Types Of Headache: తలనొప్పి అనేది సాధారణ సమస్య. దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో అనుభవించే సమస్య ఇది. కానీ అన్ని తలనొప్పులు ఒకేలా ఉండవని అర్థం చేసుకోవడం ముఖ్యం. నిజానికి.. తలనొప్పులు అనేక రకాలుగా ఉంటాయి. వాటిలో చాలా మందికి కొన్ని రకాల తలనొప్పులతో మాత్రమే ఇబ్బంది పడుతుంటారు. తలనొప్పుల రకాలు వాటికి సంబంధించిన పూర్తి వివరాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
తలనొప్పి రకాలు:
తలనొప్పి అనేది చాలా సాధారణ సమస్య. ఇది దాదాపు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఎదుర్కునే ఉంటారు. ప్రతి తలనొప్పి దానికదే భిన్నంగా ఉంటుంది. దాని కారణాలు, లక్షణాలు , తీవ్రత మారుతుంటాయి. అంతే కాకుండా అవి వేర్వేరు ఆరోగ్య పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.
అన్ని రకాల తలనొప్పులు ఒకేలా ఉండవని అర్థం చేసుకోవడం ముఖ్యం. కొన్ని రకాల తలనొప్పులు చాలా తక్కువ సమయం మాత్రమే ఉండి వాటంతట అవే తగ్గిపోతాయి. మరికొన్ని మైగ్రేన్, ఒత్తిడి లేదా సైనస్ వంటి తీవ్రమైన సమస్యలతో ముడిపడి ఉంటాయి. కొన్నిసార్లు ఇవి కొన్ని అంతర్గత వ్యాధుల ప్రారంభ సంకేతాలుగా కూడా మారతాయి. అందుకే మీకు తరచుగా తలనొప్పి వస్తే లేదా తలతిరగడం, వాంతులు లేదా కంటి సంబంధిత సమస్యలు ఎదురైతే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి.
1. టెన్షన్ తలనొప్పి:
టెన్షన్ వల్ల వచ్చే తలనొప్పి అత్యంత సాధారణ రకం. ఒత్తిడి, అలసట లేదా ఎక్కువసేపు తప్పుడు భంగిమలో కూర్చోవడం వల్ల ఈ తలనొప్పి వస్తుంది. ఇది తలకు రెండు వైపులా లేదా నుదిటిపై నుండి కాస్త ఎక్కువ నొప్పిని కలిగిస్తుంది. అంతే కాకుండా తలను బిగుతుగా పట్టుకున్న బ్యాండ్ లాగా నొప్పిని కలిగిస్తుంది. ఇది ఒత్తిడి, నిద్ర లేకపోవడం, డీహైడ్రేషన్ వల్ల వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. లోతైన శ్వాసను తీసుకోండి. ప్రశాంతమైన, బహిరంగ వాతావరణంలో విశ్రాంతి తీసుకోండి. లేదా పిప్పరమెంటు నూనెతో మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.
2.అధిక రక్తపోటు తలనొప్పి:
అధిక రక్తపోటు వల్ల కలిగే తలనొప్పులు తరచుగా తల వెనుక భాగంలో లేదా తల అంతటా నొప్పిని కలిగిస్తాయి. ఇది ఉదయం మరింత తీవ్రంగా ఉంటుంది. అంతే కాకుండా నిద్రపోతే దీని ప్రభావం చాలా వరకు తగ్గుతుంది. అదుపు లేని అధిక రక్తపోటు సున్నితమైన రక్త నాళాలపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల ఈ నొప్పి వస్తుంది. దీంతో పాటు తల తిరగడం, దృష్టి మసక బారడం లేదా ఛాతీ నొప్పి ఉంటే.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి. దీని నుండి ఉపశమనం పొందడానికి.. మీ రక్తపోటును సాధారణంగా ఉంచడానికి చర్యలు తీసుకోండి.
3. మైగ్రేన్:
మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత పరిస్థితి. ఇది తలలో ఒక వైపున తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. అంతే కాకుండా ఇది 4 నుండి 72 గంటల వరకు ఉంటుంది. వికారం, వాంతులు వంటి లక్షణాలతో కూడి ఉంటుంది. మైగ్రేన్లు ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడంతో పాటు నిద్ర లేకపోవడం వల్ల పెరుగుతుంది. తీవ్రమైన సందర్భాల్లో.. మీరు ఖచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించండి.
Also Read: ప్రతి రోజు ఉదయం సూర్య నమస్కారం చేస్తే.. లాభాలివే !
4. సైనస్ తలనొప్పి:
సైనస్ తలనొప్పులు సైనసిటిస్ లేదా సీజనల్ అలెర్జీల వల్ల వస్తాయి. ఈ సమయంలో ముక్కు చుట్టూ ఉన్న కావిటీస్ వాపుకు గురవుతాయి. ఇది నుదురు, కళ్ళు , బుగ్గల చుట్టూ ఒత్తిడి లేదా నొప్పిని కలిగిస్తుంది. సైనస్ తలనొప్పి సాధారణంగా ఉదయం వేళల్లో వస్తుంది. దీంతో పాటు ముక్కు మూసుకుపోవడం, జ్వరం లేదా ముఖంలో వాపు వంటి లక్షణాలు కూడా పెరుగుతాయి. తీవ్రమైన సైనస్ తలనొప్పి విషయంలో డాక్టర్ యాంటీ బయాటిక్స్‌ను సిఫారసు చేస్తారు.