BigTV English

Peaceful Life: సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితం కావాలా? ఈ ఏడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలి

Peaceful Life: సంతోషకరమైన, ప్రశాంతమైన జీవితం కావాలా? ఈ ఏడు రకాల వ్యక్తులకు దూరంగా ఉండాలి

జీవితం అందరికీ నల్లేరు మీద నడక కాదు. కొందరు సమస్యల సుడిగుండాల్లో చుట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎవరైనా కూడా జీవితం ప్రశాంతంగా సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. అలా మీరు కూడా కోరుకుంటే మీరు కచ్చితంగా చేయాల్సిన పని ఒకటి ఉంది. అదే మీ చుట్టూ ఉన్న వ్యక్తులను మీరే ఎంపిక చేసుకోవాలి. కొన్ని చెడు లక్షణాలు ఉన్న మనుషులకు దూరంగా ఉండాలి. సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవడం ద్వారా మీ సంతోషాన్ని, ప్రశాంతంగా మార్చుకోవచ్చు. లేకుంటే విషపూరితమైన జీవితంలో చిక్కుకుపోతారు.


రౌడీల్లా ప్రవర్తించేవారు
కొందరి ప్రవర్తన చాలా రఫ్ గా ఉంటుంది. భావోద్వేగ పరంగా మాట్లాడే తీరులో కూడా కఠినంగా వ్యవహరిస్తారు. ఎదుటివారిని చాలా చులకనగా చూస్తారు. శక్తిహీనులుగా భావిస్తారు. మీ జీవితంలో ఉన్న వ్యక్తి లేదా మీ స్నేహితుడు, బంధువులు ఎవరైనా కావచ్చు… మీలో చిరునవ్వుకు బదులు కన్నీళ్లు తెప్పిస్తుంటే ఆ అనుబంధాన్ని వదిలేయడమే మంచిది. రౌడీలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు మీ జీవితంలో లేకుండా చూసుకోండి.

ప్రతిసారి విమర్శించడం
విమర్శ మంచిదే కానీ, ప్రతిసారీ విమర్శలు వినబడుతూ ఉంటే మనిషికి తన మీద ఉన్న నమ్మకం సన్నగిల్లిపోతుంది. మీ పక్కనున్న వ్యక్తి ప్రతిసారి మిమ్మల్ని అణిచివేయడానికి మీ లోపాలను ఎత్తు చూపడానికి, మీ గురించి చెడుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే వెంటనే వారిని దూరంగా పెట్టండి. దీనివల్ల మీ జీవితం చాలా వరకు ప్రభావితం అవుతుంది.


నిందలు వేయడం
కొందరు తమ తప్పును తెలుసుకోరు. ఎదుటివారిదే తప్పు అనుకుంటారు. తమది తప్పని తెలిసినా కూడా ఎదుటివారిపై నింద వేసేందుకే ప్రయత్నిస్తారు. వారి తప్పులని గుర్తించలేరు. ఇలాంటి వారు మీ చుట్టూ ఉంటాయి. ఎంతో ప్రమాదం ఆ వ్యక్తులతో మీరు పడలేక అలసిపోతారు. మీ జీవితాన్ని, మీ మెదడును వారు గజిబిజిగా మార్చేస్తారు. ఇలాంటి వారు మీ స్నేహితుల్లో గాని, బంధువుల్లో గాని ఉంచుకోకండి. మీ చుట్టూ ఉండే సర్కిల్ ఎంత ప్రశాంతమైన వ్యక్తులతో నిండి ఉంటుందో… మీ జీవితం కూడా అంతే సంతోషంగా ఉంటుంది.

మీతో ప్రతిసారి ప్రతికూలంగా మాట్లాడడం, నెగెటివిటీని వ్యాప్తి చెందేలా చేయడం కొందరు చేస్తూ ఉంటారు. అలా నెగిటివిటీ మధ్యన జీవించే బదులు అలాంటి వారిని వదిలేయడమే మంచిది. అలాంటి వారు ఉంటే మీ జీవితంలో కూడా మీరు నెగిటివ్ గా మారిపోతారు. అందమైన జీవితం కాస్త నరకంలా అనిపిస్తుంది. కాబట్టి నిత్యం నెగిటివిటీని నింపుకున్న వ్యక్తులు నెగటివ్ గా మాట్లాడే వ్యక్తులను మీ సర్కిల్ నుంచి తీసి పడేయండి.

గాసిప్పులు
మీ స్నేహితులు, బంధువులు ఇతరుల గురించి నిత్యం పుకార్లు మాట్లాడుతూ ఉన్నా, వేరే వారిని తిట్టి పోస్తున్నా… అలాంటి వారిని దగ్గరకు రానివ్వకండి. అది మీ ఆలోచనలను జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ప్రశాంతంగా జీవించాలి అనుకునేవారు పాజిటివిటీని నింపుకొని ఉండాలి. పాజిటివ్ మాటలతోనే సందర్భాన్ని దాటాలి… తప్ప నిత్యం ఇతరుల గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని గడిపితే మీకు తెలియకుండానే మీ మనసు కూడా విషపూరితమైపోతుంది.

మీ ముఖం మీద నవ్వుతూ పలకరించి, మిమ్మల్ని వెనుకనుంచి వెక్కిరించే వారికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి గురించి మీరు ప్రత్యేకంగా తెలుసుకుని… వారిని మీ స్నేహితులు, బంధువుల జాబితాలోంచి తీసేయండి. లేకుంటే మీ జీవితం అత్యంత బరువుగా మారిపోతుంది. ఇలాంటి వారు ఎప్పుడైనా కూడా మీకు ప్రమాదకరంగా మారుతారు.

మానసికంగా, శారీరకంగా తాము చేసే పనులపై నియంత్రణ ఉన్న వ్యక్తులే మీ చుట్టూ ఉండేలా చూసుకోండి. శారీరకంగా నియంత్రణ లేని వారు తరచూ గొడవలకు దిగుతారు. మానసికంగా నియంత్రణ లేనివారు నిందలు వేసేందుకు, వెర్బల్ ఫైట్ కు వస్తారు. ఇలాంటి వారితో జీవించడం వల్ల మీపై కూడా ఇతరులు ద్వేషాన్ని పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవితం అందంగా ఉండాలి అనుకుంటే పైన చెప్పిన లక్షణాలున్న వ్యక్తులకు దూరంగా ఉండండి.

Also Read: భార్యాభర్తల అనుబంధాన్ని దెబ్బతీసే ‘రాత్రి అలవాట్లు’ – వీటిని మానుకోండి, లేకపోతే..

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×