భార్యా భర్తల అనుబంధం ఎంత బలంగా ఉంటే వారి వారి వివాహ జీవితం అన్నేళ్లు కొనసాగుతుందని చెప్పుకుంటారు. వీరిద్దరి మధ్య ఎప్పుడైతే అభిప్రాయ బేధాలు, అనుమానాలు వస్తాయో ఒక కుటుంబమే నాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి తమ జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టకుండా వారికి నచ్చేలా జీవించేందుకు ప్రయత్నించాలి. మీరు చేసే చిన్న చిన్న పనులు కూడా మీ వైవాహిక జీవితాన్ని నాశనం చేయవచ్చు. ముఖ్యంగా నిద్ర వేళలో కొన్ని రకాల అలవాట్లు భార్యాభర్తల మధ్య బంధాన్ని విచ్చిన్నం చేస్తున్నట్టు వారి మధ్య దూరాన్ని పెంచేస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
రాత్రి సమయంలో భార్యాభర్తలిద్దరూ ప్రేమగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు లైంగిక ప్రక్రియ చేయకపోయినా కాసేపు ప్రేమగా మాట్లాడి మానసిక సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలి. మానసిక సాన్నిహిత్యమే భార్యాభర్తలకు బంధానికి పెద్ద బలం అని చెప్పుకోవాలి. నిద్రకు ముందు భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు సంతోషంగా మాట్లాడుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం వంటివి చేయాల్సిన అవసరం ఉంది. కౌగిలించుకొని నిద్ర పోవడం వంటివి వారిలో ప్రేమ హార్మోన్ విడుదల కావడానికి సహాయపడుతుంది. ఎవరు మటుకు వాళ్ళు నిద్రపోవడం వల్ల వారి మధ్య దూరం పెరిగిపోతుంది.
షిఫ్ట్ ఉద్యోగాలతో
ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు ఒకరు మార్నింగ్ షిఫ్ట్ వెళితే మరొకరు నైట్ షిఫ్ట్ వంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటివి వారిద్దరి మధ్య బంధాన్ని నిర్వీర్యం చేస్తాయి. వీలైనంత వరకు ఇద్దరూ రాత్రి పూట కలిసి నిద్రించేందుకే ప్రయత్నించాలి. చెరో షిఫ్ట్ పని చేయడం మానేయాలి.
వేరువేరుగా నిద్రపోవద్దు
కొంతమంది భార్యాభర్తలు కేవలం లైంగిక కార్యక్రమం కోసమే ఒకచోట నిద్రిస్తారు. మిగతా వేళల్లో వేరువేరు ప్రదేశాల్లో నిద్రపోతూ ఉంటారు. ఇది వారి శారీరక సాన్నిహిత్యానికి, సన్నిహిత సంభాషణకు, మానసిక సాన్నిహిత్యానికి పెద్ద అడ్డుగోడలా నిలుస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా దంపతులు ఒకే దగ్గర నిద్రపోయేందుకు ప్రయత్నించండి. తమ పిల్లలతో పాటు నిద్రపోతే ఇంకా ఆరోగ్యకరమైన రొటీన్ అని చెప్పుకోవాలి. అలా కాకుండా భార్యాభర్తలిద్దరూ చెరోచోట నిద్రపోతే వారికి తెలియకుండానే వారి మధ్య మానసిక సాన్నిహిత్యం తగ్గుతూ వస్తుంది.
రాత్రిపూట కౌగిలించుకొని గుడ్ నైట్ చెప్పుకోవడం వంటివి అలవాటు చేసుకోండి. ఒకే దగ్గర నిద్రించినప్పుడు ప్రేమతో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం వంటివి వారి బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి. అలా కాకుండా ఒకరినొకరు పట్టించుకోనట్టు నిద్రపోతే అది వారి బంధాన్ని నిర్వీర్యం చేస్తుంది.
నిద్రపోయే ముందు వ్యక్తిగత పరిశుభ్రత కూడా చాలా అవసరం. జీవిత భాగస్వామికి త్వరగా కోపం, చిరాకు, అసహ్యం రాకుండా ఉండాలంటే పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించండి. నిద్ర వేళకు ముందు చిన్నపాటి గొడవలు జరిగితే ఆ కలత, ఆ కోపం విసుగుతో నిద్రపోవడానికి ప్రయత్నించకండి. ఇది మీ ఇద్దరి నిద్రను ప్రభావితం చేస్తుంది. కాసేపు తర్వాత నార్మల్ అయ్యాకే నిద్రపోండి. పడుకునే ముందు కమ్యూనిటీ చేసుకోవడం చాలా అవసరం. ఇది భావోద్వేగాలపరంగా భార్యాభర్తలను దగ్గర చేస్తుంది. అర్థవంతమైన సంభాషణలు చేసేందుకు ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మీ జీవిత భాగస్వామికి మీపై ప్రేమను పెంచేవే.