Viral Video : రష్యాలో ఓ దుకాణానికి వెళ్లి చల్లని బీర్ తీసుకున్నాడో వ్యక్తి.. తనకు ఇష్టమైన బ్రాండ్ అది. బయటకు వచ్చాక చూస్తే.. ఆ బీర్ క్యాన్ కొత్త డిజైన్ లో వచ్చింది. సరికొత్త డిజైన్ లో తమ ఉత్పత్తుల్ని అమ్ముకోవడం చాలా సంస్థలు చేసే పనే.. అందులో భాగంగానే ఆ సంస్థ అలా చేసింది అనుకున్నారు. కానీ.. తీరా చూస్తూ ఆ బీర్ క్యాన్ మీద మహాత్మా గాంధీ ఫోటో దర్శనం ఇచ్చింది. అంతే.. ఒక్కసారిగా షాక్. పైగా.. ఆయన సంతకాన్ని సైతం ఆ బీర్ క్యాన్ పై ప్రింట్ చేసింది.. రష్యాకు చెందిన ఆ బీర్ సంస్థ.
భారత జాతిపిత, స్వాతంత్ర్య సమరయోధుడు మహాత్మా గాంధీ గురించి ప్రపంచానికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన శాంతి విధానంతో 200 ఏళ్ల బ్రిటీష్ పాలనకు చరమగీతం పాడి, దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అందించిన వీరుడు. అలాంటి.. వ్యక్తి ఫోటో, సంతకంతో ఓ బీర్ కంపెనీ ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తుంది. వినేందుకే చాలా ఆశ్చర్యంగా ఉన్నా.. రష్యాలో ఈ బీర్ క్యాన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో.. ఆ సంస్థకు అసలు మతి ఉందా అంటూ.. బీర్ క్యాన్ల ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. వీటిని బ్రాండ్ రివర్ట్ హేజీ IPA తయారు చేస్తుండగా, రష్యా వ్యాప్తంగా అన్ని స్టోర్లకు సరఫరా చేస్తున్నారు. ఈ క్యాన్లను చూసిన వారంతా.. ఈ సంస్థ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీని ఈ చర్యతో అవమానించినట్లే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా.. ఈ విషయమై సోషల్ మీడియాలో అనేక పోస్టులు, వీడియోలు వైరల్ గా మారాయి.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
వాస్తవానికి.. మహాత్మ గాంధీ తన జీవితాంతం.. మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. తన జీవితంలో ముఖ్యమైన ఘట్టాల్లో ఈ రెండింటికి దూరంగా ఉంటానని తన తల్లికి మాట ఇచ్చిన సందర్భాన్నీ తన జీవిత కథలో పేర్కొన్నారు మహాత్మ గాంధీ. అలాంటి వ్యక్తి ఫోటో, సంతకాన్ని ఇలా బీర్ క్యాన్లపై అచ్చు వేయడాన్ని అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. గాంధీ మహాత్ముడి గురించి అన్ని విషయాలు తెలిసే.. సదరు బీర్ల ఉత్పత్తి సంస్థ అలా చేసి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రష్యాకు చెందిన రివర్ట్ హేజీ IPA సంస్థ పై భారత్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ ప్యాకేజింగ్ బీర్లను వెంటనే మార్కెట్ల నుంచి ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సంస్థ ఇప్పుడే కాదు.. గతంలోనూ కొన్ని వివాదాస్పద చర్యలకు పాల్పడింది. 2018లో FIFA ప్రపంచ కప్ క్వార్టర్-ఫైనల్స్‌లో ప్రముఖుల పేర్లతో బీర్లను విడుదల చేసి వార్తల్లో నిలిచింది. కాగా.. స్వాతంత్ర్య సమరయోధుడి పేరుతో ఆల్కహాల్ విక్రయించడంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతుండగా.. అనేక ఇతర ప్రముఖ నాయకుల పేర్లతోనూ ఈ సంస్థ బీర్లను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో.. మదర్ థెరిసా, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ వంటి వారున్నారు. పేర్లతో కూడిన బీర్లను కూడా ఉత్పత్తి చేస్తుందని తెలుస్తోంది.
Also Read : రోజా పూలు పాత స్టైల్.. ఏనుగు పేడ కొత్త ట్రెండ్, వాలంటైన్స్ డేకి కొత్త గిఫ్ట్ రెడీ!
మహాత్మా గాంధీ పేరుతో ఉన్న మద్యం లభించడం ఇప్పుడే జరగలేదు. దశాబ్దం క్రితం, హైదరాబాద్ కోర్టులోనూ ఇలాంటి ఓ ఘటనపై పిటిషన్ దాఖలైంది. బీర్ డబ్బాలు, బాటిళ్లపై మహాత్మా గాంధీ చిత్రాన్ని ఓ యూఎస్ సంస్థ ముద్రించింది. దీనిపై కోర్టులో కేసు దాఖలు కాగా.. ఆ అమెరికన్ సంస్థ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.