ప్రతి అమ్మాయి ఉత్తమమైన భర్త కావాలని కోరుకుంటుంది. అలాగే కొంతమంది నచ్చిన అబ్బాయిలతో కొన్ని నెలలపాటు జర్నీ చేసి వారిని అర్థం చేసుకొని పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడతారు. అలాంటివారు ఆ అబ్బాయిలో చూడాల్సిన లక్షణాలు కొన్ని ఉన్నాయి. అవి ఉంటేనే వారిని పెళ్లి చేసుకోవడం మంచిది.
అమ్మాయిలు మంచి జీవిత భాగస్వామి కోసం కలల కంటారు. అమ్మాయిలకు భద్రత, రక్షణ, ప్రేమ, శ్రద్ధ అనేవి చాలా ముఖ్యం. అవి చూపించే అబ్బాయిలని వారు వివాహమాడాలని అనుకుంటారు. కొంతమంది పెద్దలు చూపించిన అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటారు. అలాంటి వారి విషయంలో ముందుగానే అంచనాకు రావడం కష్టం. కానీ కొంతమంది ప్రేమించి కొన్ని రోజులు పాటు డేటింగ్ చేసి ఒకరికి ఒకరు నచ్చితేనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు.
అలాంటి అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్ లో కొన్ని లక్షణాలు కనిపిస్తేనే వారితో పెళ్లికి సిద్ధం అవ్వాలి. ఈ లక్షణాలు ఉన్న అబ్బాయిలే ఉత్తమ జీవిత భాగస్వామి కాగలరు. మీ బాయ్ ఫ్రెండ్ భర్త స్థానానికి తగినవాడా? కాదా? అని మీరే పరీక్షించుకోవాలి. వివాహానికి సిద్ధమయ్యే ముందు మీరు వారిలో చూడాల్సిన లక్షణాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి.
అబద్ధం చెప్పనివాడు
ప్రపంచంలో ఉన్న ఏ బంధమైనా కూడా సున్నితమైన ఫీలింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ అనుబంధం అబద్ధాలు చెబితే బీటలు వారుతుంది. కాబట్టి మీ ప్రియుడు మీ బంధంలో ఉంటే అతను మీతో పారదర్శకంగా ఉన్నాడో లేదో చూడండి. చిన్న చిన్న విషయాలకు అబద్దాలు చెప్పే వ్యక్తిని, నిజాలను దాచిపెట్టే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వృధా. అతడు పరిపూర్ణ భర్త కాలేడు.
మీ భావోద్వేగాలకు గౌరవం
మీ బాయ్ ఫ్రెండ్ తనకన్నా మీ భావోద్వేగాల విషయంలోనే ఎక్కువగా శ్రద్ధ చూపించాలి. మీరు అతనితో జీవితాన్ని గడపాలనుకుంటే అతడు మీ భావోద్వేగాలకు ఎంత విలువ ఇస్తున్నాడో గమనించండి. మీ భావాలు దెబ్బ తినకుండా అతడు ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటే… అతడిని మీరు హ్యాపీగా వివాహం చేసుకోవచ్చు. అలా కాకుండా తన మర్యాద, తన గౌరవం, తన ఏడుపు, తన ప్రేమ గురించే మాట్లాడేవాడు. ఎప్పటికీ మంచి జీవిత భాగస్వామి కాలేడు.
మాట్లాడే తీరు
మాట్లాడే తీరు అంటే ప్రాథమికంగా మనం మన భావాలను, ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం. దీని అర్థం మనం ఏదైనా విషయంలో బాధపడుతున్నా లేదా కోపంగా ఉన్నా, దాన్ని దాచుకోకుండా మన భాగస్వామితో పంచుకోవడం. మన భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం. వాళ్ళు ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. మధ్యలో అంతరాయం కలిగించకుండా వాళ్ళ మాటను పూర్తిగా వినడం. ఒకరినొకరు నిందించకుండా, తప్పులు వెతకకుండా, విషయాన్ని స్పష్టంగా చెప్పడం. సమస్యను పరిష్కరించడానికి కలిసి కృషి చేయడం. ఒకరిపై ఒకరు తప్పులు వేయకుండా, సమస్యను ఎలా పరిష్కరించవచ్చో కలిసి ఆలోచించడం వంటి లక్షణాలు ఓపెన్ కమ్యూనికేషన్.
మీ రెస్పెక్ట్
భర్త అనే వాడు ఎప్పుడూ భార్య గౌరవాన్ని కాపాడే విధంగా ఉండాలి. ఆమె గురించి ఎక్కడా చెడుగా మాట్లాడకూడదు. మీ బాయ్ ఫ్రెండ్ మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడితే అది ఎప్పటికీ మంచి భర్త కాలేడు. అతడు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం, పదేపదే నిందించడం, మీ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం వంటివి చేస్తే అతడితో సుదీర్ఘ సంబంధానికి వెళ్లడం మంచి పద్ధతి కాదు.
మీకు సపోర్టుగా
మీ బాయ్ ఫ్రెండ్ మీ ఉద్యోగానికి మీ కష్టాలకు, మీ సుఖాలకు అన్నిటిగా మద్దతుగా నిలిచేవాడై ఉండాలి. అలాంటి మద్దతు వ్యవస్థ భార్యకు ఎంతో అవసరం. ప్రతీ నిర్ణయంలో అతను మీకు మద్దతుగా నిలిస్తే అలాంటి వ్యక్తిని జీవితాంతం మీ పక్కనే ఉంచుకోవాలి. అంటే అతడిని మీరు పెళ్లి చేసుకోవచ్చు. అలా కాకుండా మీ నిర్ణయాలను వ్యతిరేకించడం, పదే పదే విమర్శించడం వంటివి చేస్తూ ఉంటే అతడితో మీరు ఎక్కువ కాలం జీవించలేరని అర్థం చేసుకోండి. అలాంటి బాయ్ ఫ్రెండ్ ను వదిలేయడమే ఉత్తమం.
Also Read: భార్య భర్తకు ఏ వైపున నిద్రపోవాలి? ఇలా నిద్రపోతే వారి మధ్య ప్రేమ పెరుగుతుంది