శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనవి వెన్న ఉండలు. వీటిని చూస్తేనే నోరూరిపోయేలా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వెన్న ఉండలను అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. పట్టణాలు, నగరాల్లో మాత్రం దీని రెసిపీ ఎవరికీ తెలియదు. వెన్నపూసతో చేసే వెన్న ఉండలని ఒక్కసారి మీ పిల్లలకు చేసి పెట్టండి.. వాళ్ళు ఇష్టంగా తింటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తే చాలు అతనికి నైవేద్యంగా వెన్న ఉండలను కచ్చితంగా పెడతారు. వీటి రెసిపీ ఎలాగో తెలుసుకోండి.
వెన్న ఉండలు రెసిపీకి కావలసిన పదార్థాలు
వెన్న పూస – ఒక కప్పు
నువ్వులు – ఒక స్పూను
వాము – చిటికెడు
ఇంగువ – చిటికెడు
ఉప్పు – చిటికెడు
వరి పిండి – ఒక కప్పు
నూనె – డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
వెన్న ఉండలు రెసిపీ
1. వెన్న ఉండలు చేసేందుకు మీరు తడి వరి పిండి లేదా పొడి వరి పిండి.. ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు.
2. ఒక గిన్నెలో ఈ వరి పిండిని వేసి ఉప్పు, ఇంగువ, వాము, నువ్వులు వేసి బాగా కలపాలి.
3. అందులోనే వెన్నపూసను కూడా వేసి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి.
4. ఒకవేళ మీ దగ్గర తాజా వెన్న లేకపోతే వైట్ బటర్ మార్కెట్లలో దొరుకుతుంది.
5. ఆ వైట్ బటర్ వేసి బాగా కలిపి పూరీ ముద్దలాగా చేయాలి.6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసుకోవాలి.
8. ఆ నూనె వేడెక్కిన తర్వాత పిండి నుంచి చిన్న ముద్దను తీసి ఉండల్లాగా చుట్టుకోవాలి. అవి చాలా చిన్నగానే ఉండాలి. 9. అలా అన్నీ చుట్టుకొని నూనెలో వేసి వేయించాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
10. అంతే వెన్న ఉండలు రెడీ అయినట్టే. వీటిని తింటే ఎంతో కమ్మగా ఉంటాయి.
11. ఒకసారి మేము చెప్పిన పద్ధతిలో చేసి చూడండి.. మీకు ఇవి కచ్చితంగా నచ్చుతాయి.
ముఖ్యంగా పిల్లలు చిరు తిండిని అడుగుతూ ఉంటారు. బయట దొరికే పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా ఇలా వెన్న ఉండలు చేసి పెడితే వారికి బలం కూడా వస్తుంది. తాజా వెన్నతో చేసేందుకు ప్రయత్నించండి. అప్పుడే వీటి అసలైన రుచి మీకు తెలుస్తుంది. తాజా వెన్న నువ్వు తీసి ముందుగానే కొంత దాచి పెట్టుకోవాలి. ఆ ఫ్లేవర్ పిల్లలకి ఎంతో నచ్చుతుంది.