BigTV English

Breast Cancer: బిగుతైన లోదుస్తులు ధరిస్తున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..

Breast Cancer: బిగుతైన లోదుస్తులు ధరిస్తున్నారా..? ఎంత ప్రమాదమో తెలుసా..

Breast Cancer: తరచూ బిగుతైన లోదుస్తులు ధరిస్తుంటారు కొంతమంది మహిళలు. శరీర ఆకృతి అందంగా కనిపించాలని రకరకాల లోదుస్తులు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. ఈ తరుణంలో చాలా మంది మహిళలు ప్యాడెడ్ బ్రా అంటూ వివిధ రకాల బ్రాలు బిగుతుగా ఉండేవి ధరిస్తుంటారు. దీని కారణంగా ప్రాణాంతకరమైన రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారని చాలా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి లోదుస్తులు ధరించడం వల్ల రొమ్ములో రక్తం, శోషరస ప్రవాహానికి ఆటంకం కలుగుతుంది. అందువల్ల రొమ్ములో విష పదార్థాలు పేరుకుపోయి క్యాన్సర్‌కు కారణమవుతుందనడంలో ఎటువంటి వాస్తవం లేదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు.


బిగుతుగా ఉండే బ్రాలు ధరించడం వల్ల రొమ్ము కణజాలాలలో కుదింపు ఏర్పడుతుంది. దీని వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. చాలా బిగుతుగా ఉండే బ్రా లేదా అండర్‌వైర్ బ్రా ధరించడం వల్ల శోషరస కణుపులలో రక్త ప్రసరణ దెబ్బతింటుందనడం అవాస్తవం అని అంటున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించాలి..


బ్రాను ఎంచుకునేటప్పుడు సౌలభ్యం మరియు ఫిట్‌మెంట్‌పై శ్రద్ధ చూపడం కూడా చాలా ముఖ్యం. బిగుతుగా ఉండే బ్రాలు అసౌకర్యాన్ని కలిగిస్తాయి మరియు చర్మంపై గుర్తులు లేదా చికాకును కలిగిస్తాయి.

ఇవే కారణాలు కావచ్చు..

రొమ్ము క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు జన్యుపరమైన అంశాలు, హార్మోన్ల మార్పులు, వయస్సు మరియు జీవనశైలి కారకాలు కావచ్చని నిపుణులు అంటున్నారు. రొమ్ము క్యాన్సర్‌కు అత్యంత ముఖ్యమైన ప్రమాద కారకం BRCA1 మరియు BRCA2 జన్యువులలో ఉత్పరివర్తనలు. మరోవైపు, దీర్ఘకాలిక హార్మోన్ల చికిత్స, అధిక ఆల్కహాల్ వినియోగం, ఊబకాయం మరియు శారీరక శ్రమ లేకపోవడం కూడా ప్రమాదాన్ని పెంచుతుంది. బ్రా ధరించడం మరియు రొమ్ము క్యాన్సర్ మధ్య ప్రత్యక్ష శాస్త్రీయ సంబంధం లేదని వివరిస్తున్నారు. మహిళలు తమ సౌలభ్యం మరియు సౌకర్యాన్ని బట్టి బ్రాను ఎంచుకోవాలని కూడా సూచిస్తున్నారు.

కాగా, ఇటీవల నటి హీనా ఖాన్ రొమ్ము క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని, చికిత్స పొందుతున్నానని చెప్పారు. వాస్తవానికి రొమ్ము క్యాన్సర్‌లో రొమ్ము కణాలు అసాధారణంగా పెరగడం ప్రారంభిస్తాయి. తరువాత అవి కణితి రూపంలోకి మారుతాయి. అయితే హీనా ఖాన్ క్యాన్సర్ బారిన పడినట్లు వెల్లడించడంతో చాలా మంది మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లోదుస్తులు బిగుతుగా ధరించడం వల్లే క్యాన్సర్ వంటి ప్రమాదానికి హీనా గురైందని చాలా రకాల ప్రశ్నలు తలెత్తాయి. అయితే రొమ్ము క్యాన్సర్ కు లోదుస్తులు ధరించడం అనేది సమస్య కాదని నిపుణులు వివరిస్తున్నారు.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×