జుట్టు రాలడం అనేది ఆధునిక ప్రపంచంలో అధికమైపోయింది. పెరుగుతున్న ఒత్తిడి, శ్రమ కారణంగా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. జుట్టు సమస్యలతో బాధపడుతున్న వారు అనేక రెమెడీస్ కోసం వెతుకుతూ ఉంటారు. ఏది పడితే అది తలపై పూస్తూ ఉంటారు. అయితే ప్రకృతి వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం ఒక ఇంటి చిట్కా ద్వారా జుట్టును త్వరగా పెంచుకోవచ్చు. సాధారణం కంటే నాలుగు రెట్లు వేగంగా పెరిగేలా చేసుకోవచ్చు. దీన్ని ఇంటి దగ్గర చాలా సులువుగా ఫాలో అవ్వచ్చు.
బియ్యం నీరు తయారీ
బియ్యం నీరు ద్వారా జుట్టు బాగా పెరుగుతుందని అందరికీ తెలిసింది. అయితే జుట్టును పెంచడానికి బియ్యం నీటిని ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి. అందుకోసం ఏం చేయాలంటే…100 గ్రాముల బియ్యాన్ని అర లీటర్ నీటిలో నానబెట్టాలి. దాదాపు 3 గంటల పాటు అలా నీటిలో నాననివ్వాలి. ఆ తరువాత ఆ నీటిని స్టవ్ మీద పెట్టి పావు గంట సేపు చిన్న మంట మీద ఉడికించాలి. బియ్యంలోని పోషకాలన్ని ఆ నీటిలోకి చేరుతాయి. ఆ తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి.
వీటిని కలపండి
మిగిలిన బియ్యం నీటిని ఒక గిన్నెలో వేసి గ్లిజరిన్, వేప రసం వేసి బాగా కలపాలి. దీన్ని ఒక స్ప్రే బాటిల్ లో వేయాలి. దీన్ని నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజూ రాత్రి నిద్ర పోయే ముందు దీన్ని జుట్టుపై అప్లై చేసుకోవాలి. జుట్టు కుదుళ్లకు వరకు వెళ్లేలా ఈ స్ప్రే ను జుట్టుపై చల్లాలి. ఆ తర్వాత ఒకసారి చేతితోనే మర్దనా చేసుకుని ముడి వేసుకొని నిద్రపోవాలి.
రోజు ఉదయం లేచాక తేలికపాటి షాంపూ తో జుట్టును శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు రాత్రి ఇలా బియ్యం నీటి స్ప్రేను జుట్టుకు అప్లై చేయడం వల్ల ఎంతో ఉపయోగాలు ఉంటాయి. అయితే ప్రతిరోజు ఈ స్ప్రేను జుట్టుపై చల్లుకున్నాక మరుసటి రోజు తలకు స్నానం చేయాలా అని బెంగ పెట్టుకోకండి. అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. వారానికి రెండు సార్లు చేస్తే చాలు. ఈ బియ్యం నీటి రెసిపీని జుట్టుకు వాడడం ప్రారంభించాక నెల రోజుల్లోనే మీకు ఎంతో తేడా కనిపిస్తుంది. జుట్టు పొడవుగా పెరగడం మొదలవుతుంది. జుట్టుకు మెరుపు కూడా దక్కుతుంది. అంతేకాదు వెంట్రుకలు బలంగా మారుతాయి. జుట్టు పట్టుకుచ్చుల్లా మెరవడం మొదలవుతుంది.
బయట ఖరీదైన షాంపూలు, కండిషనర్లు, హెయిర్ సీరమ్ లు వంటివి కొనే బదులు ఇలా బియ్యం నీటి చిట్కాను పాటించారంటే మీకు డబ్బు ఎంతో ఆదా అవుతుంది. కేవలం 100 గ్రాముల బియ్యం నీటితో మీరు నెల రోజులకి సరిపడా బియ్యం నీటిని తయారు చేసుకోవచ్చు. ఇది కేవలం పెద్దలే కాదు పిల్లలు కూడా వాడుకోవచ్చు. దీనిలో మనం ఎలాంటి రసాయనాలు కలపలేదు. ఇది పూర్తిగా సేంద్రీయం పద్ధతిలో తయారైనది. కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండవు. పైగా మీ జుట్టును చాలా వేగంగా పెరిగేలా చేస్తుంది.