Najmul Hassan Shanto: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 – 27 సీజన్ జూన్ 17వ తేదీతో ప్రారంభమైంది. గల్లే వేదికగా శ్రీలంక – బంగ్లాదేశ్ {BAN vs SL} జట్ల మధ్య ఈ సీజన్ లోని తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్ లో ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ {WTC} టైటిల్ ని సొంతం చేసుకోవాలని ప్రతి జుట్టు ఉవ్విళ్లూరుతోంది. జోన్ 17న ప్రారంభమైన తొలి టెస్ట్ 21వ తేదీ వరకు, రెండో టెస్టు జూన్ 25 నుండి 29వ తేదీ వరకు జరుగుతుంది.
Also Read: Riyan Parag: ఆ అందాల తారను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పరాగ్.. !
అయితే గల్లె వేదికగా ప్రారంభమైన తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో రాణించింది. తొలిరోజు ఆట ముదిసే సమయానికి బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. క్రీజ్ లో బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో {136*}, వికెట్ కీపర్ కం బ్యాటర్ ముష్ఫికర్ రహీం {105*} పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
శ్రీలంక బౌలర్లలో తరిందు రత్నయకే 2, ఆషిత ఫెర్నాండో ఒక వికెట్ పడగొట్టారు. అయితే బంగ్లాదేశ్ కెప్టెన్ హుస్సేన్ షాంటో సెంచరీ చేసిన సందర్భంగా సెలబ్రేట్ చేసుకునే సమయంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ విజువల్స్ చూసిన క్రీడాభిమానులు బంగ్లాదేశ్ కెప్టెన్ పై హ** యత్నం జరిగిందని కామెంట్స్ చేస్తున్నారు. బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో సెంచరీ చేసి సెలబ్రేట్ చేసుకుంటున్న సమయంలో ఫీల్డర్ బంతిని అతడి వైపు విసిరాడు.
అది షాంటో రెండు కాళ్ల మధ్యలో నుండి వెళ్లింది. ఆ బంతి ఇంకాస్త పైకి వచ్చి ఉంటే అతడి ప్రాణాలకే ముప్పు వాటిల్లేదని అంటున్నారు క్రీడాభిమానులు. మరికొంతమంది నెటిజెన్లు మాత్రం ఈ వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆ బంతి నుండి తప్పించుకున్న నజ్ముల్ హుస్సేన్ షాంటో వెంటనే కింద కూర్చొని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. నిజానికి క్రికెట్ ని జెంటిల్మెన్ గేమ్ అంటారు. మిగిలిన ఆటలతో పోలిస్తే క్రికెటర్లు హుందాగా ఆడతారని ఈ పేరు వచ్చింది. కానీ తాజాగా జరిగిన ఈ సంఘటన మాత్రం క్రీడాభిమానులను షాక్ కి గురి చేసింది.
Also Read: Stuart Broad: ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించిన బుమ్రా… ఒకే ఓవర్ లో 35 పరుగులు
మ్యాచ్ మధ్యలో ఇరుజట్ల ఆటగాళ్లు చిన్నపాటి గొడవలు పడడం సహజమే. స్లెడ్జింగ్ చేసుకోవడం, చూపులతో కవ్వించుకోవడం, మాటలతో రెచ్చగొట్టేలా చేయడం చూశాం. కానీ ఇటువంటి సంఘటనలు మాత్రం సరైంది కాదని అంటున్నారు క్రీడా పండితులు. ఇక ఈ తొలి టెస్ట్ రెండవ రోజు మ్యాచ్ మరింత ఆసక్తిగా కొనసాగుతోంది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 3 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. కెప్టెన్ హుస్సేన్ షాంటో {148*}, ముష్ఫికుర్ రహీం {110} పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
Who spoilt his celebration ? Whenever Bangladesh plays Sri Lanka, something like this happens.. 😂 #SLVBAN pic.twitter.com/cqQJt7dfTL
— Nibraz Ramzan (@nibraz88cricket) June 17, 2025