ఇప్పుడంటే డైనింగ్ టేబుల్ వాడుతున్నారు. కానీ ఒకప్పుడు ప్రజలు కిందే కూర్చొని తినేవారు. ఇప్పటికీ కూడా ఇదే నియమాన్ని పాటిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. గ్రామాలలో కూడా కింద కూర్చొని భోజనం చేసేందుకే ప్రాధాన్యత ఇస్తారు. పురాతన కాలంలో వంట గదులు పెద్దవిగా ఉండేవి. భోజనం వండాక వంట గదిలోనే భోజనం చేసి బయటికి వచ్చేవారు. కానీ ఇప్పుడు వంటగది సన్నబడిపోయింది. డైనింగ్ ఏరియా అంటూ సెపరేటుగా ఒక ప్రాంతం పుట్టుకొచ్చింది. అయితే వాస్తు ప్రకారం చెప్పుకోవాలంటే వంటగదిలోని నేలపై కూర్చుని తినడమే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. దీనికి ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి.
ఒక వ్యక్తి ఆరోగ్యంగా, సంతోషంగా ఉండడానికే పురాతన కాలం నుంచి కొన్ని రకాల సాంప్రదాయాలను సృష్టించారు. ప్రతి ఇంట్లోనూ వంటగది ఉంటుంది. ఇది అత్యంత పవిత్రమైనదిగా చూస్తారు. ఇక్కడ కూర్చుని భోజనం చేయడం వల్ల ఆహారం సంపూర్ణంగా తిన్న ఫీలింగ్ వస్తుందట. వాస్తు ప్రకారం వంటగదిలోనే కూర్చొని భోజనం చేయడం వల్ల అన్నపూర్ణాదేవి సంతోషిస్తుందని ఆమె ఇంట్లోనే నివసిస్తుందని చెప్పుకుంటారు. అన్నపూర్ణాదేవి అంటే మనకు ఆహారాన్ని అందించే అధి దేవత. అన్నపూర్ణాదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే వంటగదిలోనే నేలపై కూర్చుని తింటే మంచిదని చెబుతారు.
రాహువును ప్రసన్నం చేసేందుకు
తొమ్మిది గ్రహాలలో దుష్ట గ్రహం రాహువు. రాహువు ఏమాత్రం సరైన స్థానంలో లేకపోయినా కూడా ఆ జాతకుడికి కష్టాలే. అయితే రాహువు శాంతింప చేయడానికి లేదా ప్రసన్నం చేసుకోవడానికి వంటగదిలో కూర్చుని ఆహారం తినడం అనేది ఒక మంచి పద్ధతి. వంటగదిలో కూర్చుని ఆహారం తీసుకుంటే రాహువు మనపై చెడు ప్రభావం చూపుతాడని చెబుతారు. అంతేకాదు ప్రాచీన కాలంలో వంటగదిలోనే కుటుంబమంతా కూర్చొని తినేవారు. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కష్టసుఖాలను పంచుకునేవారు. దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య మంచి బంధం ఏర్పడేది. అందుకే పురాతన ఇళ్లల్లో ఇప్పటికీ వంటగదిలో పెద్దవిగా ఉంటాయి.
పద్మాసనం ఉపయోగాలు
వంటగదిలో చిన్నవిగా ఉన్నవారు వీలైనంతవరకు లివింగ్ రూమ్ లోనైనా కింద కూర్చొని తినడానికి ప్రయత్నించండి. ఇది మన సంస్కృతి సంప్రదాయాల్లో భాగం. దీనికి సైన్స్ పరంగా ఎలాంటి ఆధారం లేకపోయినా సాంప్రదాయపరంగా మాత్రం ఎంతో విలువ ఉంది. మనం నేల మీద కూర్చొని అన్నం తిన్నప్పుడు పద్మాసనం వేసుకుంటాము. ఈ పద్మాసనం అనేది ఆరోగ్యపరంగా ఎంతో ఉపయోగకరం. పద్మాసనం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పొట్ట సంబంధిత సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
కాబట్టి రాహువు నుంచి తప్పించుకోవడానికి అన్నపూర్ణాదేవిని ప్రసన్నం చేసుకోవడానికి వీలైనంతవరకు వంటగదిలో కింద కూర్చొని భుజించేందుకు ప్రయత్నించండి. వంటగది చిన్నదిగా ఉన్నవారు ఇంట్లో లివింగ్ రూమ్ లేదా డైనింగ్ ఏరియాలో పద్మాసనం వేసుకొని కింద కూర్చొని భోజనం చేయండి. ఇది మీకు అన్ని విధాలా మేలే చేస్తుంది.
Also Read: బ్రెడ్, పీనట్ బటర్ తింటే ఇన్ని ప్రయోజనాలా ?
కింద కూర్చొని తినడం, తిన్నాక లేవడం కూడా మంచి వ్యాయామం అనే చెప్పాలి. తిన్నది శరీరానికి ఒంటబట్టాలంటే ఆరోగ్యకరమైన పద్ధతిలోనే ఇలా భోజనం చేయాలి. సంప్రదాయ పద్ధతులకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంది.