Cigarette: కొందరికి ప్రతిరోజూ ధూమపానం చేయాలన్న కోరిక అధికంగా ఉంటుంది. అయితే భోజనం ముగించాక కొంతమంది కచ్చితంగా సిగరెట్ కాల్చేందుకు వెళతారు. ఆహారం తీసుకున్న తర్వాత అది అలవాటుగా మార్చుకుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందో వైద్యనిపుణులను వివరిస్తున్నారు.
భోజనం ముగించిన వెంటనే మీకు సిగరెట్ తాగాలన్న కోరిక వెంటనే పుడితే అది సాధారణమైనది కాదు. ఈ భోజనానంతర కోరిక అనుకోకుండా కలిగినదని అనుకోకండి. మీ మెదడు ఏర్పరచుకున్న ఒక అలవాటు. మీ మెదడు భోజనం తిన్నాక నికోటిన్ కు అలవాటు పడిపోతుంది. భోజనం తిన్న వెంటనే నికోటిన్ చేరకపోతే… సిగరెట్ తాగాలన్న కోరికను అధికంగా పెంచేస్తుంది.
భోజనం తర్వాత ధూమపానం కోరికలు కలగడానికి ముఖ్య కారణం మెదడే. భోజనం చేసినప్పుడు అందులో ఉండే కొవ్వులు, చక్కెరలు అనేవి డోపమైన్ హార్మోన్ ను అధికంగా విడుదల అయ్యేలా చేస్తాయి. ఇది ఆనందాన్ని, సంతృప్తి వంటి భావనలను పెంచుతుంది. డోపమైన్ అనేది మెదడులో కీలకమైన న్యూరో ట్రాన్స్మిటర్. ఈ డోపమైన్ నికోటిన్ వల్ల కూడా ఉత్పత్తి అవుతుంది. సిగరెట్ల నుండి వచ్చే నికోటిన్ మెదడులోని గ్రహకాలతో సంకర్షణ చెందుతుంది. దీనివల్ల మెదడు భోజనం తిన్నాక ధూమపానం చేయడం అనేది ఒక అలవాటుగా మార్చుకుంటుంది. ఇది జీర్ణ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తుంది. నికోటిన్ అనేది మనిషి మెదడును పూర్తిగా తన బానిసలా చేసుకుంటుంది. అందుకే సిగరెట్ కు ఒకసారి అలవాటు పడినవారు అది కాల్చకపోతే ఉండలేరు.
భోజనం చేశాక సిగరెట్ చేయడం అన్నది మంచి అలవాటు మాత్రం కాదు. అది మీకు రొటీన్ గా మారవచ్చు. సిగరెట్ కాల్చకపోతే మీరు ఉండలేకపోవచ్చు, కానీ మీ మెదడును మీరే మళ్ళీ ట్రైన్ చేసుకోవాలి. భోజనం తిన్నాక ధూమపానం చేయడం అనేది మానేయాలి. కొన్నాళ్ళకు మీ మెదడుకు కూడా ఆ అలవాటు వస్తుంది. మనసుతో ఆలోచించి చేయాల్సిన పని ఇది. మెదడు మాట వింటే మీరు కచ్చితంగా ధూమపానం చేస్తారు. అదే మనసు మాట వింటే ధూమపానం మానేసి అవకాశం ఉంది.
Also Read: మీలో ఈ లక్షణాలు ఉంటే అస్సలు లైట్ తీసుకోవద్దు, బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు
భోజనం తిన్నాక సిగరెట్ కాల్చి అలవాటును మానుకోవడానికి కొన్ని చిట్కాలను పాటించండి. ప్రతిరోజూ ఒకే సమయానికి తినడం ఆరోగ్యకరమే, కానీ ధూమపానం అలవాటును మానాలంటే రోజుకో సమయంలో తినేందుకు ప్రయత్నించండి. దీనివల్ల మెదడు కాస్త గందరగోళం ఏర్పడి ధూమపానానికి దూరమవుతుంది. భోజనం చేశాక దూమపానం చేసే బదులు వేగంగా వాకింగ్ చేయండి. అలాగే హెర్బల్ టీ ని తాగేందుకు ప్రయత్నించండి. పాలుతో చేసిన టీ, కాఫీలను మాత్రం తాగకండి. ఈ రెండూ కూడా ఆరోగ్యాన్ని ఎక్కువగానే ప్రభావితం చేస్తాయి.