదు. గౌరవం, భద్రత, పరస్పర అంగీకారం ప్రతి ఆరోగ్యకరమైన సంబంధానికి ఆధారం.