Ranveer Allahbadia: సోషల్ మీడియాలో ఈ మధ్య ఏం అన్నా వైరల్ అవుతున్నాం అని.. ఏ మాట పడితే ఆ మాట అనేస్తున్నారు. ముఖ్యంగా ఈ పాడ్ క్యాస్ట్ వచ్చాకా.. మరొకరిని ట్రోల్ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది. మొన్నటికి మొన్న ఒక తండ్రీకూతురుపై యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు.. చాలా అసభ్యకరంగా మాట్లాడిన విషయం తెల్సిందే. అది ఎంత పెద్ద రచ్చ అయ్యిందో కూడా తెల్సిందే. ప్రణీత్ హన్మంతుపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు నేషనల్ లెవెల్లో వైరల్ అయ్యింది. అంత వైరల్ అయినా కూడా మిగతావారిలో భయం లేకుండా పోయింది.
ప్రణీత్ వివాదం ఇంకా పూర్తిగా మరిచిపోకముందే మరో యూట్యూబర్.. దానికి మించిన వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నాడు. ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియకపోయినా.. యూట్యూబ్ బాగా చూసేవారికి బాగా పరిచయం. స్టాండప్ కామెడీ పేరుతో అడల్ట్ జోక్స్ వేయడం.. పవిత్రమైన బంధాలను చాలా నీచంగా చూపించడం.. దానిద్వారా డబ్బులు సంపాదించడం రణవీర్ పని.
ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా బీర్ బైసెప్స్ అనే యూట్యూబ్ ఛానెల్ కు ఓనర్. అంతేకాకుండా అతను మాంక్ ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు కూడా. నెలకు కోట్లలో సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న రణవీర్.. తాజాగా ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో ఇరుక్కున్నాడు.
ఒక కంటెస్టెంట్ ను ..” నువ్వు తల్లిదండ్రులు శృంగారం చేస్తుంటే జీవితాంతం చూస్తావా.. ? లేక వాళ్ళతో కలిసి ఒకసారి చేసి.. దాన్ని ఆపేస్తావా.. ?” అని రణవీర్ అడిగాడు. ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. తల్లిదండ్రులపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి అని నెటిజన్స్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఛీఛీ ఇదేనా నీ తల్లిదండ్రులు నీకు నేర్పించింది అని ఫైర్ అవుతున్నారు. ఈ వ్యాఖ్యలపై కొంతమంది అతనిపై కేసు నమోదు చేశారు. చివరకు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సీరియస్ అయ్యారు. “మన సమాజంలో, మేము కొన్ని నియమాలు చేసాము. ఎవరైనా వాటిని ఉల్లంఘిస్తే అది ఖచ్చితంగా తప్పు. వారిపై చర్యలు తీసుకోవాలి” అంటూ చెప్పుకొచ్చారు.
Kanye West: మాజీ భార్యపై రివెంజ్.. రెండో భార్యను నగ్నంగా మార్చి.. రూ. 175 కోట్లు నష్టం
ఇక దీంతో రణవీర్ అందరికీ క్షమాపణలు చెప్పుకొచ్చాడు. ” నా కామెంట్స్ అనుచితమైనవి. అవి ఫన్నీలా అనిపించడం లేదు. కామెడీ నా బలం కాదు.అక్కడేం జరిగింది.. ఆ సమయంలో నేను ఆ ఎందుకు అలా అన్నాను.. ఇవేమి నేను చెప్పను. ఒకటే చెప్తున్నాను.. నేను క్షమాపణలు కోరుతున్నాను. నా పాడ్ క్యాస్ట్ అన్ని వయస్సుల వారు చూస్తారు. ఇంకెప్పుడు ఫ్యామీల గురించి ఇలా గౌరవం లేకుండా మాట్లాడను. నేను ఆ వీడియోను రిమూవ్ చేశాను. మనిషి తప్పుచేస్తాడు అని నమ్మి నన్ను క్షమించండి. ఇంకెప్పుడు ఇలా జరగదు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
రణవీర్ క్షమాపణను అనుమతించేది లేదని, అలా క్షమించమనడం, మళ్లీ ఇలానే మాట్లాడడం.. రణవీర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదం ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.