HHVM: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా జూన్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చిత్ర బృందం ప్రకటించడమే కాకుండా అందుకు తగ్గ ఏర్పాట్లన్నీ కూడా చేశారు. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా భారీ స్థాయిలో నిర్వహిస్తూ సినిమాపై అంచనాలను కూడా తారాస్థాయిలో పెంచేశారు. మరొక ఎనిమిది రోజులలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అభిమానులు ఆనందపడేలోపు ఈ సినిమా విడుదల వాయిదా పడిందని తెలియజేశారు. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించి కొన్ని పనులు పూర్తి కాలేదని అందుకే సినిమాని వాయిదా వేస్తున్నట్టు తెలియజేశారు.
తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్….
పవన్ కళ్యాణ్ సోలో హీరోగా వెండితెరపై కనిపించి చాలా సంవత్సరాలే అవుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇలా డిప్యూటీ సీఎం హోదాలో తమ అభిమాన హీరోని వెండి తెరపై చూడటం కోసం అభిమానులు ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి వార్త ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా ఎడిటింగ్ పనులతో పాటు సిజీఐ వర్క్ పూర్తి కాలేదని అందుకే కొద్ది రోజులు పాటు ఈ సినిమాని వాయిదా వేస్తున్నారని చిత్రబృందం తెలిపారు. ఇకపోతే ఈ సినిమా జూన్ 12న విడుదల కాబోతుందని, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జూన్ 8న తిరుపతిలో ఘనంగా నిర్వహించేలా మేకర్స్ ప్లాన్ చేశారు.
కొత్త తేదీ ప్రకటన….
ఇక ఈ సినిమా విడుదల వాయిదా పడటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు సంబంధించి కొత్త తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించారు. ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించేలా చిత్ర బృందం ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరవుతారని, ఈయనతో పాటు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరు కాబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇలా ఈవెంట్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు రావడంతో అభిమానులలో కూడా సరికొత్త జోష్ ఉండేది. అయితే ఈ సినిమా వాయిదా ప్రకటన అభిమానులను పూర్తిగా నిరాశపరిచింది.
హరిహర వీరమల్లు సినిమా 12వ తేదీ రాబోతున్న నేపథ్యంలో బిజినెస్ కూడా భారీగానే జరుపుకుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే… ఈ చిత్రానికి మొదట దర్శకుడు క్రిష్ పనిచేశారు కానీ, కొన్ని కారణాలవల్ల ఆయన తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. మొఘల్ సామ్రాజ్యకాలం నాటి కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది . పవన్ మొదటిసారి ఇలాంటి చారిత్రాత్మక నేపథ్యం కలిగిన సినిమాలో హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లుక్ కానీ, సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ కానీ సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటించగా, బాబీ డియోల్, అనుపమ కేర్ వంటి వారు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.