IndiGo Offer: విమానంలో ప్రయాణించాలని భావిస్తున్నారా? బిజీ సీజన్ కాస్త తగ్గింది. దీంతో అదిరిపోయేలా ఆఫర్లు పెడుతున్నాయి ఎయిర్‌లైన్స్ కంపెనీలు. మొన్నటికి మొన్న ఎయిరిండియా వంతు కాగా, ఇప్పుడు ఇండిగో వంతైంది. ఈ ఆఫర్ కూడా కేవలం రెండురోజులు మాత్రమే.
వేసవి సీజన్ ముగియడంతో ప్రయాణికులకు బంపరాఫర్లు ఇస్తున్నాయి విమాన కంపెనీలు. ఎయిర్‌లైన్స్‌లో ఒకటైన ఇండిగో అదిరిపోయే ఆఫర్‌తో ప్రయాణికుల ముందుకొచ్చింది. ‘ఇండిగో గెట్ అవే సేల్’ పేరిట స్పెషల్ డిస్కౌంట్లను ప్రకటించింది. దేశీయంగా ట్రావెల్ చేయాలని భావించేవారు కేవలం రూ. 1199 లకే విమాన టికెట్లు లభించనుంది.
ఒక మాటలో చెప్పాలంటే బస్సు ధరకు మాదిరిగా విమానంలో ప్రయాణం చేయవచ్చున్నమాట. జూన్ నాలుగు (బుధవారం) నుంచి ఆరు వరకు మాత్రమే. కేవలం రెండు రోజులు మాత్రమే. ఈ ఆఫర్‌లో టికెట్ బుక్ చేసుకున్నవారికి సెప్టెంబర్ 24 వరకు ఎప్పుడైనా విమానంలో ప్రయాణం చేయవచ్చు. మరి డీల్, బుకింగ్ డీటెయిల్స్ లపై ఓ లుక్కేద్దాం.
ఇండిగో గెట్ అవే సేల్ విషయానికొద్దాం. దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా స్పెషల్ వన్ వే ఫేర్స్ ఆఫర్ ప్రకటించింది. దీనితోపాటు ఎక్స్‌ట్రా లగేజ్, మీల్స్, సీట్లపై భారీ డిస్కౌంట్స్ ఇచ్చింది. దేశీయ విమానం టికెట్ల్ ధరలు కేవలం రూ. 1199 నుంచి మొదలుకానున్నాయి.
ALSO READ: తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేయాలా? ఈ టిప్స్ పాటిస్తే చాలు
అందులో ముంబై-విజయవాడ, కడప-హైదరాబాద్, గోండియా-హైదరాబాద్, సేలం-హైదరాబాద్, కడప-విజయవాడ రూట్లతోపాటు మరి కొన్ని రూట్లు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ టికెట్ల విషయానికి వద్దాం. దానికి ధర రూ. 4599 నుంచి మొదలుకానుంది. దీనికి జూన్ 4 నుంచి జూన్ 6 రాత్రి 11. 59 వరకు మాత్రమే.
ప్రయాణికులు జూన్ 12 నుంచి సెప్టెంబర్ 24 వరకు ట్రావెల్ చేసేందుకు ఎంపిక చేసుకోవచ్చు. నాన్ స్టాప్, మల్టీ సిటీ, కనెక్టింగ్ ఫ్లైట్లకు ఈ ఆఫర్లు వర్తించనున్నాయి. ఇండిగో విమాన టికెట్లతోపాటు యాడ్ ఆన్స్‌పై మాంచి డీల్స్ ఇచ్చింది. దేశీయంగా తిరిగే విమానాల్లో ప్రీ బుక్డ్ లగేజీపై 50 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది.
ప్రీ-బుక్డ్ మీల్స్‌పై కూడా 50 శాతం డిస్కౌంట్. ఎమర్జెన్సీ ఎక్సెల్ సీట్స్ రూ. 500 నుంచి మొదలుకానున్నాయి. రూ. 299 ప్లాన్‌తో ఎలాంటి క్యాన్సలేషన్ ఛార్జీలు ఉండవని చెబుతోంది. ఇండిగో ఆపరేట్ చేసే నాన్ స్టాప్, మల్టీ సిటీ, కనెక్టింగ్ విమానాలకు ఈ ఆఫర్స్ వర్తించనున్నాయి. మరిన్ని వివరాలకు ఆ కంపెనీ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.