Venu Swamy Money Warning:వేణుస్వామి..ఈయన గారి గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.జ్యోతిష్యం పేరిట వివాదాల పాలు కావడం ఈయనకి వెన్నతో పెట్టిన విద్య.గతంలో ఇలా సెలబ్రిటీలపై జ్యోతిష్యం చెప్పి చిక్కుల్లో పడ్డారు కూడా.అలాంటి ఈయన తాజాగా డబ్బుపై చెప్పిన కొన్ని విషయాలు ఇపుడు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.
వేణు స్వామి మాట్లాడుతూ “ఎవరికీ అప్పులు ఇవ్వకండి.. చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా చూసుకోండి.. రాబోయే రోజుల్లో పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా ఉండొచ్చు”.. అంటూ చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా డబ్బు విషయంలో ఆయన చేసిన సూచనలు, రాజకీయాలు, బెట్టింగ్, రాబోయే ఎన్నికలపై చెప్పిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యే ఓ వీడియోలో మాట్లాడిన వేణుస్వామి.. ప్రస్తుతం గ్రహాల గమనం సాధారణంగా లేదని,. కుజుడు, కేతువు, రాహువు, గురుడు, శని వంటి గ్రహాల మధ్య సంచారం గురించి వివరిస్తూ దీని ప్రభావం మిడిల్ క్లాస్ పై పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా డబ్బు విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని వేణుస్వామి తెలిపారు. . ప్రస్తుతం చేతిలో ఉన్న లిక్విడ్ క్యాష్‌ను వీలైనంత వరకు కాపాడుకోవాలని, అవసరం లేని చోట డబ్బులు పెట్టకూడదని చెప్పారు. ఎవరికైనా పెద్ద మొత్తంలో అప్పుగా డబ్బులు ఇవ్వడం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉదాహరణకు ఎవరి దగ్గరైనా రూ.50 లక్షలు ఉంటే.. ఆ డబ్బును వెంటనే మరొకరికి అప్పుగా ఇచ్చే బదులు బ్యాంకులో ఉంచి వడ్డీ పొందడం లేదా తమ వద్దే ఉంచుకుని కాపాడుకోవడం ఉత్తమని తన వీడియోలో సెలవిచ్చారు ఈ ప్రముఖ జ్యోతిష్యులు.
ముఖ్యంగా రాబోయే రోజుల్లో దేశంలో కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని కొన్ని నెలల్లోనే పరిస్థితుల్లో మార్పులు కనిపించవచ్చని అంచనాలను వేస్తూ వివరించారు.ఇక రాజకీయాల విషయానికి వస్తే.. రాజకీయాల గురించి ఎవరితోనైనా వాదించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని రాజకీయాలపై చేసే ఆర్గ్యుమెంట్స్ ఎంత పెద్ద వివాదానికి అయినా దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు.ముఖ్యంగా
స్నేహితులు, బంధువులు, సన్నిహితులతో పొలిటికల్ డిబేట్లు చేయడం ఆపితే మంచిదని సెలవిచ్చారు. రాజకీయాల విషయంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు రాబోయే కాలంలో పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని ,అందుకే తొందరపడి బెట్టింగులు వేసి బతుకులని బుగ్గిపాలు కాకుండా చూసుకోవాలని హితవు పలికారు. క్రికెట్ అయినా, రాజకీయాలైనా బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని ఆయన స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా రాజకీయ ఫలితాలపై బెట్టింగ్ పెట్టి డబ్బులు సంపాదించాలని ప్రయత్నించవద్దని సూచించారు.
2027లో పంజాబ్, మణిపూర్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న ఈ సమయంలో జరగనున్న క్రమంలో వేణు స్వామి చేసిన ఈ కామెంట్స్ ఇపుడు వైరల్ అవుతున్నాయి.అంటే ఈయన లెక్క ప్రకారం బిజేపీ తన అధికారాన్ని కోల్పోతుందన్న మాట.మొత్తానికి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా చూసుకోవాలని , అప్పులు ఇవ్వకూడదని, బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని వేణు స్వామి చెప్పడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపొయింది !