The Raja Saab Teaser: ఈ ఏడాది అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాలలో ప్రభాస్ (Prabhas ) ది రాజా సాబ్ (The Raja Saab)చిత్రం కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న తొలి హార్రర్ మూవీ కావడంతో అందరి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. హార్రర్, కామెడీ బ్యాక్ డ్రాప్ లో మారుతి (Maruthi) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal), రిద్ధి కుమార్(Riddhi Kumar), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈరోజు అనగా జూన్ 16 ఉదయం 10:52 గంటలకు ఈ సినిమా టీజర్ విడుదల కానున్నట్లు నిన్న మేకర్స్ పోస్టర్ తో సహా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని గంటలుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని అభిమానులు పెద్ద తెరపై ఈ సినిమా టీజర్ ను చూడడానికి తెగ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంపిక చేసిన థియేటర్లలో ఈ టీజర్ విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే తెలంగాణలో PCX ప్రసాద్ థియేటర్ లో ఈ సినిమా టీజర్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
ది రాజా సాబ్ టీజర్ రిలీజ్..
ఇకపోతే అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఎంతగానో ఎదురు చూస్తున్న టీజర్ రిలీజ్ అయింది. ఇక అనుకున్నట్లుగానే వింటేజ్ లుక్ లో ప్రభాస్ అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ముఖ్యంగా ఆయనలోని కామెడీ యాంగిల్ ను మారుతి చాలా చక్కగా తెరపై చూపించినట్లు స్పష్టం అవుతుంది. ప్రభాస్ లుక్, మేనరిజం, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ టీజర్ చూసిన తర్వాత పాత ప్రభాస్ ని చూసినట్లు ఉందని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
ది రాజా సాబ్ టీజర్ ఎలా ఉందంటే?
ప్రముఖ బాలీవుడ్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) ఇందులో ప్రభాస్ తాత పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక టీజర్ ఎలా ఉంది అనే విషయానికొస్తే. టీజర్ ప్రారంభం అవ్వగానే.. దట్టమైన అడవి మధ్యలో ఒక పాడుబడిన బంగ్లాని చూపిస్తారు. “ఈ ఇల్లు నా దేహం.. ఈ సంపద నా ప్రాణం.. నా తథనంతరం ఈ నిధిని నేను మాత్రమే అనుభవిస్తాను”. అంటూ ప్రభాస్ తాత గెటప్ లో సంజయ్ దత్ చెప్పే డైలాగ్ తో టీజర్ ఆరంభించారు. తర్వాత భయంకరమైన హార్రర్ సన్నివేశాలను చూపించారు. కట్ చేస్తే ప్రభాస్ లుక్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఒక లుంగీ కట్టి ఆయన ఎగురుతున్న తీరు అమ్మాయిల హృదయాలను ఒక్కసారిగా ఆకట్టుకుంది. ఎప్పటిలాగే ప్రభాస్ వింటేజ్ లుక్ లో తన యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే.. నిధి అగర్వాల్ ఏంజెల్ గా కనిపించి అబ్బాయిల హృదయాలను దోచుకుంది. ఇకపోతే ఈ సినిమాలో నిధి అగర్వాల్ నన్ గెటప్ లో కనిపించింది కానీ ఇక్కడ ప్రభాస్ లవ్ చేసిన అమ్మాయి కూడా నిధి అగర్వాల్ కావడం గమనార్హం. ఇక మాళవిక మోహనన్ – ప్రభాస్ బెడ్ టైమ్ సీన్స్ టీజర్ కి హైలెట్గా నిలిచాయి. ప్రభాస్ అమాయకత్వపు చూపులు.. హీరోయిన్స్ కూడా ఎవరికి వారు ఏమాత్రం తగ్గకుండా తమ పర్ఫామెన్స్ తో అదరగొట్టేశారు. సప్తగిరి తో పాటు వీటివీ గణేష్ ఇలా ఎవరికి వారు తమ పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారని చెప్పవచ్చు. ఇక టీజర్ తోనే గూస్ బంప్స్ తెప్పించిన మారుతి థియేటర్లలో విడుదలయ్యే సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
MARUTHI MASS#TheRajaSaab #TheRajaSaabTeaser pic.twitter.com/pC03Ihn3Ak
— 𝑺𝒖𝒋𝒊𝒕𝒉 𝒔𝒂𝒉𝒐𝒐 (@sujithsahoo) June 16, 2025