BigTV English

Airoplane: విమానాన్ని ల్యాండ్ చేస్తున్నప్పుడు పైలెట్ కు దారి ఎలా కనిపిస్తుందో తెలుసా? ఈ వీడియో చూస్తే భయంతో వణికిపోతారు

Airoplane: విమానాన్ని ల్యాండ్ చేస్తున్నప్పుడు పైలెట్ కు దారి ఎలా కనిపిస్తుందో తెలుసా? ఈ వీడియో చూస్తే భయంతో వణికిపోతారు

విమానంలో ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కిటికీ పక్కన సీటు కావాలని కోరుకుంటారు. ఆ సీట్లో కూర్చొని అందమైన మేఘాలను చూడాలని భావిస్తారు. అలాగే విమానం ల్యాండ్ అయినప్పుడు టేకాఫ్ అయినప్పుడు కూడా నగరం ఎంతో అందంగా పైనుంచి కనిపిస్తుంది. అయితే ఒక్క నిమిషం ఆలోచించండి… విమానం నడుపుతున్న పైలెట్ కు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తాయో తెలుసా?


విమానాన్ని ఎలా నడుపుతారంటే
రోడ్డుమీద వెళుతున్న బస్సు డ్రైవర్ కు ఎదురుగా ఉన్న ప్రతి వాహనం కనిపిస్తుంది. కానీ విమానంలో ఉన్న పైలేట్ కు అలా ఏదీ కనిపించదు. అతడు ముందున్న దారిని చూసి నడుపుతారని ఎంతోమంది అనుకుంటారు. నిజానికి విమానాన్ని ముందున్న దారిని చూసి నడపరు. సిగ్నల్స్ ప్రకారం పైలెట్ దాన్ని ముందుకు నడిపిస్తాడు. ఇక విమానం ల్యాండ్ అవుతున్నప్పుడు కాక్ పిట్ లోపల ఉన్న పైలెట్ కు నగరం అంతా కనిపిస్తుందని, రన్ వే కూడా కనిపిస్తుందని ఎక్కువమంది అనుకుంటారు. అలా అనుకుంటే మీ భ్రమే.

?utm_source=ig_web_copy_link">

 


ల్యాండింగ్ చేసేటప్పుడు పైలెట్ కు ఎలాంటి దృశ్యాలు కనిపిస్తాయో… ఈ వీడియోలో చూడండి. మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. భయంతో విమానం కూడా ఎక్కరు. కాక్ పిట్ లోపల నుండి ఈ వీడియోను తీశారు. పైలెట్ లాండింగ్ చేస్తున్నప్పుడు అతడికి నగరం లేదా ఎయిర్ పోర్టు, రన్ వే అనేవి ఎంతవరకు కనిపిస్తాయో దీని ద్వారా తెలుస్తుంది. విమానం లోపల కూర్చున్న ప్రయాణికులకు పైలెట్ ను నమ్మి హాయిగా ప్రయాణిస్తారు. పైలట్ నిపుణుడిగానే ఉంటాడు. ప్రయాణికులకు ఏమీ కాకూడదని భావిస్తాడు. అయితే లాండింగ్ సమయంలో మాత్రం పైలెట్ కు కంటి ముందు మేఘాలు మాత్రమే కనిపిస్తాయి. ఈ వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమవుతుంది.

ల్యాండింగ్ చేయడం కష్టం
విమానాన్ని టేకాఫ్ చేయడం కంటే ల్యాండింగ్ చేయడమే చాలా కష్టం. ఎందుకంటే టేకాఫ్ చేస్తున్నప్పుడు పైలెట్ కు ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. కానీ లాండింగ్ చేస్తున్నప్పుడు అతని ముందు మేఘాలు తప్ప ఏమీ కనిపించవు. ఆ మేఘాల నుంచి కిందకు దిగిన తర్వాతే ఎయిర్ పోర్టు, రన్ వే వంటివి కనిపిస్తాయి. దట్టమైన మేఘాల పొర గుండానే చాలా వరకు విమానం ప్రయాణిస్తుంది. ఈ వీడియోలో కూడా మీకు అలాంటి దృశ్యమే కనిపిస్తుంది. ఈ మేఘాల వల్ల పైలెట్ కూడా ఏమీ చూడలేని పరిస్థితి అంతా తెల్లగా ఉంటుంది. అకస్మాత్తుగా విమానం కిందకి దిగి రన్ వే పైకి వస్తుంది.

ఈ వీడియోను చూసిన చాలా మంది భయంతో వణికి పోయారు. ముఖ్యంగా మొన్ననే అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదంతో ఎంతోమంది ఆ ప్రయాణం చేయాలంటేనే భయపడుతున్నా.రు ఈ వీడియోను ఇప్పటివరకు రెండు కోట్లకు పైగా వీక్షించారు. ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో ‘ఇన్‌సైడ్ హిస్టరీ’ అనే ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది వైరల్ వీడియోగా మారింది. ఒక్కసారి మీరు కూడా చూస్తే విమానం ఎక్కిన ప్రతిసారీ మీకు ఇదే దృశ్యం కంటి ముందు కదులుతుంది.

Related News

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Hill Stations: హిల్ స్టేషన్స్ కు ఎగేసుకు వెళ్తున్నారా? అయితే, మీ పని అయిపోయినట్లే!

Big Stories

×