Blood Transfusion: ఎవరికైనా రక్తం ఎక్కించాల్సి వచ్చినప్పుడు ముందుగా సదరు వ్యక్తి బ్లడ్ గ్రూప్ తెలుసుకుంటారు. తర్వాత అతడి బ్లడ్ గ్రూప్‌కు సరిపోయే రక్తం ఎక్కిస్తారు. మరి పొరపాటున తప్పుడు బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే ఏం జరుగుతుందని మీరెప్పుడైనా ఆలోచించారా ? మరి ఇందుకు సంబంధించిన సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలో రక్తం చాలా ముఖ్మమైంది. రక్తం శరీరంలోని ప్రతి మూలకు ఆక్సిజన్ తో పాటు పోషకాలను చేరవేస్తుంది. రక్తం లేకపోతే మన శరీరం పనిచేయదు. రక్తం శరీరంలో తగినంతగా లేకపోయినా ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఆస్పత్రులకు వెళ్లినప్పుడు డాక్టర్లు ముందుగా రక్త పరీక్షలు చేయించుకోమని సలహా ఇస్తారు. ఈ పరీక్ష ద్వారానే మన శరీరంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది. రక్తం తక్కువగా ఉన్న సమయంలో ఇతరుల బ్లడ్ ఎక్కిస్తారు. ఆ సమయంలోనే వారికి ఆరోగ్య పరీక్షలు కూడా నిర్వహిస్తారు. తర్వాతే బ్లడ్ గ్రూప్ సరిపోతుందో లేదో చూసి పేషెంట్ల శరీరంలోకి ఎక్కిస్తారు.
ఇదిలా ఉంటే.. రక్తం శరీరంలో తక్కువయినప్పుడు డాక్టర్లు వారికి రక్త మార్పిడి చేయాలని చెబుతారు. A,B,AB,O అనే బ్లడ్ గ్రూపులు ఉన్నాయి. అయితే మనలో ఉండే బ్లడ్ గ్రూప్ కాకుండా శరీరంలో రక్తం తగ్గినప్పుడు వేరొక బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే.. తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. మన రక్తంలో అనేక రకాల కణాలతో పాటు ద్రవంతో నిర్మితం అయింది. ఈ ద్రావన్ని ప్లాస్మా అని అంటారు. ఎర్ర రక్త కణాలు రక్తంలో ఉంటాయి. అంతే కాకుండా రక్త కణాల ఉపరితలంపై కొన్ని పదార్థాలు కూడా ఉంటాయి. వీటిని యాంటిజెన్ అని అంటారు. యాంటిజెన్‌లు ద్వారా బ్లడ్ గ్రూప్ నిర్ణయించడుతుంది.
తప్పుడు బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే ?
రక్తం ఎక్కించినప్పుడు రక్త పరీక్ష నిర్వహించి సరైన బ్లడ్ గ్రూప్ ఎంచుకోవాలి. తప్పుడు బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే వ్యక్తి అనారోగ్యానికి గురై చనిపోయే ప్రమాదం ఉంటుంది.
తప్పుడు బ్లడ్ గ్రూప్ ఎక్కిస్తే శరీరం రక్తంతో ప్రతిస్పందిస్తుంది. అందుకే రక్త మార్పిడికి ముందు డాక్టర్లు చాలా జాగ్రత్తగా రక్త పరీక్షలు చేస్తారు. ఇదిలా ఉంటే కొంత మందికి సరైన బ్లడ్ గ్రూప్ ఎక్కించినా అలెర్జీ లాంటి సమస్యలు వస్తాయి. దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో యాంటీ బయాటిక్స్ సహాయంతో తగ్గించుకోవచ్చు.
Also Read: మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ?
రక్త దానంతో పాటు రక్తం తీసుకునే వ్యక్తులు జాగ్రత్తలు తీసుకోవాలి. క్రాస్ మ్యాచింగ్ టెస్ట్ మార్పిడికి ముందు నిర్వహించాలి. రక్త మార్పిడి సమయంలో డాక్టర్లు చిన్న పొరపాటు చేసినా కూడా పేషెంట్ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే క్రాస్ మ్యాచింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.