Hair fall With Drinks: వేసవి కాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చల్ల చల్లటి కూల్ డ్రింక్స్ తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎనర్జీ డ్రింక్స్, జ్యూస్‌లు, నిమ్మరసం, లస్సీ వంటి చల్లటి, తియ్యటి డ్రింక్స్ తాగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఇవే మీకు బట్టతల వచ్చేందుకు కారణం అవుతాయని తెలుసా ? అవును ఇటీవల నిర్వహించిన ఒ పరిశోధన ప్రకారం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల బట్టతల వస్తుందని రుజువైంది.
పురుషులలో ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత జుట్టు రాలడం లేదా బట్టతల రావడం చాలా సాధారణ సమస్య. ప్రపంచవ్యాప్తంగా.. 50 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషుల్లో 30% నుండి 50% మంది వారు జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొన్నిసార్లు ఇది నిరాశకు కూడా కారణమవుతుంది.
కూల్ డ్రింక్స్, జుట్టుకు మధ్య ఉన్న సంబంధం ఇదే !
న్యూట్రియంట్స్‌లో ప్రచురితమైన ఒక చైనీస్ అధ్యయనంలో కూల్ డ్రింక్స్ , పురుషులలో జుట్టు రాలడానికి మధ్య బలమైన సంబంధం ఉందని కనుగొన్నారు. బీజింగ్‌లోని సింఘువా విశ్వవిద్యాలయ పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. అధిక మొత్తంలో చక్కెర కలిగిన డ్రింక్స్ తాగడం వల్ల పురుషులలో జుట్టు రాలే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా యువకులలో ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. జుట్టు ఆరోగ్యంలో పోషకాలు, ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని పరిశోధకులు అంటున్నారు.
వేలాది మంది యువకులు:
ఈ అధ్యయనంలో.. పరిశోధకులు 18 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వెయ్యి మందికి పైగా యువకులను చేర్చారు. కూల్ డ్రింక్స్ తీసుకునే యువకులలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. పరిశోధనలో పాల్గొన్న యువకుల్లో 57.6% మంది జుట్టు రాలే సమస్యతో బాధపడ్డారు. వీరందరూ ప్రతి వారం దాదాపు 4.3 లీటర్ల కూల్ డ్రింక్స్ తీసుకున్నారు. జుట్టు రాలడం సమస్య లేని పురుషులు వారానికి 2.5 లీటర్ల కూల్ డ్రింక్స్ ఇచ్చారు. దీనితో పాటు.. జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు ఎక్కువగా వేయించిన ఆహారాన్ని కూడా అందించారు.
జుట్టు బలహీనంగా మారుతుంది:
అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని పరిశోధనలో రుజువైంది. దీని కారణంగా పాలియోల్ క్రియాశీలమవుతుంది. ఇది గ్లూకోజ్‌ను ఇతర చక్కెరలుగా మారుస్తుంది. ఈ ప్రక్రియ కారణంగా.. వెంట్రుకల కుదుళ్లు బయటి భాగాలలో గ్లూకోజ్ పరిమాణం తగ్గుతుంది. ఫలితంగా వెంట్రుకలు రాలడం ప్రారంభమవుతుంది. తరచుగా.. లిపిడ్ తీసుకోవడంతో పాటు చక్కెరలు తీసుకోవడం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది వెంట్రుకలను బలహీన పరుస్తుంది. అయితే.. కొన్నిసార్లు అధికంగా జుట్టు రాలడం అనేది జన్యుశాస్త్రం, హార్మోన్ల మార్పులు , జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల కూడా జరుగుతుంది.
Also Read: ఆరోగ్యానికి మంచివని బాదం ఎక్కువగా తింటున్నారా ? పొరపాటున కూడా అలా చేయొద్దు !
మానసిక ఆరోగ్యానికి హానికరం:
ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన అనేక ఇతర అధ్యయనాలతో పాటు ఈ అధ్యయనం.. అధికంగా చక్కెర ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం అవుతుంది. రోజుకు మూడు డబ్బాల కోకో కోలా తాగేవారికి ఇతరులతో పోలిస్తే 25% ఎక్కువ డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉంది. జుట్టు రాలడానికి డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి కూడా ప్రధాన కారణాలు. ఇలాంటి సమయంలో మీరు అధిక చక్కెర కంటెంట్ ఉన్న డ్రింక్స్ తీసుకోవడం వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది.