Priyamani: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న ప్రియమణి (Priyamani) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే ప్రముఖ నటిగా పేరు సొంతం చేసుకుంది. అమాయకత్వం, డీ గ్లామరస్ , యాక్షన్ పర్ఫామెన్స్ ఇలా ఏదైనా సరే పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటిస్తూ ఉంటుంది. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకున్న ఈమె.. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో బుల్లితెరపై పలు డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి ప్రియమణి తాజాగా ఇండస్ట్రీలో ఆ చీకటి దందా నడుస్తోంది అంటూ స్టార్ సెలబ్రిటీల రహస్యాలను ఒక్కసారిగా బట్ట బయలు చేసింది ప్రియమణి. మరి ఇండస్ట్రీలో జరుగుతున్న ఆ చీకటి దందా ఏంటో ఇప్పుడు చూద్దాం.
బాలీవుడ్ మొత్తం పపరాజ్జి కల్చర్ ఎక్కువ..
సాధారణంగా ముంబైలో సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా సరే ఫోటోగ్రాఫర్లు వారిని చుట్టిముట్టి, వారి అనుమతి లేకుండానే ఫోటోలు, వీడియోలు తీస్తూ ఉంటారు. అయితే కొంతమంది వీరిని పట్టించుకోకుండా వెళ్ళిపోతే.. మరికొంతమంది ఈ ఫోటోగ్రాఫర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ ట్రెండ్ ని అక్కడ “పపరాజ్జి కల్చర్”అని పిలుస్తూ ఉంటారు. అంతేకాదు దీనిని PAP (Project Affected People) అని కూడా పిలుస్తూ ఉంటారు.
వారే టార్గెట్..
ముఖ్యంగా సినీ నటులు, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్, క్రీడాకారులు ఇలా పలువురు సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేస్ లో కనిపిస్తే చాలు.. వీరి వెంటపడి మరీ ఫోటోలు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటారు.. ఈ మధ్యకాలంలో ఈ సంస్కృతి అక్కడ విపరీతంగా పెరిగిపోయింది.
ఇండస్ట్రీలో ఇదొక చీకటి దందా – ప్రియమణి..
ఇది చూసిన సామాన్యులు, నెటిజన్స్ కూడా సెలబ్రిటీలను ఎందుకు ఈ ఫోటోగ్రాఫర్లు అంతలా ఇబ్బంది పెడతారని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంపై ప్రియమణి స్పందిస్తూ..”ఇదంతా ఒక పీఆర్ స్ట్రాటజీ” అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది. ఇప్పుడు సమంత (Samantha)ఘటన బయటకు రావడంతో.. ప్రియమణి పాత వీడియో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. గత ఏడాది ఆహా ఓటీటీ వేదికగా ప్రియమణి ‘భామా కలాపం 2’ వెబ్ సిరీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే.
పపరాజ్జి కల్చర్ గుట్టు రట్టు చేసిన ప్రియమణి..
ఈ ప్రమోషన్స్ లో ఆమె మాట్లాడుతూ..” పపరాజ్జి కల్చర్ అంతా ట్రాష్. సెలబ్రిటీలే డబ్బులు ఇచ్చి వారితో ఇలా ఫోటోలు తీయించుకుంటారు. అయితే మొదట నాకు ఈ విషయం అర్థం కాలేదు. చాలామంది సెలబ్రిటీల వెంట ఫోటోగ్రాఫర్లు వెంటపడడం చూశాను. అప్పుడు నేను కూడా సెలబ్రిటీనే కదా నా వెనుక ఎందుకు వీరంతా రాలేదు అని.. సాధారణంగా చాటింగ్లో భాగంగా ముంబైలోని ఒక ఏజెన్సీ వ్యక్తితో చాట్ చేయగా.. అతను నాకు చార్జీల వివరాలు పంపించారు. బాలీవుడ్ ప్రముఖులు ఇలా పే చేస్తారని చెప్పడంతో ఒక్కసారిగా నేను ఆశ్చర్యపోయాను” అంటూ ప్రియమణి తెలిపింది.
సమంత కూడా ఇలాగే చేయించిందా?
ఇక ప్రియమణి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఇప్పుడు సమంతా కూడా ఇలాగే చేయించుకుందా అంటూ కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమైనా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు డబ్బులు ఇచ్చి మరీ ఫోటోగ్రాఫర్లను పెట్టుకుంటున్నారు అని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో పాటు పలు రకాల కామెంట్లు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియమణి చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:8 Vasanthalu Heroine : 19 ఏళ్లకే ఇంత టాలెంటా… అమ్మాయిలూ చూసి కాస్త నేర్చుకోండి!
ఏంటో ఈ దారుణాలు… 🙏🙏#bollywoodactress #SamanthaRuthPrabhu #Samantha #Priyamani #Jawan pic.twitter.com/BsYufRH04q
— Megha (@MovieloverMegha) June 18, 2025