జుట్టు రాలడం అనేది పురుషులు, మహిళలు ఇద్దరికీ సంబంధించిన సమస్యగా మారిపోయింది. దీనికి జన్యువులు, హార్మోన్ల సమతుల్త్యత, పోషక లోపాలు, ఒత్తిడి వంటివి ఎన్నో కారణాలు ఉన్నాయి. జుట్టు రాలడాన్ని ఎదుర్కోవాలంటే ప్రస్తుతం ఎంతో కష్టంగానే ఉంది. పురాతన భారతీయ వైద్య విదానమైన ఆయుర్వేదం కొన్ని చిట్కాలను అందిస్తోంది. దాని ద్వారా జుట్టు రాలడాన్ని మీరు కొంతవరకు అడ్డుకోవచ్చు.
ఉసిరికాయతో
జుట్టు రాలడాన్ని నివారించడానికి ఉసిరికాయ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అత్యంత శక్తివంతమైన ఆయుర్వేద మూలికలలో ఉసిరికాయ కూడా ఒకటి. దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. రక్త ప్రసరణను పెంచుతాయి. పిత్త దోషాన్ని కూడా సంతల్యం చేస్తాయి. జుట్టు పల్చబడడం, జుట్టు తెల్లగా మారడం వంటివి వాటిని అడ్డుకుంటాయి. ఉసిరికాయ నూనెను తీసుకొని తలపై అప్పుడప్పుడు మసాజ్ చేస్తూ ఉండండి. ఆ నూనె వేడి చేసి చేతుల్లో కొంత పోసుకొని తలకి పట్టించి మసాజ్ చేయాలి. ఇలా పావుగంట సేపు చేయడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. రాత్రంతా అలా నిద్రపోవాలి. ఉదయం తేలికపాటి షాంపుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా పెరిగే అవకాశం ఉంది.
బృంగరాజ్
ఆయుర్వేద మూలికల్లో బృంగరాజ్ ముఖ్యమైనది. ఇది జుట్టు రాలడాన్ని నివారించడమే కాదు. జుట్టు పెరుగుదలకు కావలసిన పరిస్థితులను కూడా ఏర్పరుస్తుంది. ఆయుర్వేద వైద్యంలో బృంగరాజ్ మూలికను అధికంగా వినియోగిస్తారు. మూలికలలో రారాజుగా దీన్ని పిలుస్తారు. నెత్తికి పోషణను ఇవ్వడం, జుట్టు మూలాలను బలపరచడం వంటివి బృంగ్ రాజ్ చేస్తుంది. జుట్టు పలుచగా ఉన్న ప్రాంతాలలో బృంగరాజ్ నూనెతో మసాజ్ చేయండి. కనీసం గంట పాటు అలా వదిలేయండి. లేదా రాత్రంతా వదిలేయండి. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు బలంగా ఎదిగే అవకాశం ఉంది.
మెంతులు
ప్రతి ఇంట్లోనూ మెంతులు ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి అవసరమైన ప్రోటీన్లు, ఇనుము వంటివి వీటిలో అధికంగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు కుదుళ్లను పోషిస్తాయి. తలకు రక్తప్రసరణను ప్రోత్సహిస్తాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు మెంతులను ఎలా వాడాలో తెలుసుకోండి. గుప్పెడు మెంతులు తీసుకొని రాత్రంతా నానబెట్టండి. మెత్తగా పేస్టు చేయండి. ఆ పేస్టును తలకు పట్టించండి. అరగంట పాటు అలా వదిలేసి తర్వాత తలకు స్నానం చేయండి. ఇలా తరచూ చేస్తే మీకు ఎంతో వేగంగా జుట్టు పెరుగుతుంది.
కలబంద
కలబంద కూడా జుట్టుకు మేలు చేసే ఆయుర్వేద మూలిక. శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. చర్మ సమస్యలకు జుట్టు సమస్యలకు చికిత్స చేయడానికి కలబంద అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిలో నెత్తి మీద ఉన్న మృత చర్మ కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడతాయి. అలాగే జుట్టు కుదుళ్ళను బలంగా మారుస్తాయి. తాజా కలబంద జెల్ ను తీసుకొని మీ తలకు అప్లై చేయండి. సున్నితంగా మసాజ్ చేయండి. అరగంట పాటు అలా వదిలేసి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి.
Also Read: పూజ చేసేటప్పుడు శంఖం ఎందుకు ఊదుతారు ?
శతావరి
ఆయుర్వేద మూలికలలో శతావరి. ఇది హార్మోన్ల సమతుల్యాన్ని కాపాడుతుంది. హార్మోన్లలో హెచ్చుతగ్గులు కారణంగా కూడా జుట్టు రాలే అవకాశం ఉంటుంది. కాబట్టి శతావరిని తీసుకోవడం వల్ల మీలోని కఫ, వాత దోషాలు సమతుల్యం అవుతాయి. అప్పుడు జుట్టు పెరిగే అవకాశం ఉంటుంది. శతావరి పొడిని గౌరవించండి. నీరు లేదా పాలలో వేసి తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత ఏర్పడుతుంది. జుట్టు పెరుగుదల మొదలవుతుంది.