BigTV English

Fruits for Liver: మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలా? ఇక ఈ ఐదు పండ్లు వారంలో కనీసం ఒక్కసారైనా తినండి

Fruits for Liver: మీ కాలేయం ఆరోగ్యంగా ఉండాలా? ఇక ఈ ఐదు పండ్లు వారంలో కనీసం ఒక్కసారైనా తినండి

మనిషి శరీరంలో ప్రధానమైన అవయవాల్లో కాలేయం ఒకటి. అది దెబ్బతింటే ఆ వ్యక్తి జీవితం అనారోగ్యంతో నిండిపోతుంది. కాబట్టి కాలేయ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని రకాల పండ్లను ప్రతిరోజు తినడం వల్ల కాలేయాన్ని కాపాడుకోవచ్చు. ఇక్కడ మేము ఐదు రకాల పండ్ల గురించి ఇచ్చాము. వారంలో ఈ ఐదు రకాల పండ్లను కనీసం ఒక్కసారైనా తినేందుకు ప్రయత్నించండి. దీనివల్ల వారంలో ఐదు రోజులు మీరు పండ్లు తినాల్సి వస్తుంది. దీనివల్ల మీ కాలేయ ఆరోగ్యంలో ఎంతో మెరుగుదల కనిపిస్తుంది. ఇక కాలేయ ఆరోగ్యం కోసం ఎలాంటి పండ్లు తినాలో తెలుసుకోండి.


ఆపిల్ పండ్లు
ప్రతిరోజు ఒక ఆపిల్ తినడం వల్ల కాలేయ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఆపిల్స్ లో పెప్టిన్ అధికంగా ఉంటుంది. ఇది కరిగే ఫైబర్ శరీరంలోని విషాలను బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది. ఈ ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి కాలేయంపై ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే ఆపిల్ పండులో పాలీఫెనాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి కాలేయాన్ని గాయాల బారిన పడకుండా రక్షిస్తాయి.

బ్లూ బెర్రీస్
బ్లూ బెర్రీ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆంథోసైనిన్ అని పిలిచే సమ్మేళనం ఉంటుంది. ఈ సమ్మేళనం వల్లే బ్లూ బెర్రీస్ కి ప్రకాశంవంతమైన నీలంరంగు వస్తుంది. ఈ సమ్మేళనం కాలేయంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. 2021లో చేసిన అధ్యయనం ప్రకారం బ్లూబెర్రీలను ఆరు నెలల పాటు వరుసగా తీసుకుంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీస్ ఉన్న వారిలో కాలేయ సమస్యలు చాలా వరకు తగ్గాయని నిరూపణ అయింది. ఇది కాలేయంలో వాపును కూడా తగ్గిస్తుంది.


అవకాడో
అవకాడో కాస్త ఖరీదైన పండు. కానీ వారానికి ఒక్కసారి తింటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పండులో మోనో అన్ శాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు కూడా కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటు లిపిడ్ ప్రొఫైల్ ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే లక్షణాలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ రాకుండా అడ్డుకుంటుంది. ఇది మన శరీరాన్ని డిటాక్స్ఫికేషన్ చేయడంలో సహాయపడుతుంది. విషాలను కూడా తొలగిస్తుంది.

ద్రాక్ష
ద్రాక్ష పండ్లు తినడం వల్ల కూడా కాలేయానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ద్రాక్షలో కాలేయ వాపును తగ్గించి కణాల నష్టాన్ని నివారించే లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ పండ్లు యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలను కూడా తగ్గిస్తాయి. ద్రాక్షలో ఊదా రంగు, ఎరుపు రంగులో ఉన్న పండ్లను తినడం చాలా ముఖ్యం. ఇవి కాలేయం ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.

నారింజ
నారింజ పండ్లు సువాసన వచ్చిందంటే తినాలన్న కోరిక పెరిగిపోతుంది. వీటిని తినడం వల్ల కాలేయం ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లలో కూడా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే కాలేయాన్ని శుభ్రపరచడానికి నారింజలు ఉపయోగపడతాయి.

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×