BigTV English

Vitamin B12 Deficiency: ఈ 5 లక్షణాలు మీలో ఉంటే.. విటమిన్ B12 తగ్గినట్లే !

Vitamin B12 Deficiency: ఈ 5 లక్షణాలు మీలో ఉంటే.. విటమిన్ B12 తగ్గినట్లే !

Vitamin B12 Deficiency : విటమిన్లు శరీరానికి అత్యవసరమైన పోషకాలు. ఇవి శరీరంలో తగినంత ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. అనేక అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒక వేళ విటమిన్ల లోపం శరీరంలో కలిగితే మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా విటమిన్ బి 12 అనేది ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ విటమిన్ లోపిస్తే కనక శరీరంలో అలసటతో పాటు బలహీనతలు ఏర్పడతాయి. నాడీ వ్యవస్థ పనితీరును విటమిన్ బి 12 ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అంతే కాకుండా నాడీ వ్యవస్థ ఆరోగ్యంతో పాటు రక్తకణాల నిర్మాణం, డీఎన్ఏ విశ్లేషణలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి విటమిన్ బి 12 లోపిస్తే కలిగే అనారోగ్య సమస్యలు.. విటమిన్ లోపం తలెత్తకుండా తీసుకోవాల్సిన ఆహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


విటమిన్ బి 12 లోపిస్తే కలిగే లక్షణాలు:

అలసట, బలహీనత: విటమిన్ బి 12 లోపిస్తే అలసటతో పాటు బలహీనతలు ఏర్పడతాయి. ఇవి విటమిన్ బి 12 లోపిస్తే కలిగే సాధారణ లక్షణాలుగా చెప్పవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం అజాగ్రత్తగా ఉండకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


పసుపు రంగు: చర్మంతో పాటు గోర్లు, కళ్లలోని తెల్లటి రంగు పసుపు రంగులోకి మారుతుంది. అందుకు ఎప్పటికప్పుడూ గోళ్ల రంగును పరిశీలిస్తూ ఉండాలి.
తలనొప్పి, మైకం: విటమిన్ బి 12 మెదడుపై ప్రభావాన్ని చూపుతుంది ఈ విటమిన్ లోపం వల్ల తలనొప్పితో పాటు మైకం వంటివి వస్తుంటాయి.

జీర్ణ సమస్యలు:  విటమిన్ లోపం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. పలితంగా మలబద్ధకం, అతిసారం లేదా అజీర్ణం వంటివి వస్తుంటాయి.

నరాల సమస్యలు: విటమిన్ బి 12 లోపం వల్ల తిమ్మిరి, జలదరింపులు, కండరాల బలహీనతతో పాటు సమతుల్యత కోల్పోవడం వంటివి జరుగుతాయి.

ప్రవర్తనలో మార్పులు : చిరాకు, నిరాశ, గందరగోళం వంటివి విటమిన్ బి 12 లోపిస్తే వస్తాయి.

Also Read: మునగాకు లాభాలు తెలిస్తే.. వదలకుండా తింటారు

విటమిన్ B12 లోపాన్ని తగ్గించడానికి ఈ ఆహారాలను తినండి :

మాంసం: మటన్, పంది మాంసం, చికెన్ వంటి మాంసాహారాలు విటమిన్ B12 యొక్క వనరులు.

చేపలు: సాల్మన్, ట్యూనా, మాకేరెల్ లో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది.

గుడ్లు: విటమిన్ బి12 గుడ్లలో పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చసొనలో అధికంగా ఉంటుంది.

పాలు, పాల ఉత్పత్తులు: పాలు, చీజ్, పెరుగులో విటమిన్ B12 అధికంగా ఉంటుంది.

పోషకాహారం: కొన్ని మొక్కల ఆధారిత పాలు, తృణధాన్యాలు, సోయా పాలల్లో విటమిన్ B12 పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ బి12 సప్లిమెంట్స్: డాక్టర్ సలహా మేరకు విటమిన్ బి12 సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)

Related News

Poha Recipe:10 నిమిషాల్లోనే రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ ఫాస్ట్.. వెంటనే ట్రై చేయండి

Copper Bottle: కాపర్ బాటిల్ వాటర్ తాగారో అంతే సంగతులు, వీళ్లకు మరీ డేంజర్!

Navratri Celebration: ఆఫీసులో దేవీ నవరాత్రులు.. ఇలా జరుపుకుంటే ఎప్పటికీ మరచిపోలేరు

High Protein Food: ఎగ్స్‌కు బదులుగా ఇవి తింటే.. ఫుల్ ప్రోటీన్

Eyesight: ఇలా చేస్తే.. కంటి అద్దాల అవసరమే ఉండదు తెలుసా ?

Fatty Liver Food: ఫ్యాటీ లివర్ సమస్యా ? ఇవి తింటే ప్రాబ్లమ్ సాల్వ్

Masala Tea: ఒక కప్పు మసాలా టీతో.. ఇన్ని ప్రయోజనాలా ?

Cardamom Benefits:రాత్రి భోజనం తర్వాత ఈ ఒక్కటి తింటే చాలు.. వ్యాధులు రమ్మన్నా రావు !

Big Stories

×