Amazon Great Indian Festival 2026: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చేసింది.. డిస్కౌంట్లతో షాపింగ్ ప్రియులకు పండగ మొదలైంది. అక్టోబర్ 8 నుంచి మెయిన్ సేల్ ప్రారంభం కానుండగా.. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లపై భారీ ఆఫర్లు అంటూ ఇప్పటికే ప్రచారం జోరందుకుంది. ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందనే ప్రకటనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. స్క్రీన్‌పై కనిపించే తక్కువ ధర చూసి వెంటనే ఆర్డర్ చేసేయకండి. కొన్ని ఆఫర్లలో బ్యాంక్ డిస్కౌంట్‌ను ముందే కలిపి చూపిస్తుండగా.. మరికొన్ని చోట్ల వేరే ర్యామ్, స్టోరేజ్ వేరియంట్ ధరలను హైలైట్ చేస్తున్నారు. అందుకే ఇంత తక్కువకే వస్తుందా? అని ఆశ్చర్యపోయే ముందు.. అసలు ధర ఎంత? ఏ వేరియంట్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది? బ్యాంక్ ఆఫర్ తర్వాతేనా ఈ ధర? వంటి వివరాలను ఒకసారి చెక్ చేయడం చాలా ముఖ్యం.
వన్‌ప్లస్ నుంచి వచ్చిన ఈ ఫోన్ ఆఫర్‌లో రూ.18,499కి లభిస్తుందని వార్తలు వస్తున్నాయి. నిజానికి ఇది బ్యాంక్ ఆఫర్లతో కలిపి ఇచ్చే ధర అయివుండవచ్చు. జులైలో వచ్చిన ఈ ఫోన్ రూ.18,999, రూ.20,999 ధరకు విడుదలైంది. 7000mah పెద్ద బ్యాటరీ, 6.8 అంగుళాల డిస్‌ప్లే దీని ప్రత్యేకతలు. అయితే ఏ వేరియంట్‌పై ఈ తగ్గింపు ఉందో ప్రొడక్ట్ పేజీలో సరిచూసుకోవడం ముఖ్యం.
ఈ మోడల్ రూ.15,999కి వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ లాంచ్ సమయంలో దీని ప్రారంభ ధర రూ.9,999 కాగా, టాప్ వేరియంట్ రూ.12,999 మాత్రమే ఉంది. మరి ఇప్పుడు కనిపిస్తున్న ధర ఏ వేరియంట్‌దో క్లారిటీ లేదు. డైమెన్సిటీ 6300 చిప్‌సెట్, 6000mah బ్యాటరీ ఉన్న ఈ 5G ఫోన్ కొనేముందు స్టోరేజ్, ర్యామ్ వివరాలు ఖచ్చితంగా చెక్ చేయండి.
Also Read: iPhone 18 Pro కొనే ప్లాన్ ఉందా? బ్యాటరీ టెస్ట్‌లో బయటపడ్డ షాకింగ్ విషయాలివే!
గేమింగ్ ప్రియుల కోసం వచ్చిన ఈ ఫోన్ డీల్ ప్రైస్ రూ.41,999గా చెబుతున్నారు. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్, 144 హెర్ట్జ్ డిస్‌ప్లే, 120 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఇది మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది. కాకపోతే లాంచ్ సమయంలోనే వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. కాబట్టి సేల్‌లో మీకు ఏ మోడల్ ఎంత ధరకు వస్తోందో చూసుకున్నాకే ముందడుగు వేయడం మంచిది.
ల్యాప్‌టాప్ విభాగంలో మ్యాక్‌బుక్ నియో 13 ధర రూ.71,990గా చూపిస్తున్నారు. కానీ దీని లాంచ్ ధరపై రకరకాల నివేదికలు ఉన్నాయి. కొన్ని చోట్ల రూ.69,900 అని, మరికొన్ని చోట్ల రూ.79,900 అని ఉంది. ఏ18 ప్రో చిప్, 13 అంగుళాల డిస్‌ప్లేతో రోజూవారీ పనులకు ఇది బాగా సరిపోతుంది. అమెజాన్ లైవ్ పేజీలో ఖచ్చితమైన కాన్ఫిగరేషన్ చూడటం శ్రేయస్కరం.
ఈ జాబితాలో అత్యధిక తగ్గింపు లభిస్తున్నది దీనికే. రూ.17,999 లాంచ్ ధర ఉన్న ఈ స్మార్ట్‌వాచ్ ఆఫర్‌లో రూ.9,999కే దక్కుతోంది. 1.43 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, జీపీఎస్, 100 గంటల బ్యాటరీ లైఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇది కేవలం ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే పనిచేస్తుందని, ఐఓఎస్‌కు సపోర్ట్ చేయదని గుర్తుంచుకోండి.
Also Read: రూ.9,999 బడ్స్ ఇప్పుడు రూ.3,399కే.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో దిమ్మతిరిగే డీల్!