Indian Railways: కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మిన్ చిన్న పాటి గాలి వానకే చెరువును తలపిస్తోంది. సీలింగ్ లీకై వాన నీళ్లు కారుతున్నారు. స్టేషన్ అంతా ఎటు చూసి నీటి ధారలే కనిపిస్తున్నాయి. ఈ నెల తొలి వారంలో కురిసిన వానలకు టెర్మినల్ ఫాల్ సీలింగ్ సహా ఎలివేషన్ కూలిపోయింది. మెయిన్ ఎంట్రెన్స్ రూఫింగ్ షీట్లు కూలిపడ్డాయి. ఇక తాజాగా కురిసిన వర్షాలకు రైల్వే స్టేషన్ అంతా వాన నీటితో నిండిపోయింది. రైల్వే స్టేషన్ మెట్లు మొదలుకొని ఎస్కలేటర్లు సహా అన్ని ప్రాంతాలు వర్షంతో నిడిపోయాయి. ప్రయాణీకులు కనీసం సరిగా నిలబడే ప్రదేశం కూడా సరిగా లేదు. వెంటతెచ్చుకున్న లగేజీ తడిసిపోతున్నా అలాగే, ఉండాల్సిన పరిస్థతి నెలకొంది. వర్షం ధాటికి ఆగమాగం అయిన చర్లపల్లి రైల్వే స్టేషన్ ను ప్రయాణీకులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఏర్పాటు చేశామని చెప్తున్న రైల్వే స్టేషన్.. చిన్న గాలి వానకే ఇలా మారితే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రయాణీకులు. నాలుగు ఏళ్లు నిర్మించి, నాలుగు నెలల క్రితం ప్రారంభించిన రైల్వే స్టేషన్ ఇంత అధ్వాహ్నంగా మారండం ఏంటి? అంటున్నారు. చిన్న వర్షానికే రైల్వే స్టేషన్ కాస్త వాటర్ పార్క్ గా మారిపోయిదంటూ సటైర్లు వేస్తున్నారు. కోట్ల రూపాయలు పెట్టి నిర్మించిన ఈ రైల్వే స్టేషన్.. నెలలు గడవక ముందే ఇలా అయితే, మున్ముందు ఇంకెలా ఉంటుందో? అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా రైల్వే స్టేషన్లను నిర్మిస్తూ, ప్రపంచ స్థాయి సౌకర్యాలు అని చెప్పడం నిజంగా హాస్యాస్పదం అంటున్నారు. వెంటనే రైల్వే స్టేషన్ పనులను పూర్తి స్థాయిలో సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Cherlapally Railway Station 🌧️
Took 4 years to build.
Inaugurated by PM Modi just 4 months ago.
Built at a cost of ₹413 crore.World-class infrastructure?
One rain turned it into a water park.
Are we competing with China or just fooling our own people? pic.twitter.com/xKiwMZ48Zl— YSR (@ysathishreddy) May 22, 2025
రూ. 428 కోట్లతో రైల్వే స్టేషన్ నిర్మాణం
సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో ప్రయాణీకుల రద్దీని తగ్గించేందుకు చర్లపల్లిలో అత్యాధునిక రైల్వే టెర్మినల్ ను నిర్మించారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను అనుగుణంగా ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి నగర శివార్లలో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చారు. సుమారు రూ. 428 కోట్లతో ఈ రైల్వే స్టేషన్ ను నిర్మించారు. మొత్తం రెండు అంతస్తులలో ఈ టెర్మినల్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టేషన్ లో మొత్తం 9 ప్లాట్ ఫారమ్ లు, 19 రైల్వే లైన్లను నిర్మించారు. దివ్యాంగులు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా 5 లిఫ్టులు, 5 ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, వెయిటింగ్ హాల్స్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఏర్పాటు చేశారు. ఫస్ట్ ఫ్లోర్ లో కేఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలు, పురుషుల కోసం విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. అద్భుతంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్ చిన్న గాలివానకే వారట్ పార్క్ ను తలపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. హంగూ ఆర్భాటం తప్ప, పనుల్లో క్వాలిటీ లేదని విమర్శలు చేస్తున్నారు.
Read Also: ముంబై నుంచి నేరుగా మాంచెస్టర్ కు.. నాన్ స్టాప్ విమాన సర్వీసులు!