Ajwain Seeds: వాము దాదాపు ప్రతి ఒక్కరి వంట గదిలో ఉంటుంది. తరచుగా వంటకాల్లో మనం ఉపయోగిస్తుంటాం. వాము ఆహార రుచిని పెంచే ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. ఫలితంగా శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
ఆయుర్వేదంలో వాము కూడా ఒక ముఖ్యమైన ఔషధంగా చెబుతారు. చూడటానికి చాలా చిన్నగా ఉండే వాములో అనేక అద్భుత లక్షణాలు దాగి ఉన్నాయి. ప్రతిరోజూ ఒక చిటికెడు వాము తినడం ద్వారా మీరు అనేక వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు. మరి వాము తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు తగ్గుతాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు వాము తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వాము కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.
వాము తినడం వల్ల కలిగే 6 అద్భుత ప్రయోజనాలు:
జీర్ణవ్యవస్థకు దివ్యౌషధం:
వాము గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా వాములో ఉండే థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. అంతే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
జలుబు ,దగ్గు నుండి ఉపశమనం:
వాములో యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి జలుబు , దగ్గు నుండి ఉపశమనం అందించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వాముతో తయారు చేసిన కషాయం తాగడం లేదా నీటిలో మరిగించి ఆవిరి పీల్చడం వల్ల కూడా ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి వంటి వాటి నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. జలుబు, దగ్గు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు వాము తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. ఈ సమస్యల నుండి ఈజీగా బయటపడటానికి వాము ఉపయోగపడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది:
వాము జీవక్రియను పెంచుతుంది. అంతే కాకుండా బరువును తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వాము నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. అంతే కాకుండా బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా తగ్గించడంలో కూడా వాము ఉపయోగపడుతుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది:
వాములో యాంటీ హైపర్‌టెన్సివ్ లక్షణాలు ఉన్నాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. రోజూ చిటికెడు వాము తినడం వల్ల అధిక రక్తపోటు సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. అంతే కాకుండా బీపీ సమస్యతో ఇబ్బంది పడే వారు వాము తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి.
కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం:
వాములో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వాము నూనెతో మసాజ్ చేయడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వారు వామును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
Also Read: ఇలా చేస్తే.. బట్టతల జన్మలో రాదు
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
వాములో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా వాము ప్రతి రోజూ తినడం వల్ల శరీరం వ్యాధులతో పోరాడటానికి బలంగా మారుతుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారు వాము తినడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.